Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

హరీశ్ రావు తోలుబొమ్మ… లక్ష ఓట్ల మెజార్టీతో ఈటల గెలుస్తారు: జితేందర్ రెడ్డి!

హరీశ్ రావు తోలుబొమ్మ… లక్ష ఓట్ల మెజార్టీతో ఈటల గెలుస్తారు: జితేందర్ రెడ్డి!
-ఏడేళ్లుగా అబద్ధాలు చెపుతూ టీఆర్ఎస్ గెలుస్తోంది
-దత్త గ్రామాన్ని కూడా హరీశ్ రావు అభివృద్ధి చేయలేదు

-ఈటల గెలుపును ఎవరు ఆపలేరు
-ఇప్పటికే అనేక సర్వే లు జరిగాయి. వారిలో స్పష్టమైన మెజార్టీ ఈటలకు వచ్చింది.
-టీఆర్ యస్ కూడా సర్వే చేయించింది దానిలో ఏమొచ్చిందో వాస్తవాలు చెప్పమనండి

మంత్రి హరీశ్ రావుపై బీజేపీ నేత, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి సెటైర్లు వేశారు. టీఆర్ఎస్ పార్టీలో ట్రబుల్ షూటర్ గా పేరున్న హరీశ్ రావు… వాస్తవానికి ముఖ్యమంత్రి కేసీఆర్ చేతిలో తోలుబొమ్మలా ఆడుతున్నారని ఎద్దేవా చేశారు. గత ఏడేళ్లుగా ప్రజలకు అబద్ధాలు చెపుతూ టీఆర్ఎస్ గెలుస్తోందని… ఇప్పుడు ఆరోజులు పోయాయని అన్నారు. టీఆర్ఎస్ అబద్ధాలు చెపుతోందనే విషయం ప్రజలకు అర్థమయిందని… ఇకపై అబద్ధాలు చెప్పి గెలిచే రోజులు పోయాయని చెప్పారు. ప్రజలు ఎవరు ఏమిటనేది అన్ని గమనిస్తున్నారని అన్నారు. ప్రజలు అమాయకులని కేసీఆర్ భావిస్తున్నారని అందువల్లనే ఎన్నికల్లో అడ్డదార్లు తొక్కి గెలవాలని వ్యూహాలు రచిస్తున్నారని దుయ్యబట్టారు .

దుబ్బాక ఉపఎన్నికలో టీఆర్ఎస్ ఓడిపోయిందని… అప్పటి నుంచి ప్రభుత్వం ఆ నియోజకవర్గాన్ని పట్టించుకోవడం లేదని జితేందర్ రెడ్డి మండిపడ్డారు. ఓడిన చోట కేసీఆర్ ప్రభుత్వం పని చేయదా? అని ప్రశ్నించారు. హరీశ్ రావు దత్తత తీసుకున్న కొల్గుర్ గ్రామంలోనే 60 ఇళ్లను నిర్మించలేకపోయారని… ఇక హుజూరాబాద్ ను ఏం అభివృద్ధి చేస్తారని ప్రశ్నించారు. తన సొంత నియోజకవర్గం సిద్ధిపేటలో రుణమాఫీ, డబుల్ బెడ్రూమ్ ల నిర్మాణం, దళితబంధులను హరీశ్ చేయలేకపోయారని విమర్శించారు. హుజూరాబాద్ లో ఈటల రాజేందర్ లక్ష ఓట్ల మెజార్టీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఈటల గెలుపును ఎవరు ఆపలేరని ఉద్ఘాటించారు. ప్రభుత్వం దళిత బందు తెచ్చి దళితులను మచ్చిక చేసుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు బెడిసి కొడతాయని అన్నారు. ఈటల రాజీనామా వల్లనే దళిత బందు వస్తుందని ప్రజలు భావిస్తున్నారని తమ ఓట్లు ఎన్ని డబ్బులు ఇచ్చిన ఎంత ప్రలోభపెట్టిన ఓట్లు మాత్రం ఈటలకే వేస్తామని ప్రజలు ఖరాఖండిగా చెబుతున్నారని అన్నారు. ఇప్పటికే అనేక సర్వేలు జరిగాయని ,టీఆర్ యస్ కూడా సర్వే చేయించుకుంది దాంట్లో కూడా ఏమి వచ్చిందో వాస్తవాలు చెప్పమనండి అని అన్నారు.

Related posts

ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ లో మాజీ ఎమ్మెల్యే తాటి చిచ్చు …

Drukpadam

మళ్లీ హైదరాబాద్ కు వచ్చిన ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్

Drukpadam

రాహుల్ గాంధీ ఈడీ విచారణపై దేశవ్యాపితంగా కాంగ్రెస్ నిరసనలు …

Drukpadam

Leave a Comment