చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు ఫోన్ చేసి మాట్లాడిన జో బైడెన్!
దాదాపు గంటన్నర పాటు చర్చలు
నేరుగా సమావేశం అవుదామని జిన్‌పింగ్‌కు బైడెన్ ఆఫర్
వద్దని చెప్పిన జిన్ పింగ్?
అంతర్జాతీయ పత్రికల్లో కథనాలు
నిన్న మొన్నటి వరకు కత్తులు దూసుకున్న అగ్రరాజ్యాలు నేడు స్నేహం కోరుకుంటున్నాయి. అమెరికా ,చిలమధ్య పచ్చగడ్డి వేస్తె భగ్గుమనే పరిస్థిలు ఉన్నాయి. ప్రత్యేకించి కరోనా చైనాలో పుట్టిందని ,అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రాంప్ చైనాపై యుద్ధం ప్రకటించినంత పని చేశారు. తరువాత గత ఏడాది జరిగిన ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు ,జో బైడెన్ అధికారంలోకి వచ్చారు. బైడెన్ కొంత మ్యాచుర్డ్ పొలిటిసియన్ అని అంటారు . అందువల్ల ఆయన అమెరికా అధ్యక్షుడు అయిన తరువాత అమెరికాలో చాల మార్పులు వచ్చాయి. ప్రధానంగా ప్రపంచదేశాలతో కయ్యానికి కాలు దువ్వకుండా రాజనీతితో పరిష్కరించుకోవాలనే ఆలోచనతో ముందుకు సాగుతున్నారు. అందులో భాగంగానే అంతకుముందు ఆఫ్ఘన్ ఉన్న నాటో కూటమి సైన్యాలను వెనక్కు రప్పించారు. బద్ద శత్రువుగా భావిస్తున్న చైనా తో చెలిపికి సై అంటున్నారు. బైడెన్ నేరుగా జిన్ పింగ్ కు ఫోన్ మాట్లాడినట్లు వార్తలు వచ్చాయి.
చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఫోన్ చేసి మాట్లాడారు. దాదాపు గంటన్నర పాటు వారిద్దరు ఫోనులో మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా, నేరుగా సమావేశం అవుదామని జిన్‌పింగ్‌ను బైడెన్ కోరారు. అయితే, ఇందుకు జిన్‌పింగ్ తిరస్కరించినట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై బైడెన్ స్పందిస్తూ.. ఇందులో నిజం లేదని చెప్పారు.
పూర్తి వివరాలు చూస్తే.. చైనాతో అమెరికా చర్చలు జరపాలని ప్రయత్నాలు జరుపుతోంది. ఇందుకోసం చైనాలోని అధికారులు సానుకూలంగా స్పందించట్లేదు. ఈ నేపథ్యంలోనే నేరుగా జిన్ పింగ్‌కు ఫోన్‌చేసి బైడెన్ మాట్లాడారు. అక్టోబరులో ఇటలీలో జరిగే జీ20 సదస్సు సమయంలో భేటీ అవుదామని జిన్‌పింగ్‌ను బైడెన్ కోరారు. దీనిపై నిర్ణయాన్ని ఆలోచించుకుని చెప్పాలని బైడెన్ అన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే, బైడెన్ చేసిన సూచనను జిన్‌పింగ్ తిరస్కరించారని ప్రచారం జరుగుతోంది. అంతేగాక, చైనా విషయంలో అమెరికా కాస్త వెనక్కితగ్గితే మంచిదని బైడెన్‌కు జిన్‌పింగ్ సూచించినట్లు తెలుస్తోంది.
ఇందుకు సంబంధించి అంతర్జాతీయ పత్రికల్లో వార్తలు వస్తున్నాయి. ఆ వార్తలపై బైడెన్ జాతీయ భద్రతా సలహాదారు జేక్ సులివాన్ మీడియాతో మాట్లాడుతూ… బైడెన్ ఆఫర్ ను జిన్‌పింగ్ తిరస్కరించినట్లు వస్తోన్న కథనాల్లో నిజాలు లేవని చెప్పారు. ఇరు దేశాల అధ్యక్షుల మధ్య జరిగిన ప్రైవేటు సంభాషణను గౌరవించాల్సిన అవసరం ఉందని అన్నారు. అయినప్పటికీ, బైడెన్ ఇచ్చిన ముఖాముఖీ భేటీ ఆఫర్‌ను చైనా అధ్యక్షుడు తిరస్కరించాడన్న విషయం వాస్తవమేనని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. జేక్ సులివాన్ తో పాటు బైడెన్ మాత్రం ఆ వార్తలను కొట్టిపారేస్తున్నారు.