Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

పవన్ ఏపీ పర్యటన ఉద్రిక్తం … గన్నవరం ఎయిర్ పోర్ట్ కు ఫ్యాన్స్ అడ్డుకున్న పోలీసులు

పవన్ ఏపీ పర్యటన ఉద్రిక్తం … గన్నవరం ఎయిర్ పోర్ట్ కు ఫ్యాన్స్ అడ్డుకున్న పోలీసులు

-గన్నవరం చేరుకున్న ప‌వన్ క‌ల్యాణ్‌.. ఎయిర్‌పోర్టు వ‌ద్ద ఫ్యాన్స్ ను అడ్డుకున్న పోలీసులు ఉద్రిక్త‌త‌
-హైద్రాబాద్ లో పోసానిపై ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫ్యాన్స్ పోలీసుల‌కు ఫిర్యాదు..
-కంప్లైంట్ చేసేందుకు పోసాని కూడా సిద్ధం
-పవన్ కల్యాణ్‌-పోసాని వివాదంపై వెరైటీగా స్పందించిన నాగ‌బాబు!
-ఇన్‌స్టాలో నాగబాబు చాటింగ్
-గ‌తంలో ప‌వ‌న్ ను పోసాని పొగిడిన విష‌యాన్ని గుర్తు చేసిన నాగ‌బాబు
-ఓ సినిమా సీన్‌లో పోసానిని ప‌వ‌న్ చెంప దెబ్బ కొట్టిన సీన్ పోస్ట్

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇటీవల రిపబ్లిక్ సినిమా ఫంక్షన్ లో ఏపీ ప్రభుత్వం పై ,కేబినెట్ మంత్రులపై , ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పై విరుచుకపడ్డారు. సినిమా టికెట్ లు ప్రభుత్వం అమ్మటాన్ని తప్పు పట్టిన పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. దీనిపై అదే స్థాయిలు ఏపీ మంత్రులు పవన్ వ్యాఖ్యలు ఖండిస్తూ ప్రతి దాడి చేశారు. ఈ నేపథ్యంలో ఆయన బుధవారం ఏపీ పర్యటనకు వెళ్లడం ఉద్రిక్తలకు దారితీసింది.

ఈ స‌మ‌యంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ ఏపీలో ప‌ర్య‌టించాల‌ని నిర్ణ‌యం తీసుకోవ‌డం ఉత్కంఠ రేపుతోంది. ఈ క్రమంలో కాసేపటిక్రితం ఆయన హైదరాబాదు నుంచి గ‌న్న‌వ‌రం ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ప‌వ‌న్ కు స్వాగ‌తం ప‌లికేందుకు ఎయిర్‌పోర్టు వ‌ద్ద‌కు అభిమానులు భారీగా చేరుకోవ‌డం, వారిని పోలీసులు అడ్డుకోవ‌డంతో అక్క‌డ ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. ప‌వ‌న్ కు అనుకూలంగా అభిమానులు నినాదాల‌తో హోరెత్తించారు.

కాగా, కాసేప‌ట్లో ప‌వ‌న్ క‌ల్యాణ్ మంగ‌ళ‌గిరిలోని జ‌న‌సేన పార్టీ కార్యాల‌యంలో పార్టీ విస్తృత‌స్థాయి స‌మావేశంలో పాల్గొన‌నున్నారు. ఏపీలో పార్టీని బ‌లోపేతం చేయ‌డం, వైసీపీ ప్ర‌భుత్వంపై పోరాడ‌డంవంటి అంశాల‌పై త‌మ నేత‌ల‌కు ప‌వ‌న్ దిశా నిర్దేశం చేయ‌నున్నారు. కాగా, అక్టోబ‌రు 2న ప‌వ‌న్ ఏపీలోని ప‌లు ప్రాంతాల్లో శ్రమదానం చేయాలని నిర్ణ‌యం తీసుకున్న

పోసానిపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో పవన్ అభిమానుల ఫిర్యాదు

పవన్ కల్యాణ్ పై సినీన‌టుడు పోసాని కృష్ణ మురళి తీవ్ర వ్యాఖ్య‌లు చేయ‌డంతో ప‌వ‌న్ అభిమానులు మండిప‌డుతోన్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే హైద‌రాబాద్‌లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో పోసానిపై జనసేన నేత‌లు ఫిర్యాదు చేశారు. ఆయ‌న‌పై చర్యలు తీసుకోవాలని కోరారు.

దీంతో పోలీసులు పోసానిపై కేసు నమోదు చేసిన‌ట్లు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో పోసాని కూడా పవన్ కల్యాణ్ అభిమానుల నుంచి తనకు ప్రాణహాని ఉందని పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లోనే ఫిర్యాదు చేయాల‌ని నిర్ణయించుకున్నారు. ఇలా జనసేన కార్యకర్తలు, పోసాని ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటోన్న నేప‌థ్యంలో ఉత్కంఠ నెల‌కొంది.

