Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

వంటగదిలో యువతి జుట్టుకు మంటలు.. గమనించకుండా పనిచేసుకుంటూ పోయిన అమ్మాయి!

వంటగదిలో యువతి జుట్టుకు మంటలు.. గమనించకుండా పనిచేసుకుంటూ పోయిన అమ్మాయి!
-వంట చేస్తూ పొరపాటున పొయ్యి ముందు కిందకు వంగిన యువతి
-జుట్టుకు మంటలు అంటుకొని పొగలు వస్తున్నా గుర్తించని వైనం
-గమనించిన వెంటనే మంటలార్పేసి బయటకు పరుగులు

వంటగదిలో పెద్ద ప్రమాదాలే అక్కర్లేదు, ఒక్కోసారి చిన్న పని చేయడం కూడా ప్రాణాల మీదకు తెస్తుంది. అందుకు ఈ సంఘటనే ఉదాహరణ. ఎక్కడ జరిగిందో తెలియని ఈ ఘటన సెప్టెంబరు 16న జరిగినట్లు తెలుస్తోంది.

ఒక యువతి వంట గదిలో పని చేస్తోంది. ఏదో వంట చేయడం కోసం కింద ఉన్న ప్లేటు తీసుకోవడానికి వంగింది. అప్పుడే వెలుగుతున్న పొయ్యి వల్ల ఆమె తల అంటుకుంది. ఆమె జుట్టులో నుంచి పొగలు రావడం ప్రారంభమైంది. ఆ మహిళ మాత్రం ఇది గమనించలేదు.

కింద పడిన వస్తువుల కోసం మరోసారి కిందకు వంగింది. అప్పటికి ఆమె తలపై నెమ్మదిగా మంటలు రేగడంతో ఆ వస్తువులు కూడా తీసుకుంది. అప్పుడే కొన్ని వస్తువులు కిందపడడంతో వాటిని తీసుకొనేందుకు మరోసారి కిందకు వంగింది. అప్పటికీ మంటను గమనించకుండా కిచెన్‌ అంతా తిరుగుతూ తన పని చేసుకుంటూ పోయింది.

ఇలా సుమారు 45 సెకన్లపాటు వంటగదిలో తిరిగిన తర్వాత తలపై ఏదో వేడిగా అనిపించడంతో ఆమె చూసుకుంది. అప్పుడుగానీ తన తలకు మంటలు అంటిన విషయం ఆమెకు తెలియలేదు. దీంతో వెంటనే మంటలార్పేసిన ఆమె భయంతో వంటగది నుంచి బయటకు పరుగులు తీసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ప్రశాంత్‌ సాహూ అనే వ్యక్తి ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. ఇది ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది.

Related posts

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్

Ram Narayana

శ్రీవారి లడ్డూ వివాదంపై చంద్రబాబు సీరియస్ వ్యాఖ్యలు!

Ram Narayana

చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై ప్రస్తావనను రేపటికి వాయిదా వేసిన సుప్రీంకోర్టు

Ram Narayana

Leave a Comment