Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

పంజాబ్ లో మారుతున్న రాజకీయం.. అమిత్ షాతో భేటీ అయిన అమరీందర్ సింగ్!

పంజాబ్ లో మారుతున్న రాజకీయం.. అమిత్ షాతో భేటీ అయిన అమరీందర్ సింగ్!
-కాషాయమా? సొంత పార్టీనా ? నిర్ణయించేది అమిత్ షా , అమలు జరిపేది అమరిందర్
-అమిత్ షా నివాసానికి వెళ్లిన అమరీందర్ సింగ్
-బీజేపీలో అమరీందర్ చేరబోతున్నారంటూ ప్రచారం
-కాంగ్రెస్ లోనే ఉంటానని నిన్న చెప్పిన అమరీందర్

పంజాబ్ రాజకీయాల్లో సరికొత్త మార్పులు జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. సాయంత్రం 6 గంటలకు అమిత్ నివాసానికి ఆయన వెళ్లారు. బీజేపీలో అమరీందర్ సింగ్ చేరబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతున్న తరుణంలో వీరి భేటీ అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే అమరిందర్ బీజేపీ లో చేరతారా ? లేక సొంత పార్టీ పెడతారా ? అనేది అమిత్ షా ఇచ్చే సలహాపై ఆధారపడి ఉంటుందని రాజకీయవర్గాలు భావిస్తున్నాయి.

కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశాల మేరకు ఇటీవలే సీఎం పదవికి అమరీందర్ సింగ్ రాజీనామా చేశారు. నిన్న ఢిల్లీకి వెళ్లబోయే ముందు అమరీందర్ సింగ్ మాట్లాడుతూ…. తన ఢిల్లీ పర్యటన రాజకీయ నేతలను కలిసేందుకు కాదని చెప్పారు. పంజాబ్ కొత్త సీఎం కోసం అధికార నివాసమైన కపుర్తలా హౌస్ ను ఖాళీ చేసేందుకే ఢిల్లీకి వెళ్తున్నానని అన్నారు. కాంగ్రెస్ పార్టీని వీడబోనని చెప్పారు. అయితే తన మాటలకు విరుద్ధంగా అమిత్ షాను అమరీందర్ కలవడం చర్చనీయాంశంగా మారింది.

Related posts

ఉష్… హుజురాబాద్ ఎన్నికపై బహిరంగ ప్రకటనలు వద్దు …రేణుకా చౌదరి!

Drukpadam

ఈటల ఎమ్మెల్యే పదవికి నేడే రాజీనామా -14 న బీజేపీలోకి…

Drukpadam

తెలంగాణలో కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ గా కోమటిరెడ్డి…

Drukpadam

Leave a Comment