Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

వ్యవసాయ చట్టాల రద్దుకోసం 27 న దేశ బంద్ ….అఖిల పక్షాలు…

వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలనీ ఈ నెల 27 న బంద్… అఖిల పక్షాలు…
-కేంద్రం మొండి వైఖరి విడనాడాలి …
-కేసీఆర్ ,జగన్ లు వ్యవసాయ చట్టాలను సమర్థంచడం విచారకరం
-అంబానీ ,ఆధాని లకోసం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రవేట్ పరం చేస్తున్న కేంద్రం
-రైతు లకు మేలు చేయని వ్యవసాయ చట్టాలు… రద్దు చేసేంతవరకు ఉద్యమం
-దేశవ్యాపిత బంద్ కు ఐక్యకార్యాచణ సమితి పిలుపు

తొమ్మిదినెలలుగా దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో నూతన వ్యవసాయ చట్టాల రద్దుకు రైతాంగం చేస్తున్న ఉద్యమానికి మద్దతు పెరుగుతుంది. ఎండకు ఎండుతూ , వానకు తడుస్తూ , చలికి వణుకుతూ 270 జరుగుతున్న ఈ ఉద్యమం దేశచరిత్రలో లికించదగ్గదిగా నిలిచిపోతుంది. రైతు సంయుక్త ముక్తి మోర్చా ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఉద్యమానికి దేశ వ్యాపిత మద్దతు లేదని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చెబుతుంది. కానీ మద్దతు పుష్కలంగా ఉందని అనేక సందర్భాలలో జరిగిన సంఘీభావ ఉద్యమాలు తెలియజేశాయి. తిరిగి ఈ నెల 27 జరిగే భారత్ బందు మరోసారి ఢిల్లీ రైతు ఉద్యమానికి బాసటగా నిలవనుంది . అనేక రాజకీయపార్టీలు ప్రజలు , ప్రజాసంఘాలు , సామాజిక ఉద్యమకారులు ,మేధావులు , కళాకారులూ , రైతు ఉద్యమానికి మద్దతు ప్రకటించారు.

ఈ దేశానికి అన్నం పెట్టే రైతన్నలు చేస్తున్నటువంటి పోరాటం రైతు వ్యతిరేక చట్టాలను కేంద్ర ప్రభుత్వం తీసుకున్న టువంటి నిర్ణయాలను ఉపసంహరించుకోవాలని దేశంలోని కాంగ్రెస్ ,వామపక్షాలు ,ఎస్పీ , డి ఎం కె , జేడీఎస్ , ఆర్జేడీ ,శివసేన , ఎన్సీపీ , లాంటి 20 రాజకీయ పార్టీలు బందు కు ముద్దగా ప్రకటించాయి. కానీ తెలుగు రాష్ట్రాలలో అధికారంలో ఉన్న ఇటు టీఆర్ యస్ , అటు వైసీపీ లు బంద్ఈ కు దూరంగా ఉంటున్నాయి. అంటే రైతు చట్టాలను సమర్థిస్తున్నాయి. ఇది అత్యంత విచారకరం . రైతుల కోసమే ఉన్నామని చెబుతున్న జగన్ , కేసీఆర్ లు రైతుల విషయంలో బీజేపీ ని సమర్థించటంపై విమర్శలు ఉన్నాయి.

దేశంలో విలువైన భూములని , రైల్వే ని విమానాశ్రయాలను కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రవేట్ పరం చేసేందుకు సిద్దపడటం అత్యంత దుర్మార్గం . దీన్ని అడ్డుకునేందుకు ప్రజా ఉద్యమం జరగాలనే ఉద్దేషముతో పార్టీలన్నీ ఒక్కతాటిపైకి వచ్చాయని ప్రతిపక్షాలు అంటున్నాయి.

ఉద్యోగ సంఘాలు అడగకుండానే ఎన్నికల ప్రణాళికలో ఉద్యోగులకు రిటైర్ మెంట్ వయస్సు పెంచుతామని చెప్పి హామీ ఇవ్వడం వయస్సు పైబడ్డ ఉద్యోగులకు సర్వీస్ పెంచడం పై విమ్మర్శలు ఉన్నాయి. వారికి ఇవ్వాల్సిన బెనిఫిట్స్ ను రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సి వస్తుందని మూడు సంవత్సరాలు అనగా 58 సంవత్సరాల కి ఉద్యోగ విరమణ చేయాల్సి ఉన్నప్పటికీ దాన్ని 61 సంవత్సరాలు పెంచి మేము ఉద్యోగాలు చేయలేము అన్న గాని వారిని కంటిన్యూ చేస్తూ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా తాత్సారం చేస్తున్న ప్రభుత్వం పై యువత కన్నెర్ర చేస్తున్నారు. పని చేయగలరని ఉద్యోగుల వయస్సును పెంచిన ప్రభుత్వం పెన్షన్లు మాత్రం 58 సంవత్సరాలు లకే వృద్ధాప్య పింఛన్ ఇస్తున్నారు.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రతిపక్షాలు చేస్తున్న పోరాటం ప్రభుత్వాన్ని ఎంతవరకు కదిలిస్తుందో చూడాలి మరి !

Related posts

‘తన్నులాట’ గురించి ఇంతకన్నా బాగా ఎవరూ చెప్పలేరు: రేవంత్‌రెడ్డి

Drukpadam

సుపరిపాలన కోసం మంచి నిర్ణయం…మాజీ ఎంపీ పొంగులేటి…

Drukpadam

ప్రధాని మోడీ పై ఆసక్తి రేపుతున్న శరద్ పవార్ ప్రసంశలు…

Drukpadam

Leave a Comment