Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

సాయిధర్మతేజ్ ప్రమాదం… నరేష్ మాటలపై మండిపడ్డ పలువురు…

సాయిధర్మతేజ్ ప్రమాదం… నరేష్ మాటలపై మండిపడ్డ పలువురు
-నరేశ్ గారూ… ఎప్పుడేం మాట్లాడాలో తెలియదా?: బండ్ల గణేశ్,నట్టి కుమార్
-సాయితేజ్ కు రోడ్డు ప్రమాదం
-నరేశ్ వ్యాఖ్యలకు పలువురి ఖండన
-ఎందుకు సార్ ఇలా మాట్లాడతారన్న బండ్ల సందర్భమా అన్న నట్టి

హీరో సాయితేజ్ కు రోడ్డు ప్రమాదం జరిగిన అనంతరం సీనియర్ నటుడు నరేశ్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. తాజాగా నరేశ్ వ్యాఖ్యలను నిర్మాత బండ్ల గణేశ్ ,నట్టి కుమారులు కూడా నరేష మాటలపై ఘాటుగానే స్పందించారు. సందర్భం లేకుండా మాట్లాడటంపై సరికాదని ఖండించారు. ఎప్పుడేం మాట్లాడాలో తెలియకపోతే ఎలా? అని అసహనం ప్రదర్శించారు. సాయితేజ్ త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగివస్తారని, యథావిధిగా షూటింగుల్లో పాల్గొంటారని, బ్రహ్మాండంగా ఉంటారని పేర్కొన్నారు. ఈ మేరకు బండ్ల గణేశ్ ఓ వీడియో విడుదల చేశారు.

“జరిగింది చిన్నప్రమాదమే. ఇలాంటి సమయంలో నరేశ్ గారు గతంలో ప్రమాదాల్లో మరణించినవారి పేర్లు చెప్పడం సబబు కాదు. రేసింగ్ చేశాడు, అది చేశాడు ఇది చేశాడు అని చెప్పడం అవసరమా సార్! మీ ఇంటికి దగ్గరికి వచ్చాడు… ఎందుకు ఇవన్నీ చెప్పడం… తప్పు కదూ! ఇలాంటి సమయాల్లో ఆ పరమేశ్వరుడ్ని ప్రార్థించాలి. అంతేతప్ప అసందర్భ విషయాలు మాట్లాడకూడదు. ఎప్పుడేం మాట్లాడాలో నేర్చుకోండి. సాయితేజ్ చిన్న ప్రమాదం నుంచి భగవంతుడి ఆశీస్సులతో క్షేమంగా బయటపడ్డాడు” అని బండ్ల గణేశ్ పేర్కొన్నారు.

నరేశ్ గారు.. బైక్ రేసుల గురించి ఇప్పుడు మాట్లాడొద్దు: నిర్మాత నట్టి కుమార్

 

సినీ హీరో సాయిధరమ్ తేజ్ ప్రమాదంపై సీనియర్ నటుడు నరేశ్ చేసిన వ్యాఖ్యలను సినీ నిర్మాత నట్టి కుమార్ తప్పుపట్టారు. సాయితేజ్ ను, తన కుమారుడు నవీన్ ను రేసింగ్ విషయంలో తాను హెచ్చరించానని నరేశ్ చెప్పారు. ఈ నేపథ్యంలో నట్టి కుమార్ మాట్లాడుతూ, ప్రస్తుత సమయంలో రాజకీయాలు వద్దని అన్నారు. సాయితేజ్ త్వరలోనే కోలుకుని, త్వరగా మళ్లీ షూటింగుల్లో పాల్గొనాలని అందరం ప్రార్థిద్దామని చెప్పారు.

