Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

తనను అమ్మాయిలు ఇష్టపడటం లేదు … నాకో అమ్మాయిని చూసి పెట్టండి ఎమ్మెల్యేకి యువకుడి లేఖ!

తనను అమ్మాయిలు ఇష్టపడటం లేదు … నాకో అమ్మాయిని చూసి పెట్టండి ఎమ్మెల్యేకి యువకుడి లేఖ!
అమ్మాయిలు ఇష్టపడడం లేదు.. ఆత్మవిశ్వాసం దెబ్బతింటోందని ఆవేదన
చంద్రపూర్ ఎమ్మెల్యేకు లేఖ రాసిన యువకుడు
అల్లరిచిల్లరగా తిరిగే వారికి కూడా గాళ్ ఫ్రెండ్స్ ఉన్నారు
వారిని చూసినప్పుడల్లా గుండె తరుక్కుపోతోంది
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న లేఖ

తనను ఎవరు అమ్మయిలు ఇష్టపడటం లేదు …. తనకు పెళ్లి అవకాశాలు లేవు …తనకు ఒక అమ్మాయిని వెతికి పెట్టండి అని మహారాష్ట్ర లోని చంద్రాపూర్ కు చెందిన ఎమ్మెల్యే సుభాష్ థోతెకు లేఖ రాయడం చర్చనీయాంశం గా మారింది. ఇలాంటి ఉత్తరం ఎప్పుడు ఎవరు రాయలేదని ఎమ్మెల్యే వాపోయారు . అయినా తన కార్యకర్తలకు కేజే రాసిన ఆ యువకుడిని పట్టుకొని తన దగ్గరకు తీసుకోని వస్తే కౌన్సిలింగ్ ఇస్తానని ఎమ్మెల్యే అన్నారు .దింతో లేఖ రాసిన భూషణ్ జామువంత్ అనే యువకుడు కోసం ఎమ్మెల్యే మనుషులు వెతకటం ప్రారంభించారు.

అల్లరిచిల్లరగా, జులాయిగా తిరిగే వారికి కూడా గాళ్ ఫ్రెండ్స్ ఉన్నారని, కానీ తనను మాత్రం ఎవరూ ఇష్టపడడం లేదంటూ ఓ యువకుడు వాపోయాడు. ఇది తనలోని ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తోందని, తనకో గాళ్‌ఫ్రెండ్‌ను చూసిపెట్టాలంటూ ఓ యువకుడు మహారాష్ట్రలోని చంద్రపూర్ ఎమ్మెల్యే సుభాష్ థోతెకు లేఖ రాశాడు. ఇప్పుడీ లేఖ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. భూషణ్ జామువంత్ అనే యువకుడు మరాఠీలో ఈ లేఖ రాశాడు.

తాను ఉంటున్న ప్రాంతంలో బోల్డంతమంది చక్కని అమ్మాయిలు ఉన్నారని, అయినప్పటికీ తనను ఎవరూ ఇష్టపడడం లేదని భూషణ్ వాపోయాడు. అమ్మాయిలు తనను ఇష్టపడకపోవడంతో తనలో ఆందోళన పెరిగి ఆత్మవిశ్వాసం దెబ్బతింటోందని పేర్కొన్నాడు. మద్యం తాగేవారికి, అల్లరిచిల్లరగా తిరిగే వారికి కూడా గాళ్ ఫ్రెండ్స్ ఉన్నారని, కానీ తనకు మాత్రం ఎవరూ లేరని అన్నాడు. వారిని చూస్తున్నప్పుడల్లా తన బాధ మరింత ఎక్కువ అవుతోందన్నాడు. కాబట్టి తనకో గాళ్ ఫ్రెండ్‌ను చూసిపెట్టాలని వేడుకున్నాడు.

ఈ లేఖపై ఎమ్మెల్యే సుభాష్ స్పందించారు. గతంలో తనకెప్పుడూ ఇలాంటి లేఖలు రాలేదని పేర్కొన్నారు. భూషణ్ ఎక్కడ ఉంటాడో తనకు తెలియదని, అతడి సమాచారాన్ని తెలుసుకునే బాధ్యతను కార్యకర్తలకు అప్పగించినట్టు చెప్పారు. అయినా ఇలాంటి ఉత్తరాలు రాయడం సరికాదని, అతడి ఆచూకీ తెలిస్తే పట్టుకుని కౌన్సెలింగ్ ఇప్పిస్తానని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

Related posts

ఈయన పెద్ద దానకర్ణుడిలా మాట్లాడుతున్నాడు: సీఎం జగన్ పై చంద్రబాబు ఫైర్

Ram Narayana

కేన్సర్ సోకిన చిన్నారుల కోసం టర్కీ ఆసుపత్రి కొత్త ప్రయత్నం!

Drukpadam

ఢిల్లీలో కలకలం… సర్ గంగారామ్ ఆసుపత్రిలో 37 మంది డాక్టర్లకు కరోనా!

Drukpadam

Leave a Comment