Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

వ్యవసాయ చట్టాలు రద్దు చేయాల్సిందే …నినదిస్తున్న భారతావని …ఢిల్లీలో భారీగా ట్రాఫిక్ జాం …

వ్యవసాయ చట్టాలు రద్దు చేయాల్సిందే …నినదిస్తున్న భారతావని …ఢిల్లీలో భారీగా ట్రాఫిక్ జాం …
-దేశవ్యాప్తంగా ప్రారంభమైన భారత్ బంద్..
తెలంగాణాలో పలు చోట్ల అరెస్టులు
-ఏపీలో డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు
-నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా బంద్‌కు పిలుపునిచ్చిన సంయుక్త కిసాన్ మోర్చా
-తెలంగాణ ,ఆంధ్ర లో వర్షాన్ని సైతం లెక్క చేయకుండాబంద్
-ఏపీ లో బంద్ కు అధికార వైసీపీ మద్దతు
-బంద్‌కు సంఘీభావంగా మధ్యాహ్నం వరకు బస్సులు -నిలిపేస్తున్నట్టు ప్రకటించిన ఏపీ
-స్కూళ్లకు సైతం సెలవు
-సంయుక్త కిషన్ మోర్చా ఇచ్చిన బంద్ కు దేశవ్యాపితంగా మద్దతు
దేశవ్యాప్తంగా భద్రత కట్టుదిట్టం

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చిన పిలుపు మేరకు నేడు దేశవ్యాప్తంగా బంద్ ప్రారంభమైంది. కాంగ్రెస్, వామపక్షాలు, ఎస్పీ, బీఎస్పీ, ఆమ్ ఆద్మీ పార్టీ, టీడీపీ సహా పలు రైతు సంఘాలు ఈ బంద్‌కు మద్దతు ప్రకటించాయి. బంద్ నేపథ్యంలో పోలీసులు దేశవ్యాప్తంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నిరసన శిబిరాల నుంచి రైతులు ఢిల్లీకి రాకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. ఇండియా గేట్, విజయ్ చౌక్ సహా పలు ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.

ఇక ఏపీలోనూ బంద్ కొనసాగుతోంది. బంద్‌కు అధికార వైసీపీ మద్దతు ప్రకటించడంతో గత రాత్రి నుంచే ఆర్టీసీ బస్సులు డిపోలకు పరిమితమయ్యాయి. నేటి మధ్యాహ్నం వరకు బస్సులను నిలిపివేసి బంద్‌కు సంఘీభావం ప్రకటిస్తామని ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఈ నేపథ్యంలో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. ప్రధానప్రతిపక్షం తెలుగుదేశం కూడా బంద్ కు పిలుపు నివ్వడంతో జన జీవనం పూర్తిగా స్తంభించింది.

మరోవైపు, తెలంగాణలోనూ బంద్ ప్రారంభమైంది. పలు జిల్లాల్లో బస్సులు నిలిచిపోయాయి.ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనూ , హనుమకొండ, ఉమ్మడి మహబూబ్‌నగర్, షాద్‌నగర్ తదితర ప్రాంతాల్లో కాంగ్రెస్, వామపక్ష నేతలు, విద్యార్థి సంఘాలు బస్సులను ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. కొత్తగూడెం లో అఖిలపక్షాల ఆధ్వర్యంలో కార్యకర్తలు బస్సు డిపో మందు బైఠాయించారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా బంద్ పాటించేందుకు పార్టీల కార్యకర్తలు రోడ్ల మీదకు వచ్చి వ్యాపారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఉమ్మడి మహబూబ్‌నగర్ పరిధిలో 842 బస్సులు నిలిచిపోయాయి. రోడ్లపై బైఠాయించిన నేతలు కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నేటి సాయంత్రం 4 గంటల వరకు బంద్ కొనసాగుతుందని, బంద్ నుంచి అత్యవసర సేవలకు మినహాయింపు ఇచ్చినట్టు సంయుక్త కిసాన్ మోర్చా ప్రకటించింది.

భారత్ బంద్ ఎఫెక్ట్.. తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లే బస్సుల నిలిపివేత

 

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన సాగుచట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా చేపట్టిన భారత్ బంద్ కొనసాగుతోంది. ఏపీ, తెలంగాణలో ఆర్టీసీ బస్సులు చాలా వరకు డిపోలకే పరిమితమయ్యాయి. బంద్ నేపథ్యంలో తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లే బస్సులను ఆర్టీసీ అధికారులు నిలిపివేశారు. బంద్‌కు సంఘీభావంగా మధ్యాహ్నం 12 వరకు ఏపీ ప్రభుత్వం బస్సులను నిలిపివేయాలని నిర్ణయించిన నేపథ్యంలో టీఎస్ ఆర్టీసీ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. 12 గంటల తర్వాతే ఏపీకి బస్సులు నడపాలని నిర్ణయించారు. హన్మకొండ, వరంగల్, మహబూబ్‌నగర్ తదితర జిల్లాల్లో బస్సులు నిలిచిపోగా, కొన్ని జిల్లాల్లో మాత్రం బస్సులు యథావిధిగా నడుస్తున్నాయి.

Related posts

కొత్త ముసుగులో చంద్రబాబు తెలంగాణలోకి వస్తున్నారు: హరీశ్ రావు…

Drukpadam

ప్రపంచంలోనే ఎంతో ముఖ్యమైన పార్టీ బీజేపీ: అమెరికా దిగ్గజ పత్రిక!

Drukpadam

ఈటలపై ఈగవాలితే చూస్తూ ఉరుకోము …కేసీఆర్ జాగ్రత్త :కిషన్ రెడ్డి హెచ్చరిక

Drukpadam

Leave a Comment