Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

బీజేపీ వలలో చిక్కుకొని విలవిల లాడుతున్న అన్నా డీఎంకే

బీజేపీ వలలో చిక్కుకొని విలవిలా లాడుతున్న అన్నా డీఎంకే
-అభ్యర్థుల ఎంపికలోనూ వారిజోక్యమేనంటూ రుసరుసలు
-జాగ్రత్తగా గమనిస్తున్న ప్రత్యర్థులు
-ఇబ్బందికమే నంటున్న పరిశీలకులు
తమిళనాట మరికొద్ది రోజుల్లో అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఎవరి వ్యూహాలతో వారు ఉన్నారు .జయలలిత మరణానంతరం ఏర్పడిన మంత్రివర్గం వర్గం దగ్గరనుంచి అన్నా డీఎంకే పార్టీ కేంద్రంలోని బీజేపీ చేతిలో చిక్కుకొని విలవిల లాడుతుందనే అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి. కేంద్రం ఏది చెబితే అది చేస్తుందనే అంటున్నారు పరిశీలకులు . ఈ రెండు పార్టీలు రేపు ఎన్నికల్లో కలిసి పోటీ చేయబోతున్నాయి. ఎన్నికల్లో పొత్తులు , ఎత్తులు సహజం. ఎవరి వ్యూహాలు వారికీ ఉంటాయి. ఎవరు ముఖ్యమంత్రిగా ఉండాలి ఎవరు మంత్రిగా ఉండాలి అనేవిషయంలోకూడా బీజేపీ జోక్యం ఉంటుందనే విమర్శలు ఉన్నాయి. రానున్న ఎన్నికలకోసం అభ్యర్థులకు అన్ని పార్టీలు అభ్యర్థుల ఎంపిక కొనసాగిస్తున్నాయి. అన్నా డీఎంకే మంత్రం ఏచిన్న సమస్య వచ్చిన కేద్రం వైపు చేస్తుందనే అనుకుంటున్నారు తమిళ ప్రజలు , చివరకు అన్నా డీఎంకే అభ్యర్థుల ఎంపికలోనూ బీజేపీ జోక్యం ఉందనే ప్రచారం జరుగుతుంది. దీంతో ఆపార్టీ పై ఉన్న నమ్మకాలూ ప్రజల్లో సన్నగిల్లుతున్నాయి. డీఎంకే నేత స్టాలిన్ దీనిపై ద్రుష్టి సారించారు. బీజేపీ ప్రభావం అన్నా డీఎంకే మీద ఉందనే అభిప్రయం ఎప్పటినుంచో ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో అన్నా డీఎంకే కు తమిళనాడు లో రాజకీయ పరిణామాలు అనుకూలంగా లేవు. చిన్నమ్మ జైలు నుంచి విడుదల కావటం ఆమె పార్టీమి స్వాధీనం చేసుకుంటారనే అభిప్రాయాలూ చోటుసేసుకోవటం ఆపార్టీకి ఇబ్బంది కరంగా మారింది. బీజేపీ తమిళనాట తమ ప్రభావాన్ని చాటుకునేందుకు అన్నా డీఎంకే ను పావుగా ఉపయోగించుకోవాలని చేస్తుందనే అభిప్రాయాలూ ఉన్నాయి. . అందుకు ఆపార్టీని నేరుగా కేంద్రం తన డైరక్షన్ లో నడుపుతుందనే ప్రచారం తో ప్రజలు ఆలోచనలో పడ్డారు. అన్నా డీఎంకే ను తిరిగి కైవశం చేసుకోవాలని చూస్తున్న శశికళకు ఆపార్టీ లో పరిణామాలను నిశితంగా గమనిస్తున్నారు. ఈ మొత్తం పరిణామాలు స్టాలిన్ నాయకత్వంలోని డీఎంకే కు అనుకూలంగా మారతాయని పరిశీలకులు భావిస్తున్నారు. తమిళనాడులో మొదటినుంచి డీఎంకే ,అన్నా డీఎంకే మధ్యనే పోటీ కొనసాగుతుంది. బీజేపీ ఈ సారి తమిళనాడులో ఎలాగైనా ఖాతా తెరవాలని గట్టి పట్టుదలతో ఉంది. అన్నా డీఎంకే కు మొదటి నుంచి ఉన్న శత్రువు కాకా కొత్త శత్రువు శశికళ రూపంలో ఉన్నారు. పైగా ఆమె ప్రస్తుత అన్నా డీఎంకే నాయకత్వంపై పాగా ప్రతీకారంతో రగిలి పోతున్నారు. పళని స్వామి ,పన్నీరు సెల్వం పట్ల ఆగ్రంగా ఆగ్రహంగా ఉన్నారు. ఆమె జైలు నుంచి విడుదలైన తరువాత చెన్నై కి రోడ్ మార్గం ద్వారా 334 కి.మీలు 6 .30 గంటల ప్రయాణానికి 23 గంటలు పట్టింది. దారిపొడవునా ప్రజలు బారులు తీరి ఆమెకు స్వాగతం పలకటం కేంద్రాన్ని సైతం కలవర పెడుతుంది . తిరిగి తమిళనాడులో తమకు అనుకూలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచనతో ఉన్న బీజేపీకి తమిళ ప్రజలు ఆవకాశం కల్పిస్తారా? లేదా ? అనేది ఎన్నికలవరకు వేచిచూడాల్సిందే .

Related posts

రేవంత్‌రెడ్డి అంతు చూస్తాం… అక్కడ చూపిస్తే రాజీనామా చేస్తా: అసెంబ్లీలో కేటీఆర్

Ram Narayana

కృష్ణ జలాల విషయంలో ఇద్దరు సీఎం లు నాటకాలాడుతున్నారు:బండి సంజయ్ ఫైర్!

Drukpadam

బిజెపి నేతల్లారా ఖబడ్దార్ : మంత్రి సత్యవతి రాథోడ్ వార్నింగ్

Drukpadam

Leave a Comment