Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

నడుస్తూ సొమ్మసిల్లి పడిపోయిన ఎమ్మెల్యే సీతక్క… ఆసుపత్రికి తరలింపు

నడుస్తూ సొమ్మసిల్లి పడిపోయిన ఎమ్మెల్యే సీతక్క… ఆసుపత్రికి తరలింపు

  • -ఏటూరునాగారంలో కాంగ్రెస్ దండోరా యాత్ర
  • -పాల్గొన్న ఎమ్మెల్యే సీతక్క
  • -అస్వస్థతకు గురైన వైనం
  • ఆసుపత్రికి తరలించిన నేతలు
  • బీపీ తగ్గడంతో నీరసించారన్న వైద్యులు

తెలంగాణకు చెందిన ములుగు కాంగ్రెస్ ఎమ్మెల్యే ధనసరి సీతక్క అస్వస్థత కారణంగా ఆసుపత్రి పాలయ్యారు. ఆమె ఇవాళ ములుగు జిల్లా ఏటూరునాగారంలో దళిత గిరిజన దండోరా యాత్రలో పాల్గొన్నారు. ఈ యాత్రలో సీతక్క నడుస్తూనే ఒక్కసారిగా సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే స్పందించిన కాంగ్రెస్ నేతలు సీతక్కను వెంటనే స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బీపీ తగ్గడంతో ఆమె నీరసించారని, చికిత్స అనంతరం ఆమె కోలుకున్నారని ప్రభుత్వాసుపత్రి వైద్యులు వెల్లడించారు. కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్న అనంతరం ఆమె తేరుకున్నారని తెలిపారు.  దాంతో కాంగ్రెస్ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నాయి.

ఇటీవల కాలంలో వరస ఆందోళనలు ,కరోనా నేపథ్యంలో నియోజవర్గంలో పర్యటనలు రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడు అయిన తరువాత రాష్ట్రంలో దళిత గిరిజన దండోరా సభల లో పాల్గొని ఉషారుగా ఉన్న సీతక్క ఒక్కసారిగా అస్వస్థతకు గురికావడం కాంగ్రెస్ శ్రేణులను నిర్ఘాంత పరిచింది. ములుగు పర్యటనలో ఒక్కసారిగా పడిపోవంతో కాంగ్రెస్ కార్యకర్తలు ఆమెను స్థానిక హాస్పత్రికి తరలించారు. నీరసంగా ఉండటంతోనే ఆమె పడిపోయారని వైదులు తెలిపారు. కొంత సేపు విశ్రాంతి తీసుకున్న తరువాత ఆమె స్పృహ లోకి ఇచ్చారు.

 

Related posts

విమానంలో పండంటి బిడ్డకు జన్మనించిన మహిళ.. ‘స్కై’ అని పేరు!

Drukpadam

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లలో ఆగ్రహజ్వాలలు…సీఎల్పీ నేతను కలిసిన సీనియర్లు …

Drukpadam

పక్కదారి పడుతున్న రేషన్ బియ్యం…

Drukpadam

Leave a Comment