ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కాలుకు గాయం …ఢిల్లీ పర్యటన రద్దు!
-ఇంట్లో వ్యాయాయం చేస్తుండగా బెణికిన కాలు
-విశ్రాంతి అవసరం అన్న వైద్యులు
-తన ఢిల్లీ పర్యటన విరమించుకున్న సీఎం జగన్
-ఢిల్లీ పర్యటనకు హోమ్ మంత్రి సుచరిత
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం ఉదయం ఇంట్లో వ్యాయాయం చేస్తుండగా కాలు బెణికింది. దీంతో ఆయన ఈ రోజు ఢిల్లీ కి వెళ్ళలిసిన టూర్ వాయిదా పడింది. నక్సల్ ప్రభావిత ప్రాంతాలలో అభివృద్ధి పనులపై కేంద్ర హోమ్ శాఖ ఆధ్వరంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి నక్సల్ ప్రభావిత ప్రాంతాల ముఖ్యమంత్రులు హాజరు కావాల్సి ఉంది. జగన్ కాలు బెణకటంతో వైద్యుల సలహామేరకు ఆయన తన పర్యటనను వాయిదా వేసుకున్నారు. ఆయన బదులు రాష్ట్ర శాఖ మంత్రి మేకతోటి సుచరిత హాజరు అవుతున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. జగన్ పర్యటన కోసం చివరి క్షణం వరకు వేచి చూశారు . నొప్పి తగ్గితే వెళ్లాలనే ఆలోచనతోనే ఉన్నారు. కానీ వైద్యులు విశ్రాంతి అవసరం అని చెప్పడంతో తన ఢిల్లీ టూర్ రద్దు చేసుకున్నారు.
జగన్ రోజు ఉదయం వ్యాయాయం చేస్తుంటారు . రోజులాగానే గురువారం ఉదయం ఆయన వ్యాయాయం చేస్తున్న సందర్భంలో కాలు బెణికింది. వెంటనే వైద్యులు వచ్చి చికిత్స చేశారు. అయితే నొప్పి తగ్గలేదు. తిరిగి పరీక్షించారు. అయితే ఎటు నడవకుండా కొంత విశ్రాంతి తీసుకుంటే నొప్పి తగ్గిపోతుందని వైద్యులు సలహా ఇచ్చారు. ఆయనకు రెండుమూడు రోజులు విశ్రాంతి అవసరం అని సూచించారు.