Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

బీజేపీ నేతలు తాలిబన్లతో సమానం …కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య బీజేపీ పై ఘాటు వ్యాఖ్యలు!

బీజేపీ నేతలు తాలిబన్లతో సమానం …కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య బీజేపీ పై ఘాటు వ్యాఖ్యలు!
-బీజేపీ, ఆరెస్సెస్‌లో హిట్లర్ జన్యువులు
-కర్ణాటకలో పాలన పగ్గాలు ఆరెస్సెస్ చేతిలోనే
-అబద్ధాలను మార్కెట్ చేయడంలో బీజేపీ నేతలు సిద్ధహస్తులు:
-చాలాచోట్ల దొడ్డిదారిన అధికారంలోకి వచ్చారు

కర్ణాటకలోని అధికార బీజేపీపై ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దివంగత ముఖ్యమంత్రి ఆర్.గుండూరావు జయంతి సందర్భంగా బెంగళూరులో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సిద్ధరామయ్య మాట్లాడుతూ.. బీజేపీ పై గతంలో ఏ కాంగ్రెస్ నాయకుడు చేయనంతటి విమర్శలు చేశారు. ఆఫ్ఘన్ లో తాలిబాన్లలాగానే బీజేపీ నేతలు మతాన్ని రెచ్చగొట్టి పబ్బం గడుపుకుంటున్నారని ధ్వజమెత్తారు. జర్మనీ నియంత హిట్లర్ ఎలాగో బీజేపీ కూడా అలాగనేనని హిట్లర్ జాతీయవాదాన్ని రెచ్చగొట్టి యూదులకు వ్యతిరేకంగా హింస చెలరేగేలా చేశారని అలంటి పరిస్థితే భారత్ లో నేడు బీజేపీ పాలనలో ఉందని అన్నారు. హిట్లర్ జన్యువులు బీజేపీ లో ఉన్నాయని సిద్దరామయ్య బీజేపీ విధానాలను ఏకిపారేశారు .

ఎలాంటి ప్రజాబలం, ప్రజామోదం లేకుండానే దేశంలోని చాలా చోట్ల బీజేపీ దొడ్డిదారిన అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. సబ్‌ కా సాథ్, సబ్ కా వికాస్ అని చెప్పే ప్రధాని మోదీ తన మంత్రివర్గంలో క్రైస్తవులు, ముస్లింలకు చోటు కల్పించలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. మతాన్ని రెచ్చగొట్టడం ,హిందూలులకు తామే వారసులమన్నట్లు గా ప్రచారం చేసుకోవడం , దేవాలయాలకు తామే అధిపతులం అన్నట్లు వ్యవహరించడం ,బీజేపీ పుట్టకముందు నుంచే ఉన్న సంప్రదాయాలకు తామే వారసులం అని చెప్పుకోవడం హిందూ ధర్మాన్ని హిందూ మతంగా ప్రచారం చేయడం పై ఆయన మండిపడ్డారు .

కర్ణాటకలో బీజేపీ అధికారంలో ఉన్నప్పటికీ పాలన మాత్రం సంఘ పరివారే చూసుకుంటోందని ఆరోపించారు. అబద్ధాలు సృష్టించడం, వాటిని మార్కెటింగ్ చేయడం బీజేపీ నేతలకు కొట్టినపిండి అని విమర్శించారు. హిట్లర్ పాలనలో పాల్ జోసెఫ్ గ్లోబెల్స్ అనుసరించిన సిద్ధాంతాన్నే బీజేపీ కూడా పాటిస్తోందని దుయ్యబట్టారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్‌లో హిట్లర్ జన్యువులు ఉన్నాయని, బీజేపీ నేతలు తాలిబన్లతో సమానమని, వారితో జాగ్రత్తగా ఉండాలని సిద్ధరామయ్య సూచించారు.

Related posts

దేవినేని ఉమా అరెస్ట్‌.. బెజ‌వాడ‌లో ఉద్రిక్త‌త‌!

Drukpadam

వేటు వేస్తారా ? రాజీనామా చేస్తారా ? ఎంపీ రఘురామ వ్యవహారం చివర అంకానికి!

Drukpadam

రానున్న కురుక్షేత్ర యుద్ధంలో కేసీఆర్ ఇంటికే …సత్తుపల్లో సభలో పొంగులేటి …

Drukpadam

Leave a Comment