Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం :13 జిల్లాల జడ్పీ ల కైవశం అదే రీతిలో ఎంపీపీ లు!

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం :13 జిల్లాల జడ్పీ ల కైవశం అదే రీతిలో ఎంపీపీ లు!
-వార్ వన్ సైడ్…జగన్ పాలనకు ప్రజలు పట్టం కట్టారని అంటున్న విశ్లేషకులు
-తాము ఎన్నికలను బహిష్కరించమంటున్న టీడీపీ
-బహిష్కరిస్తే 6659 ఎంపీటీసీ లకు 482 జడ్పీటీసీ టీడీపీ ఎలా పోటీచేసిందంటున్న వైసీపీ
-690 ఎంపీటీసీ , 4 జడ్పీటీసీ లు మాత్రమే టీడీపీ గెలిచింది
-కుప్పంలో చంద్రబాబు కు షాక్ టీడీపీ ఓటమి
-నారావారి పల్లి ఎంపీటీసీగా వైసీపీ అభ్యర్థి ఘన విజయం

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం సృష్టించింది.వార్ వన్ సైడ్ అయింది. జగన్ పాలనకు ప్రజలు పట్టం కట్టారు. ఏపీ లోని అన్ని జిల్లాపరిషత్ లను , దాదాపు ఎంపీపీ లను గెలుచుకుంది. ఇంకా కొన్ని ఫలితాలు రావాల్సి ఉన్న ఇప్పటివరకు ప్రకటించిన వాటిలో 90 శాతం కు పైగా వైసీపీ గెలిచి జగన్ కు ఏపీ లో తిరుగులేదని నిరూపించింది. దాదాపు వార్ వన్ సైడ్ గా మారింది. ఈ ఎన్నికలకు అనేక అడ్డాకుల సృష్టించినప్పటికీ వైసీపీ ఎక్కడ కూడా తొందరపాటు లేకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించింది. దీంతో ఎన్నికల్లో వైసీపీ హవా కొనసాగించింది. ఎన్నికలను జరపాలా వద్ద అనే విషయంలో అప్పడు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రభుత్వానికి , వైకాపాకు పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నారనే అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. ఆయన కుడా ప్రతిపక్ష టీడీపీ చెప్పినట్లే చేస్తున్నారని విమర్శలు ఉన్నాయి.

రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాలలో అన్ని జిల్లాలలో ఒక్క జిల్లా పరిషత్ ను కూడా టీడీపీ గెలుచుకోలేక పోయింది. నెల్లూరు , ప్రకాశం ,చిత్తూరు , కర్నూల్ , విజయనగరం జిల్లాలో అన్ని జడ్పీటీసీ లను వైకాపా గెలుచుకోవడం విశేషం . మిగతా జిల్లాల్లో కూడా ఒకటి రెండు జడ్పీటీసీ లు మినహా మిగత జడ్పీటీసీ లన్ని వైకాపా గెలిచింది. ఇక ఎంపీటీసీలలో కూడా అనేక మండలంలో వైసీపీ క్లిన్ స్వీప్ చేసింది. ప్రత్యేకించి మాజీముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకర్గంలోని అన్ని జడ్పీటీసీలను వైకాపా గెలుచుకోవడం విశేషం .చంద్రగిరి నియోజకవర్గంలోని చంద్రబాబు సొంత గ్రామం నారావారి పల్లి ఎంపీటీసీ గా వైకాపాకు చెందిన …..గెలుపొంది చరిత్ర సృష్టించారు. 3 శతాబ్దాల కాలంలో మొదటిసారిగా టీడీపీ ఓటమి చెందటం విశేషం .
రాష్ట్రప్రజలకు శిరసు వంచి కృతజ్నతలు తెలియజెసుతున్నామని వైకాపా నేత సజ్జల రామకృష్ణరెడ్డి తెలిపారు. ఎన్నికల ఫలితాలపై తాడేపల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ , ఈ ఫలితాలు మా భాద్యతను మరింత పెంచాయని అన్నారు.

Related posts

అసోం సీఎంపై గీతారెడ్డి, రేణుకా చౌదరి ఫిర్యాదు!

Drukpadam

అధికారం కోసం ఎప్పుడూ వెంపర్లాడలేదు…చంద్రబాబు

Drukpadam

రాజయ్య ఇదేందేయ్య … మళ్ళీ వివాదంలో రాజయ్య…

Drukpadam

Leave a Comment