Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలురాజకీయ వార్తలు

రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడించిన టీఆర్ఎస్ … ఘర్షణ, ఉద్రిక్తత…

రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడించిన టీఆర్ఎస్ … ఘర్షణ, ఉద్రిక్తత…
-పరస్పర ఆరోపణలు… హీటడ్ ఆర్గ్యుమెంట్
-పోలిసుల జోక్యం …పరిస్థితి అదుపులో
-టీఆర్ యస్ ,కాంగ్రెస్ మధ్య కొనసాగుతున్న మాటల యుద్ధం

మంత్రి కేటీఆర్ ను టార్గెట్ చేస్తున్న రేవంత్ రెడ్డి ఇంటిని ఈరోజు టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ముట్టడించారు. దీంతో అక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వారిని అడ్డగించారు. టీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తల బాహాబాహి మధ్య రేవంత్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. తాము శాంతియుతంగా నిరసన తెలియజేయడానికివెళితే కాంగ్రెస్ పార్టీ వాళ్లు తమపై దాడి చేశారని టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఆరోపిస్తుంటే, రేవంత్ రెడ్డి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు గూండాల మాదిరిగా దాడికి పాల్పడుతున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులు మండిపడుతున్నారు. ఇక రేవంత్ రెడ్డి ఇంటి ముందు ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకోవడంతో రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.

ఇది ఇలా ఉండగా తెలంగాణ మంత్రులు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మంత్రి కేటీఆర్ పై కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులపై నిప్పులు చెరుగుతున్నారు. ఇక పియుసి చైర్మన్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి రేవంత్ రెడ్డి ని టార్గెట్ చేసి తీవ్ర విమర్శలు గుప్పించారు. కేడర్ లేని పార్టీకి లీడర్ రేవంత్ రెడ్డి అంటూ తీవ్రపదజాలంతో ద్వజమెత్తారు.

కాంగ్రెస్ డ్రగ్స్ కు బ్రాండ్ అంబాసిడర్ అంటూ సుబ్రహ్మణ్యస్వామి ఎప్పుడో చెప్పారని, గతంలో కాంగ్రెస్ డ్రగ్స్ వ్యవహారంపై ఘనకీర్తి వార్తలు ఎన్నో వచ్చాయని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. కేటీఆర్ పై అనవసరపు విమర్శలు చేస్తే సహించేది లేదని తేల్చి చెప్పారు. అభివృద్ధికి కేటీఆర్ బ్రాండ్ అంబాసిడర్ అని పేర్కొన్న జీవన్ రెడ్డి రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ కు బ్రాండ్ అంబాసిడర్ అని స్పష్టం చేశారు. మాకు తెలిసిన వైట్ అంటే తెల్ల కల్లు అని రేవంత్ రెడ్డికి తెలిసిన వైట్ అంటే డ్రగ్స్, గంజాయి అని ఆరోపించారు. పబ్బులు క్లబ్బులు తెలంగాణాలోనే ఉన్నాయా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో లేవా అని ప్రశ్నించిన జీవన్ రెడ్డి, తెలంగాణ ప్రతిష్టను రేవంత్ రెడ్డి తీవ్రంగా దిగజారుస్తున్నారని విమర్శించారు. తప్పుడు ఆరోపణలు చేస్తే రేవంత్ రెడ్డి పై ప్రతీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తామని జీవన్ రెడ్డి హెచ్చరించారు.

 

 

Related posts

టీడీపీలో ప్రక్షాళన జరగాలి…. సంచలన వ్యాఖ్యలు చేసిన ఎంపీ కేశినేని నాని!

Drukpadam

ఈటల నీ నిర్ణయం సమర్ధనీయం కాదు: తమ్మినేని…..

Drukpadam

జగన్ ఆదేశిస్తే పవన్ పై పోటీ చేయడానికి సిద్ధం: అలీ

Drukpadam

Leave a Comment