Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

తెలంగాణలో నైజాం నాటి పరిస్థితులు సృష్టిస్తున్న బిజెపిది త్యాగల చరిత్ర కమ్యూనిస్టులది -చాడ వెంకటరెడ్డి

ఖమ్మం సభలో మాట్లాడుతున్న చాడ వెంకటరెడ్డి

తెలంగాణలో నైజాం నాటి పరిస్థితులు బిజెపిది

వక్రీకరణ త్యాగాల చరిత కమ్యూనిస్టులది

సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి పంచ్ డైలాగులకు కాలం చెల్లింది కూనంనేని.

ఖమ్మంలో సాయుధ పోరాట జాతాకు ఘన స్వాగతం పాత బస్టాండ్ వద్ద భారీ బహిరంగ సభ:


ఖమ్మం

: తెలంగాణలో నైజాం నాటి పరిస్థితులు పునరావృతమవుతున్నాయని పద్ధతి మార్చుకోకపోతే తగిన మూల్యం చెల్లించక తప్పదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి హెచ్చరించారు . తెలంగాణ సాయుధ పోరాటం ద్వారా 10 లక్షల ఎకరాల భూమిని కమ్యూనిస్టులు పంచితే ఇప్పటి పాలకులు పట్టాలున్న భూములను సైతం గుంజుకుంటున్నారని ఆయన ఆరోపించారు . సాయుధ పోరాట జాతా ఆదివారం ఖమ్మంజిల్లాలో పర్యటించింది.. ఖమ్మంజిల్లా సరిహద్దు పైనంపల్లి వద్ద జాతాకు కమ్యూనిస్టు శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. అక్కడి నుంచిర్యాలీగా బయలుదేరి నేలకొండపల్లి, గోకినేపల్లి, ఎం.వెంకటాయపాలెం, వరంగల్ క్రాస్ రోడ్డు మీదుగా ఖమ్మం చేరుకున్నారు. పాత బస్టాండ్ వద్ద జాతాకు స్వాగతం పలికారు. అనంతరం పాత బస్టాండ్ సమీపంలో బహిరంగ సభ నిర్వహించారు. ఎకె జానిమియా అధ్యక్షతన జరిగిన సభలో చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ అనేక దశాబ్దాలుగా భూమిని నమ్ముకుని సాగు చేసుకుంటున్న రైతులను బయటకు పంపే పని టీఆర్ఎస్ చేపట్టిందని ముఖ్యంగా పోడు రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా పోదును వదిలేది లేదని ఆయన స్పష్టం చేశారు. భూమి కోసం భూక్తి కోసం తెలంగాణ విముక్తి కోసం పోరాడిన ఘన చరిత్ర కమ్యూనిస్టు పార్టీలని అవనతమైతే మళ్లీ భూ పోరాటం చేపడతామని పోరు రైతులకు బాసటగా నిలిచి ప్రభుత్వ దుశ్చర్యలను ఎదుర్కొంటాకున్నారు. కమ్యూనిస్టుల త్యాగాలు లేకపోతే భారతదేశం. నడిబొడ్డున తెలంగాణ రావణ కష్టంలా రగులుతుండేదని నిజాం ప్రభుత్వం హైదరాబాద్ ఆజాది అని ప్రకటించిన నోరు మెదపలేదని ఆయన గుర్తు చేశారు. భూస్వాములు, దొరలు, దేశముఖ్ లు, జాగీర్దారులు, పటేళ్లు, పట్వారీల చేతుల్లో భూములు ఉండేవని ఇప్పుడు కూడా అదే పరిస్థితి తెలంగాణలో దాపురిస్తుందన్నారు. భూమి కొందరి చేతుల్లో పొగుపడుతుందని వేల ఎకరాలు కొందరి సొంతమవుతుందని దీనికి వ్యతిరేకంగా కమ్యూనిస్టు పార్టీ పోరాడుతుందన్నారు. నాలుగున్నర వేల మంది అమరుల బలిదానాలతో తెలంగాణ విముక్తి పొందిందని దీనిని బిజెపి వక్రీకరించే ప్రయత్నం చేస్తుందని వాడ తెలిపారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తెలంగాణ ప్రాంతానికి స్వాతంత్య్రం రాలేదని అందుకొరకు బిజెపి ఏం చేసిందో చెప్పాలని చాడ డిమాండ్ చేశారు. మసీబూసి మారెదుకాయ చేస్తున్న మతోన్మాద పార్టీ కుప్పిగంతుల వ్యవహారం తెలంగాణలో చెల్లదన్నారు. తెలంగాణ తొలి అమరవీరుడు దొడ్డి కొమరయ్య మొదలు. అనేక మంది వీరుల త్యాగాలు కమ్యూనిస్టు పార్టీ వెనక ఉన్నాయని తెలంగాణ సాయుధ పోరాట కాలంలో బిజెపి మతోన్మాద శక్తులు ఎక్కడ దాక్కున్నాయో చెప్పాలని ప్రశ్నించారు. మత విద్వేషాలను రెచ్చగొడుతూ కార్పొరేట్ శక్తులకు దేశాన్ని అమ్మేస్తున్న మోడీ రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్నారన్నారు. సాయుధ పోరాట స్ఫూర్తిగా ప్రజా ఉద్యమాలకు, భవిష్యత్తు పోరాటాలకు సిద్ధం కావాలని వాడు పిలుపునిచ్చారు.

