Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

హరీశ్ రావ్! గుండె మీద చేయి వేసుకుని చెప్పు: ఈటల రాజేందర్ :ఈటలది మొసలి కన్నీరు: హరీశ్ రావు…

హరీశ్ రావ్! గుండె మీద చేయి వేసుకుని చెప్పు: ఈటల రాజేందర్ :ఈటలది మొసలి కన్నీరు: హరీశ్ రావు…
-హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో మాటలయుద్ధం…ఈటల వర్సెస్ హరీశ్ రావు
-నేను సీఎం కావాలనుకున్నానని హరీశ్ అబద్ధాలు చెపుతున్నారు
-టీఆర్ఎస్ లో హరీశ్ ఒక రబ్బరు స్టాంప్
-హరీశ్ మాదిరి నేను వారసత్వంతో రాజకీయాల్లోకి రాలేదు
-ఈటల తల్లిపాలు తాగి రొమ్ముగుద్దాడన్న హరీశ్
-తమది పనిచేసే ప్రభుత్వమని వెల్లడి

ఎన్నికల తేదీలు ఇంకా ప్రకటించలేదు ….అయినా హుజురాబాద్ లో ఈటల వర్సెస్ హరీష్ రావు లమధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. హరీష్ రావు నువ్వు గుండెమీద చేయివేసుకొని చెప్పు అంటే … ఈటల ముసలి కన్నీరు కారుస్తున్నారని హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. ఇద్దరు మధ్య జరుగుతున్నా ఈ వార్ ఆశక్తిగా మారింది…..

తెలంగాణ మంత్రి హరీశ్ రావు, మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ ల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. హుజూరాబాద్ ఉపఎన్నిక నేపథ్యంలో ఇరువురు తీవ్ర విమర్శలు చేసుకుంటూ వేడి పుట్టిస్తున్నారు. తాజాగా హరీశ్ పై ఈటల సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ పార్టీలో హరీశ్ రావు ఒక రబ్బరు స్టాంప్ వంటివారిని అన్నారు. తాను సీఎం కావాలని అనుకున్నానని హరీశ్ చేసిన వ్యాఖ్యల్లో నిజం లేదని చెప్పారు. ఈ విషయాన్ని హరీశ్ గుండెల మీద చేయి వేసుకుని చెప్పాలని అన్నారు.

పార్టీకి తాను రాజీనామా చేయలేదని… తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ పెట్టి రాజీనామా చేయాలని చెపితేనే చేశానని తెలిపారు. హరీశ్ కు ఆయన మామ కేసీఆర్ ఉన్నారని… ఆయన మాదిరి తాను వారసత్వంతో రాజకీయాల్లోకి రాలేదని చెప్పారు. అడుగులకు మడుగులు ఒత్తేవారికే ప్రగతి భవన్ లోకి ఎంట్రీ ఉంటుందని అన్నారు. హుజూరాబాద్ ఉపఎన్నిక కేవలం రిహార్సల్ మాత్రమేనని చెప్పారు.

ఈటల తల్లిపాలు తాగి రొమ్ముగుద్దాడన్న హరీశ్

హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో మంత్రి తన్నీరు హరీశ్ రావు, బీజేపీ నేత ఈటల రాజేందర్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా హరీశ్ రావు మాట్లాడుతూ, ఈటలది మొసలి కన్నీరు అని విమర్శించారు. టీఆర్ఎస్ పార్టీ ఈటలకు ఎంతో గౌరవం ఇచ్చిందని, ఒక్క సీఎం పదవి తప్ప అన్ని పదవులు కల్పించిందని వెల్లడించారు. కానీ, ఈటల వ్యవహారం తల్లిపాలు తాగి రొమ్ము గుద్దిన చందంగా ఉందని హరీశ్ రావు వ్యాఖ్యానించారు. ఆత్మగౌరవం గురించి మాట్లాడే ఈటల బొట్టుబిళ్లలు, కుట్టు మిషన్లు ఎందుకు పంచుతున్నారని ప్రశ్నించారు.

హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలో చేనేత కార్మికులకు ఆర్థిక ఆసరా నిమిత్తం చెక్కులను పంపిణీ చేసిన సందర్భంగా హరీశ్ రావు ఈ వ్యాఖ్యలు చేశారు. తమది పనిచేసే ప్రభుత్వం అని, బీజేపీ నేతలవి వట్టి మాటలేనని అన్నారు. బీజేపీ నేతలు తెలంగాణ అభివృద్ధి కోసం చేసిందేమీ లేదని హరీశ్ విమర్శించారు.

హరీశ్ రావు హుజూరాబాద్ నియోజకవర్గంలో పర్యటించిన సందర్భంగా కమలాపూర్ లో ఏర్పాటు చేసిన బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. రాయల్ ఎన్ ఫీల్డ్ బైకును నడుపుతూ అభిమానులకు, పార్టీ కార్యకర్తలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు.

Related posts

బహుజనులు బానిసలుగా కాకుండా పాలకులుగా మారాలి : ప్రవీణ్ కుమార్!

Drukpadam

బీజేపీ వ్యతిరేక పోరాటంలో కేసీఆర్ విఫలం …సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని!

Drukpadam

పేదల డబుల్ బెడ్రూం ఇళ్లపై సెప్టెంబరు 4న విశ్వరూప ధర్నా: కిషన్ రెడ్డి

Ram Narayana

Leave a Comment