హైద్రాబాద్ యూటీ అంశంపై లోకసభలో రగడ
-ఈ అంశం పరిశీలనలో కూడా లేదన్న కిషన్ రెడ్డి
-ఇది బీజేపీ,ఎం ఐ ఎం నాటకమన్న కాంగ్రెస్
హైదరాబాద్,కేంద్రపాలిత ప్రాంతంగా చేస్తారన్న అంశంపై లోకసభలో కేంద్ర హోమ్ శాఖా సహాయమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు.ఇలాంటి ప్రతిపాదనలు ఏమి కేంద్రం వద్ద లేవని స్పష్టం చేశారు. అసదుద్దీన్ ఒవైసి లేవనెత్తిన ఈ అంశంపై అయన సమాధానం ఇస్తూ ఇలాంటి రుమార్లును లేపటం ఎం ఐ ఎం ,టీఆర్ యస్ లకు అలవాటే నన్నారు.అసదుద్దీన్ మాట్లాడుతూ ,హైదరాబాద్ తో పాటు చెన్నై , బెంగుళూరు,ముంబై ,లక్నో ,అహమ్మదాబాద్ లను యూటీ చేయాలనే ఆలోచన కేంద్రం చేస్తుందని ఆరోపణలు చేసిన అసదుద్దీన్ సభనుంచి వెళ్లిపోవటాన్ని కిషన్ రెడ్డి తప్పుపట్టారు. లోకసభలో జమ్మూ కాశ్మీర్ విభజన చట్ట బిల్లుపై జరిగిన చర్చలో ఈ అంశాన్ని ప్రస్తావించిన అసదుద్దీన్ దీనికి తగ్గ ఆధారాలను సభదృష్టికి తీసుకరాలేక పోవటం పై బీజేపీ మండిపడింది. టీఆర్ యస్, ఎం ఐ ఎం లకు ఇలాంటి తప్పుడు ప్రచారాలను ప్రచారం చేయటం అలవాటే నాని ధ్వజంమెత్తింది.
లోకసభలో జరిగిన ఈ చర్చపై కాంగ్రెస్ ఘాటుగానే స్పందించింది.ఎం ఐ ఎం ,టీఆర్ యస్, బీజేపీ ల నాటకంలో భాగమే హైదరాబాద్ యూటీ అని ఎమ్మెల్యే జగ్గారెడ్డి మంది పడ్డారు. ఏదోరకంగా సమస్యలను పక్కదార్లు పట్టించేందుకేనని ఆరోపించారు.మాజీ ఎంపీ మధుయాష్కీ ,ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి లుసైతం దీనిపై పండిపడ్డారు.
ఎమ్మెల్యే రాజాసింగ్ అసదుద్దీన్ కు అసలు బుద్ధిలేదని హైదరాబాద్ ను యూటీ చేస్తామని బీజేపీ చెప్పిందా అని ప్రశ్నించారు.
previous post