Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

గుజరాత్ సీఎం రేసులో ముందున్నప్రఫుల్ ఖోదా పటేల్, ఆర్‌సీ ఫాల్దు ?

గుజరాత్ సీఎం రేసులో ముందున్నప్రఫుల్ ఖోదా పటేల్, ఆర్‌సీ ఫాల్దు ?
-సీఎం పదవికి విజయ్ రూపానీ రాజీనామా
-తెరమీదకు ప్రఫుల్ ఖోదా పటేల్, ఆర్‌సీ ఫాల్దు పేర్లు
-ప్రస్తుత ఎమ్మెల్యే కానీ వారికీ ఛాన్స్
-ఆదివారం గాంధీనగర్ లో శాసనసభ పక్ష సమావేశం

గుజరాత్ ముఖ్యమంత్రిగా విజయ్ రూపానీ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన రాజీనామాతో రాష్ట్ర ప్రభుత్వం కొత్త సీఎం కోసం వేట మొదలు పెట్టింది. ఈ క్రమంలోనే ఇద్దరు నేతల పేర్లు కొత్తగా తెరమీదకొచ్చాయి. ప్రఫుల్ ఖోదా పటేల్, ఆర్‌సీ ఫాల్దులలో ఎవరో ఒకరు సీఎం కావచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. ఉపముఖ్యమంత్రిగా ఉన్న నితిన్ పటేల్ పేరుకూడా వినపడుతుంది. అయితే బీజేపీ అధిష్టానం ఎవరివైపు మొగ్గుచూపుతోంది అనేది తేలాల్సివుంది. అధిష్టానం పరిశీలకులు గాంధీనగర్ వచ్చి ఎమ్మెల్యే ల అభిప్రాయాలు తీసుకుంటారు.

ప్రఫుల్ ఖోదా పటేల్ ప్రస్తుతం కేంద్ర పాలిత ప్రాంతాలైన లక్షద్వీప్, దాద్రానగర్ హవేలీ, డామన్ అండ్ డయ్యూల కార్యనిర్వాహక అధికారిగా పనిచేస్తున్నారు. ఇక ఆర్‌సీ ఫాల్దు ప్రస్తుత గుజరాత్ వ్యవసాయ మంత్రిగా పనిచేస్తున్నారు. వీరిద్దరిలో ఎవరో ఒకరిని ముఖ్యమంత్రిగా ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే బీజేపీ మాత్రం ఇప్పటివరకు గుజరాత్ సీఎంగా ఎవరినీ ఎంపిక చేయలేదని, ఎవరి పేర్లు కూడా పరిగణనలోకి తీసుకోలేదని తెలిపింది. అలాగే అవసరమైతే గుజరాత్‌‌లో ఎమ్మెల్యే కాని వారిని కూడా సీఎంగా ఎంపిక చేసే అవకాశం ఉందని పేర్కొంది.

కాగా.. రాజీనామా అనంతరం విజయ్ రూపానీ పేర్కొన్న విషయాలు కూడా ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ప్రధాని మోదీ నిర్దేశకత్వంలో గుజరాత్ అభివృద్ధి కోసం ఐదేళ్ల ప్రయాణం సాగించానని, ఇప్పుడు రాష్ట్రం కొత్త శక్తితో మరింత అభివృద్ధి వైపు సాగాలనే ఉద్దేశంతోనే తన పదవికి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు విజయ్ రూపానీ ప్రకటించారు.

పార్టీ అధిష్ఠానం ఏ బాధ్యతలు అప్పగించినా పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. దీంతో అధిష్ఠానం ఆదేశంతోనే ఆయన తన పదవికి రాజీనామా చేసినట్లు తేటతెల్లమైంది.

Related posts

పేదల డబుల్ బెడ్రూం ఇళ్లపై సెప్టెంబరు 4న విశ్వరూప ధర్నా: కిషన్ రెడ్డి

Ram Narayana

ప‌ద‌వులు శాశ్వ‌తం కాదు… మాజీ ఎంపీ పొంగులేటి కీల‌క వ్యాఖ్య‌లు!

Drukpadam

వైసీపీ రాజ్యసభ అభ్య‌ర్థుల‌ జాబితాలో లేని ఎస్సీ ,ఎస్టీ, మైనార్టీలు…

Drukpadam

Leave a Comment