Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

అనుమానాలు రేకెత్తిస్తున్న కేసీఆర్ సుదీర్ఘ ఢిల్లీ టూర్!

అనుమానాలు రేకెత్తిస్తున్న కేసీఆర్ సుదీర్ఘ ఢిల్లీ టూర్
-9 రోజులపాటు ఢిల్లీ లో గడిపిన కేసీఆర్
-ప్రధానితో సహా పలువురి ప్రముఖులను కలిసిన కేసీఆర్
ముగిసిన ఢిల్లీ పర్యటన.. హైదరాబాద్ చేరుకున్న కేసీఆర్
ఈ నెల 1న ఢిల్లీకి వెళ్లిన కేసీఆర్
తొలిసారి 9 రోజులపాటు ఢిల్లీలో సీఎం
హైదరాబాద్ చేరుకున్న వెంటనే ‘నమస్తే తెలంగాణ’ ఎండీ దామోదర్‌రావు ఇంటికి
తండ్రి మరణించడంతో కుటుంబ సభ్యులకు పరామర్శ

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఢిల్లీ పర్యటనను ముగించుకుని తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. ఈ నెల 1న ఢిల్లీ వెళ్లిన ఆయన 9 రోజులపాటు ఢిల్లీలో బిజీగా గడిపారు. కేసీఆర్ ఢిల్లీ పర్యటన ఇంత సుదీర్ఘంగా ఉండడం ఇదే తొలిసారి. నిన్న మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి బయలుదేరిన కేసీఆర్ సాయంత్రం హైదరాబాదుకు చేరుకున్నారు. ఈ ఢిల్లీ పర్యాటన వెనక ఉన్న రహస్య ఎజెండా ఏమిటి ,ఎందుకు కేసీఆర్ ఇన్ని రోజులు ఢిల్లీ లో ఉన్నారు. అనేది సహజంగానే వచ్చే సందేహం . కేసీఆర్ అంటేనే ఒక రహస్యం … ఆయన ఏది చేసిన సంచలనమే. ఢిల్లీ లో టీఆర్ యస్ భవనం నిర్మాణానికి భూమి పూజ చేసేందుకు ఈ నెల 1 న ఢిల్లీ కి వెళ్లిన కేసీఆర్ ఒకరోజు కాదు రెండు రోజులు కాదు ఏకంగా 9 రోజులు ఢిల్లీ లో మకాం వేయటం వెనకాల ఉన్న కారణాలు ఏమైఉంటాయనే సందేహాలు కలగటం సహజం .ఆయన ప్రధాని నరేంద్రమోడీ , కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ను కలిశారు. రాష్ట్రాన్ని సంబందించిన అనేక విషయాల చిట్టాను వారికీ రాత పూర్వకంగా అందజేశారు. ప్రధానిని యాదాద్రి దేవస్థానం కొత్త శోభా సంతరించుకున్న అనంతరం జరిగే వేడుకలకు రావాలని ఆహ్వానించారు. అందుకు ప్రధాని కూడా సుముఖత వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చాయి.

ఇంతవరకు బాగానే ఉన్న మిగతా రాజులు ఢిల్లీ లో ఉన్న అధికారులను , మిగతా వారిని హైదరాబాద్ కు వెళ్ళమని చెప్పి మరో నాలుగు రోజులు అక్కడే ఉన్నారు .ఎందుకు ఉన్నారని అంటే ఒకసారి హెల్త్ చెక్ అప్ చేసుకుందామని , విశ్రాంతి కోసం ఉన్నారని సీఎంఓ వర్గాలు పేర్కొంటున్నాయి. ఢిల్లీ పర్యటనలో కేసీఆర్ ,ప్రధానికి మధ్య జరిగిన సంభాషణల్లో యూ పీ ఎన్నికలు గురించి చర్చించారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అంటున్నారు.యూ . పీ ఎన్నికలకు కేసీఆర్ కు సంబంధం ఏమిటి ? రేవంత్ ఆరోపణల్లో వాస్తవమెంత అనేది రాజకీయ పండితుల భావన .

ఢిల్లీ నుంచి గురువారం సాయంత్రం హైద్రాబాద్ వచ్చిన కేసీఆర్ ఆ వెంటనే ‘నమస్తే తెలంగాణ’ పత్రిక ఎండీ దామోదర్‌రావు ఇంటికి వెళ్లారు. ఈ నెల 2న ఆయన తండ్రి నారాయణరావు మరణించారు. ఈ నేపథ్యంలో ఆయన ఇంటికి వెళ్లిన కేసీఆర్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన తల్లి ఆండాళమ్మను ఓదార్చారు. ఈ సందర్భంగా నారాయణరావుతో తన అనుబంధాన్ని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు.

ఇక కేసీఆర్ తన ఢిల్లీ పర్యటనలో భాగంగా ఈ నెల 2న దేశ రాజధానిలో టీఆర్ఎస్ కార్యాలయ నిర్మాణానికి భూమి పూజ చేయగా, 3న ప్రధాని నరేంద్రమోదీతో భేటీ అయ్యారు. 4న అమిత్‌షా, 6న కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్, రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీలను కలిశారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ను కలవాలని భావించినప్పటికీ ఆయన ఢిల్లీలో అందుబాటులో లేకపోవడంతో అపాయింట్‌మెంట్ లభించలేదు. అనంతరం వైద్య పరీక్షలు చేయించుకున్న కేసీఆర్ తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు.

 

 

Related posts

ఏ మహిళను అవమానించినా అది సమాజానికి మంచిది కాదు: నారా భువనేశ్వరి!

Drukpadam

హైకోర్టు లో ఏపీ సర్కార్కు మరో ఎదురు దెబ్బ…

Drukpadam

నువ్వెంత? నీ బతుకెంత?: బీజేపీ కార్యకర్తపై బాబు మోహన్ ఆగ్రహం..

Drukpadam

Leave a Comment