సాగర్ బరిలో టీడీపీ -అభ్యర్థిగా అరుణకుమార్
-కాంగ్రెస్ నుంచి జానారెడ్డి
-అధికార టీఆర్ యస్ నుంచి చిన్నపరెడ్డి
నాగార్జున సాగర్ కు జరిగే ఉపఎన్నకల్లో పోటీచేయాలని టీడీపీ నిర్ణయించింది . తన అభ్యర్థిగా మువ్వా అరుణకుమార్ ను పోటీకి దింపనున్నట్లు ఆపార్టీ ప్రకటించింది. ఇప్పటి వరకు అధికార టీఆర్ యస్ , కాంగ్రెస్ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించినప్పటికీ కాంగ్రెస్ నుంచి కుందూరు జానారెడ్డి , టీఆర్ యస్ నుంచి టి. చిన్నపరెడ్డి ను ప్రకటిస్తారని సమాచారం. అయితే ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, టీఆర్ యస్ లు ప్రచారం ప్రారంభించాయి. అధికార టీఆర్ యస్ తరుపున ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే హాలియాలో మీటింగ్ పెట్టి మరి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. తమ ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెట్టిందని పెన్షన్లు , రేషన్ కార్డులు ఇవ్వబోతుందని అన్నారు. దళితులకు బడ్జెట్ లో 1000 కోట్లు నిధులు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ప్రతి పంచాయతీకి 20 లక్షలు , ముంజురు చేస్తున్నట్లు తెలిపారు. నెల్లికల్లు ఎత్తిపోతల పథకం శంకుస్థాపన చేసిన సీఎం నీటి ప్రాజెక్టుల పై కాంగ్రెస్,బీజేపీ విమర్శలను కొట్టి పారేశారు. ఈ సభ ద్వారా అభ్యర్థిని ప్రకటిస్తారని అందరు అనుకున్నారు. కానీ ఎవరికీ ప్రకటించలేదు. నోములు నరసింహయ్య కుటుంబం నుంచి ఎవరినైనా పోటీకి పెడతారని భావించిన , అలంటి ఆలోచనలు లేదని తెలుస్తుంది. ఎమ్మెల్యేకి తేరా చిన్నపరెడ్డి ని పోటీలోకి దించాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం . ఇక బీజేపీ ఇంకా ఎవరిని నిర్ణయించలేదు. బలమైన అభ్యర్థి కోసం చూస్తున్నాయి.
previous post