Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

కరోనా వల్ల విమానాలు రద్దు …సముద్రమార్గంలో 6 వేల కిలోమీటర్ల సాహసోపేత ప్రయాణం!

కరోనా వల్ల విమానాలు రద్దు …సముద్రమార్గంలో 6 వేల కిలోమీటర్ల సాహసోపేత ప్రయాణం!
-ఒంటరిగా సొంత పడవలో ప్రయాణించిన బ్రిటన్‌కు చెందిన పాల్ స్ట్రాఫోల్డ్
-చివరకు ఆస్ట్రేలియా చేరిన పాల్ స్ట్రాఫోల్డ్
-తన ప్రయాణంలో తుఫాన్లు ,ఆటుపోట్లు ,ఒంటరి ప్రయాణం భయం గుప్పెట్లో
-60 రోజులు 6 వేల కిలో మీటర్లు …నిద్రలేని రాత్రులు
-రెసిడెన్సీ వీసా పొడిగించుకోవాల్సిన అవసరం
-కరోనా కారణంగా రద్దయిన విమానాలు
-సాహసోపేతమైన నిర్ణయంతో తన పడవలో ఒంటరిగా ప్రయాణం

కరోనా కారణంగా తాహితిలో ఇరుక్కుపోయిన బ్రిటన్‌కు చెందిన పాల్ స్ట్రాఫోల్డ్ ఆస్ట్రేలియా చేరుకునేందుకు పడ్డ కష్టాలు వర్ణనాతీతం …. ఒక రకంగా చెప్పాలంటే హాలీవుడ్ సినిమాలను తలదన్నే రీతిలో సాహసోపేతమైన ప్రయాణం ఒంటారిగా చేశాడు. కరోనా ప్రపంచంలోని అన్ని దేశాలు వణికి పోతున్నాయి. విమానాలు రద్దు చేశారు. వీసా కలం తీరిపోతుంది. ఎక్కడో ఇరుక్కుపోయారు. ఏమిటి చేసేది అని తీవ్రంగా ఆలోచనకు పదును పెట్టాడు. సొంతగా పడవ ఒకటి తీసుకోని ఒంటరిగా ఆస్ట్రేలియా బయలు దేరాడు . అసలే సముద్ర ప్రయాణం ఆపై ఒంటారిగా బతుకు జీవుడా నాటు ధైరం చేశాడు . భయంకరమైన తుఫాన్లు, పడవ ఎక్కడ మునుగుతుందో అనే భయం , సముద్రపు దొంగలు … గమ్యం చేరేందుకు నిద్రలేని రాత్రులు గడిపి చివరకు గమ్యం చేరుకున్నాడు ….

కరోనా మహమ్మారి ప్రపంచంలో చాలా మందికి వింత అనుభవాలు మిగిల్చింది. వాటిలో కొన్ని విషాదాంతాలు కాగా, మరికొన్ని సాహసోపేతమైనవి. ఆస్ట్రేలియాలో జరిగిన ఘటన కూడా ఇలాంటిదే. బ్రిటన్‌కు చెందిన పాల్ స్ట్రాఫోల్డ్ అనే వ్యక్తి ఆస్ట్రేలియాలో ఉంటున్నాడు. కరోనా కారణంగా అతను తాహితిలో ఇరుక్కుపోయాడు.

స్వదేశం వెళ్లడానికి విమానాలు లేవు. దీంతో ఏం చేయాలో తెలియని సందిగ్ధంలో పడిపోయాడు. చివరకు కఠిన నిర్ణయం తీసుకొని తన 50 అడుగుల పడవలో ఒంటరిగా ఆస్ట్రేలియా పయనమయ్యాడు. ఈ ప్రయాణం 6 వేల కిలోమీటర్లు సాగింది. మధ్యలో తుపాను రావడంతో పాల్ ప్రాణాలు పోయినంతపనైంది.

పడవ బోల్తా అవకుండా జాగ్రత్తలు తీసుకునేందుకు తను కొన్నిసార్లు రోజుకు 40 నిమిషాలు మాత్రమే నిద్రపోయినట్లు పాల్ చెప్పాడు. 41 ఏళ్ల పాల్ ఇలా రెండు నెలలపాటు సముద్రంలో ప్రయాణించాడు. ఇలా జూలై 3 నాటికి చివరికి క్వీన్స్‌ల్యాండ్ చేరుకున్నాడు. ‘ఇంటికి చేరుకోవడానికి ఇంతకుమించి వేరే మార్గం కనిపించలేదు’ అని చెప్పాడు.

ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్ దేశాల్లో కరోనా మహమ్మారి వల్ల విమాన ప్రయాణాలు రద్దయ్యాయి. అవి ఇంకా పూర్తిగా అందుబాటులోకి రాలేదు. ఆస్ట్రేలియాలో విమాన సర్వీసులను గురువారం నుంచి ప్రారంభించే అవకాశం ఉంది.

Related posts

ఏపీలో నిలిచిపోయిన ఆరోగ్యశ్రీ.. కడపలో 17 ఆసుపత్రులపై చర్యలు

Ram Narayana

ఢిల్లీలో ప్రమాదకరస్థాయిలో కాలుష్యం…

Drukpadam

ఆనందయ్య మందుకి ల్యాబ్‌లో షాకింగ్ రిపోర్ట్.! అన్నీ శాస్త్రయమే ఆయుష్ కమిషనర్ కీలక వ్యాఖ్యలు

Drukpadam

Leave a Comment