Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

కాంగ్రెస్‌లోకి కన్నయ్య, జిగ్నేష్ మేవాని.. ముహూర్తం ఖరారు!

కాంగ్రెస్‌లోకి కన్నయ్య, జిగ్నేష్ మేవాని.. ముహూర్తం ఖరారు!
గత లోక్‌సభ ఎన్నికలకు ముందు సీపీఐలో చేరిన కన్నయ్య
బెగుసరాయి నుంచి పోటీ చేసి ఓటమి
గుజరాత్‌లోని వడ్‌గాం నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న జిగ్నేష్ మేవాని
ప్రశాంత్ కిషోర్ చేరుతున్నట్లు వార్తలు , ఇప్పటికే హార్దిక్ పటేల్ కాంగ్రెస్ లో చేరిక

కాంగ్రెస్ పార్టీ పూర్వవైభవం సంతరించుకునేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. 2024 ఎన్నికల టార్గెట్ గా ఎత్తుగడలతో ముందుకు సాగుతుంది. అందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ లో భారీ మార్పులకు శ్రీకారం చుడుతోంది. కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందని ,బలహీన పడి ప్రాతీయపార్టీల స్థాయికి దిగజారిందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ లోకి యువకులను ఆహ్వానించే పనిలో నిమగ్నమైంది. ఇప్పటికే వివిధ రాష్ట్రాలలో ఉన్న పీసీసీ లను మార్చటంతోపాటు దూకుడుగా వ్యవరించగలిగే వారిని రాష్ట్రంలో క్రేజ్ ఉన్న లీడర్లను ఎంపిక చేసి పీసీసీ పగ్గాలను అప్పగిస్తుంది. కొన్ని రాష్ట్రాల ప్రక్షాళన పూర్తీ కాగా మరికొన్ని రాష్ట్రాలపై ద్రుష్టి సారించింది.

కాంగ్రెస్ లో అసమ్మతివాదులుగా ముద్రపడి ,గ్రూప్ ఆఫ్ 23 గా ఉన్న నాయకుల వ్యవహారంలో కూడా ఆచితూచి అడుగులు వేస్తుంది. నిరంతరం పార్టీ పై నిందలు వేస్తూ ప్రెస్ మీట్లు ,ప్రెస్ స్టేట్ మెంట్లు ఇస్తూ పార్టీ ని బలహీన పరుస్తున్న వారి ని కూడా కంట్రోల్ చేయడం లేదా వారి దారి వారిని చూసుకోమనే రీతిలో సంకేతాలు పంపిస్తుంది. గులాంనబీ ఆజాద్ , కపిల్ సిబాల్ లాంటి వారిని అసలు పట్టించుకోవడంలేదు. ఆజాద్ ప్రధాని పొగడ్తలకు పడిపోయి పార్టీ కి నష్టం చేసేలా వ్యాఖ్యనిస్తుండటం , పార్టీ విధానాలకు భిన్నంగా వ్యవహరించడంపై పార్టీ అధిష్టానం గుర్రుగా ఉన్న సంగతి తెలిసేందే .అంతే కాకుండా కాంగ్రెస్ కు చెందిన యువనేతలు అనేక మంది పార్టీ నుంచి బయటకు వెళ్ళిటంతో అదే స్థాయులు పేరున్న నేతలను కాంగ్రెస్ పార్టీలోని ఆహ్వానించడం ద్వారా నూతన జవసత్వాలు కల్పించాలని గట్టి పట్టుదలతో ఉన్న రాహుల్ అండ్ ప్రియాంక టీం చర్యలు చేపట్టింది. ప్రశాంత్ కిషోర్ పార్టీ లో చేరతారని వార్తలు వచ్చాయి. ఇప్పుడు దేశవ్యాపితంగా మంచి పేరున్న సిపిఐ నేత కన్నయ్య కుమార్ కాంగ్రెస్ లో చేరబోతున్నారనే వార్తలు కాంగ్రెస్ కు కలిచొచ్చే అంశమే .జిగ్నేష్ మేనని దళిత సామాజిక వర్గంలో మంచి పట్టున్న నేత . గుజరాత్ లో ఆయన కాంగ్రెస్ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి శాసనసభకు ఎన్నికైయ్యారు . ఆయనకూడా కాంగ్రెస్ లో చేరుతున్నట్లు కాంగ్రెస్ వర్గాలు ధ్రువీకరించాయి. ఇప్పటికే అక్కడ పటేల్ లో మంచి పట్టు అనేక ఉద్యమాలు నడిపిన హార్దిక్ పటేల్ కాంగ్రెస్ లో ఉన్నారు.

బీహార్‌కు చెందిన యువ నేత కన్నయ్య కుమార్, గుజరాత్‌కు చెందిన జిగ్నేష్ మేవాని కాంగ్రెస్‌లో చేరేందుకు దాదాపు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 28న వీరిద్దరూ కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకోబోతున్నట్టు తెలుస్తోంది. ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థి సంఘ అధ్యక్షుడిగా పనిచేసిన కన్నయ్య కుమార్ గత లోక్‌సభ ఎన్నికలకు ముందు సీపీఐలో చేరి బీహార్‌లోని బెగుసరాయి నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. గుజరాత్‌లోని వడ్‌గాం ఎమ్మెల్యే అయిన జిగ్నేష్ మేవాని రాష్ట్రీ దళిత్ అధికార్ మంచ్ కన్వీనర్‌గా ఉన్నారు. భగత్‌సింగ్ వర్ధంతి సందర్భంగా వీరిద్దరూ ఈ నెల 28న కాంగ్రెెస్ పార్టీలో చేరబోతున్నట్టు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి.

Related posts

ఏపీలో రాజకీయ పార్టీపై షర్మిల వ్యాఖ్యలు… మంత్రి బాలినేని స్పందన!

Drukpadam

భారతీయ దుష్ట భావజాలానికి ముర్ము ప్రతినిధి అన్న కాంగ్రెస్ నేత… భగ్గుమన్న బీజేపీ!

Drukpadam

పట్టు -బెట్టు

Drukpadam

Leave a Comment