పంచ్ డైలాగులకు కాలం చెల్లింది కూనంనేని. పంచ్ డైలాగులకు కాలం చెల్లిందని మాటలతో కాలం గడుపుతూ తొడలు కొట్టి, ఇబ్బలు చంచే వారి పని పట్టేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధమవుతున్నారని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలిపారు. అవకాశం దొరికితే కమ్యూనిస్టులను విమర్శించడం కొంత మందికి ఫ్యాషన్గా మారిందని గతం, వర్తమానం, భవిష్యత్తు లేని నేతలు ఊకదంపుడు ఉపన్యాసాలు చెబుతుంటారని కమ్యూనిస్టులను విమర్శించే ముందు మీరేం చేశారో ప్రజలకు చెబితే మంచిదని కూనంనేని సూచించాడు. బస్టాండ్ వద్ద జరిగిన బహిరంగ సభలో కూనంనేని మాట్లాడుతూ మీరు ప్రజల పక్షాన నిలువదల్చుకుంటే మీ పని మీరు చేయండి మా పని మేము చేస్తాం అంతే కానీ మమ్మల్ని విమర్శించడం ద్వారా మీరు లబ్దిపొందాలనుకుంటే లబ్ది చేకూరదు కదా కాలగర్భంలో కలిసి పోతారని కూనంనేని తెలిపారు. అప్పుడైనా, ఇప్పుడైనా, ఎప్పుడైనా పోరాటాలు చేసేది, త్యాగాలు చేసింది జైళ్లకు వెళ్లింది కమ్యూనిస్టులేనని సాంబశివరావు తెలిపారు. కమ్యూనిస్టులను విమర్శిస్తున్న షోకాల్డ్ నాయకుల్లారా మీరెప్పుడైనా త్రిళ్లకు వెళ్లారా మీ పార్టీ వాళ్లు ఎవరైనా ప్రజల కోసం ప్రాణాలు పోగొట్టుకున్నారా ప్రాణాలు పొగొట్టుకున్న చరిత్ర మారి, ప్రజల పక్షాన చివరి వరకు నిలిచేది మేమే. తెలంగాణ సాయుధ పోరాటానికి నిజమైన వారసులం మేము. మీరు వ్యక్తీకరిస్తే చరిత్ర చెరిగిపోదని సాంబశివరావు తెలిపారు. అధికారంలోకి రాకముందు తెలంగాణ విముక్తి దినాన్ని అధికారికంగా జరుపుతామని మాటిచ్చిన కేసీఆర్ మాట మరిచారని అందుకు తగిన మూల్యం చెల్లించక తప్పదని కూనంనేని స్పష్టం చేశారు. భవిష్యత్తు తరాల కోసం మరోక పోరాటానికి సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాగం హేమంతరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్ తదితరులు ప్రసంగించగా ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. కుమార్, జిల్లా సహాయ కార్యదర్శి దండి సురేష్ సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మహ్మద్ మౌలానా, జమ్ముల జితేందర్ రెడ్డి, సింగపూర్ నర్సింహారావు, బిజి క్లెమెంట్, పోటు కళావతి, యర్రా బాబు, మహ్మద్ సలాం తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఎస్సీ, ఎస్టీల కంటే ఓసీల ఆయుర్దాయమే ఎక్కువ.. తాజా అధ్యయనంలో వెల్లడి!

Drukpadam

అక్కడ భార్యకు ముద్దు పెట్టకూడదట ….

Drukpadam

ఎట్టకేలకు పిన్నెల్లి సోదరులపై పోలీసుల రౌడీషీట్?

Ram Narayana

Leave a Comment