Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

తన ఇంటిపై జరిగిన దాడి గురించి పోలీసు స్టేష‌న్‌కు వెళ్లి ఫిర్యాదు చేసిన రేవంత్ రెడ్డి!

తన ఇంటిపై జరిగిన దాడి గురించి పోలీసు స్టేష‌న్‌కు వెళ్లి ఫిర్యాదు చేసిన రేవంత్ రెడ్డి!
-నిన్న జూబ్లీహిల్స్‌లో రేవంత్ రెడ్డి ఇంటిపై దాడికి య‌త్నం
-టీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌ల‌పై రేవంత్ ఫిర్యాదు
-కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌ల‌ను ఎందుకు అరెస్టు చేశార‌ని నిల‌దీత‌
-ఇంకోసారి ఇలాంటి దాడులకు పాల్పడితే సంగతి చూస్తాం: టీఆర్ఎస్ శ్రేణులకు సీపీఐ నారాయణ వార్నింగ్
-ఇది నీచమైన సంస్కృతి అన్న సీపీఐ నారాయణ
-దమ్ముంటే డైరెక్ట్ గా రావాలని సవాల్

టీపీసీసీ అధ్యక్షడు రేవంత్ రెడ్డి, టీఆర్ యస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ మధ్య జరుగుతున్న మాటల యుద్ధం దాడులకు ప్రతిదాడులకు కారణమౌతుంది. రేవంత్ రెడ్డి ఇంటిపై టీఆర్ యస్ కార్యకర్తలు దాడి చేశారు. దానికి కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ప్రతిదాడి చేశారు. రేవంత్ రెడ్డి ఇంటిపై దాడి చేసిన టీఆర్ యస్ కార్యకర్తలను వదిలేసి ,కాంగ్రెస్ కార్యకర్తల పై కేసులు పెట్టడం దారుణమని రేవంత్ రెడ్డి అన్నారు. ఆయన మంగళవారం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి తన ఇంటిపై జరిగిన దాడి గురించి ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై సిపిఐ జాతీయకార్యదర్శి నారాయణ ఘాటుగా స్పందించారు. ఎలాంటి దాడులు నీచసంస్కృతికి నిదర్శనమని అన్నారు.మరో సారి ఇలా చేస్తే తడాఖా చూస్తామని హెచ్చరించారు. …

హైద‌రాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో నిన్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడించేందుకు టీఆర్ఎస్ కార్యకర్తలు ప్ర‌య‌త్నించ‌గా కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్న విష‌యం తెలిసిందే. దీంతో నిన్న‌ అక్క‌డ తీవ్ర ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. ఈ నేప‌థ్యంలో ఈ రోజు రేవంత్ రెడ్డి స్వ‌యంగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేష‌న్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు.

నిన్న త‌న ఇంటిపై టీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌లు దాడి చేశార‌ని, వారిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆయ‌న కోరారు. టీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌లు దాడుల‌కు పాల్ప‌డితే పోలీసులు కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌ల‌ను అరెస్టు చేయ‌డ‌మేంట‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌ల‌ను వెంట‌నే విడుద‌ల చేయాల‌ని ఆయ‌న కోరారు. రేవంత్ వెంట ప‌లువురు కాంగ్రెస్ నేత‌లూ ఉన్నారు.

రేవంత్ రెడ్డి ఇంటి పై దాడి నీచ సంస్కృతికి నిదర్శనం …సిపిఐ నారాయణ ….

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇంటిని టీఆర్ఎస్ కార్యకర్తలు నిన్న ముట్టడించేందుకు యత్నించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో రేవంత్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి వీడియో ఫుటేజీ ఉన్నప్పటికీ వారిపై చర్యలు ఎందుకు తీసుకోలేదని పోలీసు అధికారులను రేవంత్ ప్రశ్నించారు.

మరోవైపు రేవంత్ ఇంటిపై దాడిని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఖండించారు. అసలైన డెకాయిట్లు అందరూ టీఆర్ఎస్ లోనే ఉన్నారని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. నాయకుల ఇళ్లపై దాడులు చేయడం నీచ సంస్కృతికి నిదర్శనమని అన్నారు. రేవంత్ ఇంటిపై దాడిని అఖిలపక్షం ఖండిస్తోందని చెప్పారు. ఇంకోసారి ఇలాంటి దాడులకు తెగబడితే సంగతి చూస్తామని హెచ్చరించారు. దమ్ముంటే డైరెక్ట్ గా రావాలని సవాల్ విసిరారు. ఇలాంటి దాడులు చేసే వారిని రాజకీయ పార్టీలు ప్రోత్సహించకూడదని చెప్పారు.

Related posts

అది కేసీఆర్ తరం కాదు.. ఆసుపత్రి నుంచి వైఎస్ షర్మిల వీడియో సందేశం..!

Drukpadam

అష్రఫ్ ఘనీ రూ. 1255 కోట్లతో పారిపోయారు … లేదు లేదు నన్ను షూ కూడా వేసుకోనివ్వలేదు !

Drukpadam

శాసన రాజధాని అమరావతిలోనే ఉంటుంది: మంత్రి జోగి రమేశ్!

Drukpadam

Leave a Comment