Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఆర్టీసీ లో సఙ్గనార్ మార్క్ నిబంధనలు: సంచలన ఆదేశాలు.. డ్రైవర్లపై కఠిన చర్యలు!

ఆర్టీసీ లో సఙ్గనార్ మార్క్ నిబంధనలు: సంచలన ఆదేశాలు.. డ్రైవర్లపై కఠిన చర్యలు!
బస్ రోడ్ మధ్యలో ఆపితే ఫైన్ …అది డ్రైవర్ చెల్లంచాల్సిందే
రోడ్డు మధ్యలో బస్సులు ఆపడంపై ఫిర్యాదులు
అలా ఆపడం ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధమన్న సజ్జనార్
ట్రాఫిక్ పోలీసుల ఫైన్‌ను డ్రైవర్లే చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరిక
క్రమ శిక్షణ చర్యలు కూడా తప్పవన్న ఆర్టీసీ ఎండీ

నిజాయుతికి మారుపేరు అధికారిగా ఉన్న సజ్జనార్ తెలంగాణ ఆర్టీసీ ఎండి గా ఇటీవల భాద్యతలు స్వీకరించారు. ఆయన తన విధి నిర్వహణలో తనదైన మార్క్ వేస్తుంటారు . భాద్యతలు స్వీకరించిన వెంటనే ఆర్టీసీలో ఉన్న లోపాలపై ద్రుష్టి సారించిన సజ్జనార్ , సంస్థను గాడిలో పెట్టె ప్రయత్నానికి పూనుకున్నారు. ఆయన స్వయంగా ఆర్టీసీ బస్ లో సామాన్యుడిలా ప్రయాణం చేశారు. ఆర్టీసీ బస్ లను ప్రయాణికులను ఎక్కించుకునేందుకు బస్ లను ఆపుతున్న డ్రైవర్లు నిబంధనలకు విరుద్ధంగా ఎక్కడపడితే అక్కడ బస్ లను నిలపటం జరుగుతుందని ఫిర్యాదులు అందాయని ,నడి రోడ్ పై బస్ నలపడం వల్ల ట్రాఫిక్ ఇబ్బంది కలుగుతుందనే స్పృహ కూడా లేకుండా కొందరు డ్రైవర్లు వ్యవహరిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అందువల్ల ఇక నుంచి ఆలా రోడ్ పై బస్ లు ఆపడం నిబంధనలకు విరుద్ధం అని ట్రాఫిక్ వారు వేసే ఫైన్ లను డ్రైవర్ లే చెల్లించాలని ఆదేశాలు జారీచేశారు.

సజ్జనార్ సంచలన ఆదేశాలు చర్చనీయాంశంగా మారాయి., ఇది కచ్చితంగా అమలు చేయాలనీ సజ్జనార్ మంచి ఆదేశాలు జారీచేశారని కొందరు అభిప్రాయపడుతుంటే మరికొందరు నిబంధనలు పాటించాలని చెప్పడం లో తప్పులేదు కానీ ట్రాఫిక్ ఫైన్ లు డ్రైవర్ లు చెల్లించాలనే నిబంధనలపై కార్మికులు భగ్గు నంటున్నారు

ఆర్టీసీ బస్సులను రోడ్డు మధ్యలో ఆపి ప్రయాణికులను ఎక్కించుకుంటూ ప్రమాదాలకు కారణమవుతున్నట్టు వస్తున్న ఫిర్యాదులపై సజ్జనార్ స్పందించారు. ఇలాంటి ఘటనల వల్ల ఆర్టీసీ ప్రతిష్ఠ దెబ్బతింటోందని భావించిన ఆయన నష్టనివారణ చర్యలు ప్రారంభించారు. ఇకపై రోడ్డు మధ్యలో బస్సులను ఆపొద్దని ఉత్తర్వులు జారీ చేశారు. రోడ్డు మధ్యలో బస్సులను ఆపడం ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధమని, ట్రాఫిక్ పోలీసులు కనక ఫైన్ వేస్తే ఆ మొత్తాన్ని సంబంధిత డ్రైవర్లే భరించాల్సి ఉంటుందని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

అంతేకాదు, క్రమశిక్షణ చర్యలు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. రోడ్డు మధ్యలో బస్సులను ఆపడం నేరమన్న విషయంలో డ్రైవర్లను అప్రమత్తం చేయాలని, అందుకోసం డిపోల నుంచి రహదారులపైకి వచ్చేముందు డీజిల్ బంకుల వద్ద బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. డ్యూటీ చార్టులు ఇచ్చేముందు డ్రైవర్లకు సూపర్‌వైజర్లు ఈ విషయాన్ని వివరించి చెప్పాలని పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే డ్రైవర్లపై కఠిన చర్యలు తప్పవన్న విషయాన్ని కూడా డ్రైవర్ల దృష్టికి తీసుకెళ్లాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Related posts

ఎంపీ శశి థరూర్ రాజదీప్ సర్దేశాయి అరెస్ట్ పై సుప్రీం స్టే

Drukpadam

రాజీవ్ గాంధీ హంతకులకు స్వేచ్ఛను ప్రసాదించిన సుప్రీంకోర్టు!

Drukpadam

పోలవరం పరిహారం కోసం కేంద్రంతో కుస్తీ …ప్రధాని దృష్టికి తీసుకోని పోయా :జగన్

Drukpadam

Leave a Comment