నరేశ్ గారు మాట్లాడింది తనకు నచ్చలేదని నట్టి కుమార్ అన్నారు. ప్రమాద సమయంలో సాయితేజ్ రేసింగ్ చేయడం లేదని… మామూలు డ్రెస్ లోనే వెళ్తున్నారని చెప్పారు. మీ ఇంటి నుంచి సాయితేజ్ బయల్దేరి వచ్చినట్టు మీరు చెపుతున్నారని… మీరు చెపుతున్నది తప్పు అనిపిస్తోందని అన్నారు. ఆయన ఇంటి నుంచి ఆయన వెళ్తున్నారని… దుర్గం చెరువు నుంచి వెళ్తున్నారని చెప్పారు.

ప్రమాద సమయంలో తక్కువ స్పీడ్ లోనే తేజ్ వెళ్తున్నారని అన్నారు. రోడ్డుపై ఇసుక ఉండటం వల్ల దురదృష్టవశాత్తు స్కిడ్ అయ్యాడని చెప్పారు. రేసింగ్ అనే పాయింట్లు ఇప్పుడు వద్దని అన్నారు. సాయితేజ్, మీ అబ్బాయి ఇద్దరూ స్నేహితులు అంటున్నారు కాబట్టి రేసింగ్ విషయాలు పక్కన పెట్టి… సాయితేజ్ త్వరగా కోలుకోవాలని కోరుకుందామని నట్టి కుమార్ చెప్పారు.

సీనియర్ సినీ నటుడు నరేశ్ ఏమన్నారంటే ….

వేగంగా బైక్ ను నడుపుతూ సినీ హీరో సాయిధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. యాక్సిడెంట్ జరిగిన వెంటనే అపస్మారకస్థితిలోకి వెళ్లిన ఆయన ఆ తర్వాత స్పృహలోకి వచ్చారు. మరోవైపు ఈ ఘటనపై సీనియర్ సినీ నటుడు నరేశ్ స్పందించారు.

“సాయితేజ్, మా అబ్బాయి ఇద్దరూ మంచి స్నేహితులు. బ్రదర్స్ లా వుంటారు. సాయితేజ్ నా బిడ్డలాంటివాడు. త్వరగా కోలుకోవాలని భగవంతుణ్ణి కోరుకుంటున్నాను. నిన్న సాయంత్రం వీళ్లిద్దరూ మా ఇంటి నుంచే వెళ్లారు. వాళ్ల బైక్స్ సౌండ్ విని, వేగంగా వెళ్లొద్దని చెబుదామని బయటకు వచ్చాను. అంతలోనే ఇద్దరూ వెళ్లిపోయారు. బైకులు వేగంగా నడపొద్దని నాలుగు రోజుల క్రితం వీళ్లకి కౌన్సెలింగ్ ఇద్దామనుకున్నాను కూడా.

ఇద్దరూ పెళ్లి కావలసిన వాళ్లు, మంచి వయస్సులో వున్న వాళ్లు. ఇలాంటి వయసులో రిస్కులు తీసుకోకూడదు. గతంలో ఒకసారి నేను కూడా బైక్ ప్రమాదానికి గురైతే, మా అమ్మ నా చేత ఒట్టు వేయించుకుని, బైక్ నడపడం మానిపించారు. ఇప్పుడు అపోలో ఆసుపత్రికి వెళ్లి సాయిని పరామర్శించాలని వున్నా, అక్కడి పరిస్థితులను బట్టి వెళ్లలేకపోతున్నాను. త్వరలోనే వెళ్లి కలుస్తాను. సాయి పూర్తి ఆరోగ్యంతో ఇంటికి రావాలని కోరుకుంటున్నాను” అని చెప్పారు నరేశ్.

 

Related posts

ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ కు ఈడీ సమన్లు

Drukpadam

ప్రభుత్వ పథకాల కోసం అడ్డదారులు.. నకిలీ ధ్రువపత్రాలు తయారు చేసిన సచివాలయ ఉద్యోగులు.. వలంటీర్ అరెస్ట్

Ram Narayana

బావుల పనులకు అధికారి లంచం డిమాండ్..రూ. 2 లక్షలు వెదజల్లిన సర్పంచ్.. !

Drukpadam

Leave a Comment