Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఏపీ సీఎం జగన్ కు బాలాపూర్ లడ్డు కానుకగా ఇస్తాం…ఎమ్మెల్సీ రమేశ్, యాదవ్!

ఏపీ సీఎం జగన్ కు బాలాపూర్ లడ్డు కానుకగా ఇస్తాం…ఎమ్మెల్సీ రమేశ్, యాదవ్!
బాలాపూర్ లడ్డూను సీఎం జగన్ కు బహూకరిస్తాం మని వెల్లడి
రికార్డు నెలకొల్పిన బాలాపూర్ లడ్డూ
వేలంలో రూ.18.90 లక్షల ధర
సొంతం చేసుకున్న ఏపీ ఎమ్మెల్సీ రమేశ్, శశాంక్ రెడ్డి
జగన్ కోసమే వేలంలో పాల్గొన్నట్టు రమేశ్ వెల్లడి

గణేష్ నిమజ్జనం అంటే తెలుగు రాష్ట్రాలలో ఖైరతాబాద్ వినాయకుడు , బాలాపూర్ లడ్డు వేలంపాట పైనే అందరి ద్రుష్టి ఉంటుంది. ఈసారికూడా బాలాపూర్ లడ్డు ధర రికార్డు స్థాయిలో పలికింది. ఈసారి లడ్డుని 18 .90 లక్షలకు కడప జిల్లాకు చెందిన రమేష్ యాదవ్ ,శశాంక్ రెడ్డి కలిసి వేలంలో పాల్గొన్నారు. అయితే బాలాపూర్ లడ్డును ఏపీ సీఎం జగన్ కు అందజేస్తానని ఎమ్మెల్సీ రమేష్ అన్నారు.

వినాయకచవితి నేపథ్యంలో బాలాపూర్ లడ్డూకు ఎంతో విశిష్టత ఉంది. తెలంగాణలో అత్యధిక ధర పలుకుతూ గత కొన్నేళ్లుగా బాలాపూర్ లడ్డూ రికార్డులు సృష్టిస్తోంది. ఈ ఏడాది రూ.18.90 లక్షల రికార్డు ధరతో కడప జిల్లా ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్, నాదర్ గుల్ కు చెందిన మర్రి శశాంక్ రెడ్డి ఈ లడ్డూను దక్కించుకున్నారు.

అనంతరం ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్ మాట్లాడుతూ, బాలాపూర్ లడ్డూను సీఎం జగన్ కు బహూకరిస్తానని వెల్లడించారు. కేవలం సీఎం జగన్ కు లడ్డూను కానుకగా ఇవ్వాలన్న ఉద్దేశంతోనే తాను బాలాపూర్ వేలంలో పాల్గొన్నానని రమేశ్ యాదవ్ తెలిపారు. మరికొన్ని రోజుల్లో ఈ లడ్డూను సీఎం జగన్ కు అందిస్తానని వివరించారు.

ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే బాలాపూర్ లడ్డూ వేలం కార్యక్రమానికి తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ శాసనసభ్యుడు తీగల కృష్ణారెడ్డి హాజరయ్యారు. ఇతర ప్రముఖులు హాజరైయ్యారు.

Related posts

చంద్రబాబు అరెస్టుకు నిరసన.. ఢిల్లీలో లోకేశ్ సత్యాగ్రహ దీక్ష ప్రారంభం

Ram Narayana

ప్రీతిని వేధిస్తున్నారని తెలిసినా హెచ్ఓడీ పట్టించుకోలేదు: ఈటల రాజేందర్!

Drukpadam

సంచలనం…వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్ష పదవికి సుచరిత రాజీనామా!

Drukpadam

Leave a Comment