వైసీపీ ప్ర‌భుత్వంపై ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇటీవ‌ల చేసిన విమ‌ర్శ‌ల నేప‌థ్యంలో ఆయ‌న‌పై ఏపీ మంత్రులు కూడా విరుచుకుప‌డుతోన్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్ పై విమ‌ర్శ‌లు చేసేందుకు ఉద్దేశ‌పూర్వకంగానే వైసీపీ పోసానిని దించింద‌ని జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు అంటున్నారు.

నాగబాబు స్పందన ….

పవన్ కల్యాణ్ పై పోసాని కృష్ణ ముర‌ళీ తీవ్ర వ్యాఖ్య‌లు చేయ‌డంతో దీనిపై నాగ‌బాబు స్పందించారు. తాజాగా, ఇన్‌స్టాగ్రామ్‌లో ఆయ‌న‌ నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు స‌మాధానం ఇచ్చారు. ఇందులో చాలామంది పోసాని గురించే అడ‌గ‌డం గ‌మ‌నార్హం. ఇందులో భాగంగా ఓ అభిమాని అడిగిన ప్ర‌శ్న‌కు సమాధానంగా గ‌తంలో ప‌వ‌న్‌పై ఓ ఇంటర్వ్యూలో పోసాని కృష్ణ మురళీ ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించిన వీడియోను నాగ‌బాబు పోస్ట్ చేశారు.

పవన్ కల్యాణ్‌ హీరోగా చేస్తానంటే తాను ఆయనకి బ్లాంక్‌ చెక్‌ ఇస్తాన‌ని, రూ.40 కోట్లైనా నేను పవన్ కల్యాణ్‌కి ఇస్తాన‌ని పోసాని ఆ ఇంట‌ర్వ్యూలో చెప్పుకొచ్చారు. ‘అంత‌గా ఎందుకు ఇస్తానంటే, ప‌వ‌న్ అంత డిమాండ్‌ ఉన్న హీరో’ అని పోసాని అన్నారు. దేశంలో టాప్ హీరోల్లో ఆయ‌న ఒక‌ర‌ని చెప్పారు. రూ.5 కోట్లు లేక‌ రూ.10 కోట్ల కోసం ఆయన పిచ్చి పిచ్చి పనులు చేయడని త‌న‌కు తెలుసని అన్నారు. ఈ వీడియోనే నాగ‌బాబు పోస్ట్ చేశారు.

అలాగే, అత్తారింటికి దారేది సినిమాలో బాగా నచ్చిన డైలాగ్ ఏద‌ని ఓ నెటిజ‌న్ అడిగాడు. దీనికి నాగ‌బాబు స్పందిస్తూ ఆ సినిమాలో పోసానిని ప‌వ‌న్ క‌ల్యాణ్ చెంప‌దెబ్బ కొట్ట‌గా ఆయ‌న ప‌న్ను ఊడిపోయే సీనును పోస్ట్ చేశారు.

ఏపీలో సినిమా టిక్కెట్లను ఆన్ లైన్ లో అమ్ముతామ‌ని చెబుతోన్న ప్ర‌భుత్వ తీరుపై అభిప్రాయమేమిటని ఓ నెటిజ‌న్ ప్ర‌శ్నించాడు. దీంతో ‘విక్రమార్కుడు’ సినిమాలో రవితేజ-బ్రహ్మానందం చోరీ చేసిన‌ డబ్బును పంచుకునే సీనును నాగ‌బాబు పోస్ట్ చేశారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇటీవ‌ల రిప‌బ్లిక్ సినిమా ప్రీరిలీజ్ వేడు‌క‌లో చేసిన వ్యాఖ్య‌లు, శివమణి జాస్‌ కొట్టినట్టు, జాకీర్‌ హుస్సేన్ తబలా కొట్టినట్టు, శంకర్‌ సినిమాకి రెహమాన్‌ మ్యూజిక్‌ ఇచ్చినట్టు ఉన్నాయ‌ని నాగ‌బాబు అన్నారు.

Related posts

కాంగ్రెస్ లో ఎవరికీ వారే యమునాతీరే…

Drukpadam

ఏపీ లో పరిణామాలపై ఐఏఎస్ అధికారుల సంఘం స్పందించాలి: ఎమ్మెల్సీ అశోక్ బాబు!

Drukpadam

ప్రియాంక గాంధీ , డీకే శివకుమార్ లకు తెలంగాణ ఎన్నికల పర్వేక్షణ భాద్యత …!

Ram Narayana

Leave a Comment