Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

రాజమండ్రి వైసీపీ లో ఇంటర్నల్ పంచాయతీ …రంగంలోకి దిగిన వై వి సుబ్బారెడ్డి!

రాజమండ్రి వైసీపీ లో ఇంటర్నల్ పంచాయతీరంగంలోకి దిగిన వై వి సుబ్బారెడ్డి!
జ‌గ‌న్ ఆదేశాల‌తో జ‌క్కంపూడి రాజా, భ‌ర‌త్‌ను పిలిచి మాట్లాడిన వై వి
ఇటీవ‌ల రాజా, భ‌ర‌త్ మ‌ధ్య వివాదం
సీరియ‌స్ అయిన అధినేత జగన్
సీఎం క్యాంపు ఆఫీసుకు రాజా, ‌భరత్
వివ‌ర‌ణ కోరిన సుబ్బారెడ్డి

వైసీపీకి మంచి పట్టున్న రాజమండ్రిపార్టీ లో ఇంటర్నల్ వార్ సీఎం జగన్ కు తలనొప్పిగా మారింది. ఎంపీ మరగని భరత్ ,ఎమ్మెల్యే జక్కంపూడి రాజా లు కొద్దిరోజుల క్రితం శత్రుపక్షాలు బహిరంగ ప్రకటనలు చేసుకున్నట్లు వీధికెక్కారు. అంతకు ముందు ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ , కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్ర శేఖర్ రెడ్డి మధ్య మాటల యుద్ధం వైసీపీ లో ఉన్న అసమ్మతికి అద్దం పట్టింది. ఇప్పుడు ఇరువురు యువనేతలు ఒకరిపై ఒకరు బహిరంగ విమర్శలకు దిగడం వారి పరువుతో పాటు పార్టీ పరువు తీశారని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మధ్య ఇటీవల తీవ్ర స్థాయిలో మాట‌ల యుద్ధం చోటు చేసుకున్న సంగతి విదితమే. నేతలు హద్దులు దాటడంతో వైసీపీ అధిష్ఠానం దీనిపై దృష్టి సారించింది. దీనిపై సీఎం జ‌గ‌న్ సీరియ‌స్‌గా ఉన్నారు. మార్గాని భరత్, జక్కంపూడి రాజా తాడేపల్లికి రావాలని పార్టీ హైకమాండ్ ఆదేశించడంతో వారు ఈ రోజు అక్క‌డ‌కు చేరుకొని వై వి సుబ్బారెడ్డి తో భేటీ అయ్యారు .

వారితో మాట్లాడి వివాదాన్ని పరిష్క‌రించే బాధ్య‌త‌ను వైవీ సుబ్బారెడ్డికి అధిష్ఠానం అప్ప‌గించింది. ఈ క్రమంలో సీఎం క్యాంపు కార్యాల‌యంలో ఆ ఇద్ద‌రు నేత‌లతో సుబ్బారెడ్డి మాట్లాడి ఇరువురికి సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం . వారిద్ద‌రి నుంచి వివ‌ర‌ణ తీసుకున్న అనంతరం సీఎం జ‌గ‌న్ కు ఆయా అంశాల‌ను సుబ్బారెడ్డి వివ‌రించ‌నున్నారు.

కాగా, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణతో మార్గాని భరత్ సెల్ఫీ దిగడం ఏంటంటూ రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఇటీవ‌ల విమ‌ర్శ‌లు చేశారు. భ‌ర‌త్ కూడా దీటుగా స్పందించారు. దీంతో వారిద్ద‌రి వ్య‌వ‌హారం వైసీపీలో హాట్ టాపిక్‌గా మారింది. గ‌తంలో జ‌గ‌న్ అక్ర‌మాస్తుల కేసులో వీవీ లక్ష్మీనారాయణ విచార‌ణ జ‌రిపిన విష‌యం తెలిసిందే.

వీరిద్దరి మధ్య ఏం జరిగిందంటే.. 

పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకానికి రైతులకు పరిహారం చెల్లించాల్సి ఉండగా.. కొందరు రైతులతో రాజమహేంద్రవరంలో బ్యాంకు ఖాతాలు తెరిపించి పెద్దఎత్తున వసూళ్లకు పాల్పడే ప్రయత్నాలు చేశారని ఎంపీ భరత్‌పై జక్కంపూడి రాజా ఇటీవల పరోక్ష విమర్శలు గుప్పించారు. దీనిపై ఎంపీ భరత్‌ మాట్లాడుతూ.. చీకటి రాజకీయాలు ఎవరు చేస్తున్నారో అందరికీ తెలుసుని తనపై అభియోగాలు చేసే ముందు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని ఘాటుగా స్పందించారు

Related posts

ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ వందల కోట్లు ఎలా సంపాందించారు..షర్మిల …

Drukpadam

ఇదేందయ్యా పవన్ కళ్యాణ్ … బద్వేల్ పై బీజేపీని సంప్రదించలేదా?

Drukpadam

తాగండి తాగి! తాగి ఊగండి !! ఇది కేసీఆర్ ప్రభుత్వం తీరు ;సీఎల్పీ నేత భట్టి ధ్వజం!

Drukpadam

Leave a Comment