ఏపీ లో రోడ్లపై గుంతల రాజకీయాలు ….
కాటన్ బ్యారేజీపై జనసేన శ్రమదానానికి అనుమతి నిరాకరణ..
కాసేపట్లో పార్టీ నేతలతో పవన్ కల్యాణ్ కీలక భేటీ
కాటన్ బ్యారేజీపై అక్టోబరు2న జనసేన పార్టీ శ్రమదానం
అక్కడి రోడ్లపై గుంతలు పూడ్చడం ఏంటన్న జలవనరుల శాఖ
సాంకేతిక పరిజ్ఞానం లేకుండా పూడ్చితే బ్యారేజీకి నష్టమని వ్యాఖ్య
రాష్ట్ర వ్యాప్తంగా జనసేన శ్రమదానం
పవర్ లేని పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వంపై రోజుకొక రీతిలో ధ్వజమెత్తుతున్నారు. ..చివరకు ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ ,ఇతర పార్టీలు చేయని విధంగా వైసీపీ ప్రభుత్వం పై , ప్రయేకించి జగన్ పై నిత్యం విమర్శలు చేస్తూ సవాల్ విసురుతున్నారు . జగన్ ప్రతిపక్షం లో ఉండగా కూడా పలకపక్షమైన టీడీపీ ని వదిలి జగన్ పై గుడ్డి వ్యతిరేకతతో విమర్శలు గుప్పించారు. జగన్ అధికారం లోకి వచ్చిన తరువాత కూడా అదే వరవడి కొనసాగుతుంది. పవనిజం అంటే ఇదేనా అనే విధంగా అడ్డగోలు గా మాట్లాడటం , వచ్చిన అభిమానులతో చప్పట్లు కొట్టించుకోవడం ఆయనకు అలవాటుగా మారిందనే విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంపై విమర్శల పదును ఎక్కువ పెడుతున్నారు. అయితే నిర్దిష్టమైన సమస్యలపై ,ప్రభుత్వం విఫలమైన వాగ్దానాలపై విమర్శలు పెడితే ఎలాంటి తప్పులేదు. కానీ అదేపనిగా సీఎం జగన్ ను , ఆయన మంత్రి వర్గ సహచరులను టార్గెట్ చేస్తూ విమర్శలు చేయడంపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో రోడ్లపై గుంతలు పడ్డాయి. వాటిని పూడ్చటం లేదని జనసేన ఆరోపణ ప్రభుత్వం గుంతలు కూడా పూడ్చలేక పోతున్నందున వాటిని తాము శ్రమదానం ద్వారా పూడ్చుతామని జనసేన పిలుపునించింది.
కాటన్ బ్యారేజీపై అక్టోబరు2న జనసేన పార్టీ శ్రమదానం చేయాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే, అందుకు ఏపీ జల వనరుల శాఖ అనుమతి నిరాకరించింది. పవన్ కల్యాణ్ శ్రమదాన కార్యక్రమం చేపట్టాలనుకున్న కాటన్ బ్యారేజీ రోడ్ ఆర్‌అండ్‌బీ పరిధిలోకి రాదని స్పష్టం చేసింది.
కేవలం ప్రజల రాకపోకలకు మాత్రమే అనుమతి ఇస్తున్నామని ప్రకటన చేసింది. కాటన్ బ్యారేజీపై సాంకేతిక పరిజ్ఞానం లేకుండా గుంతలను పూడ్చితే బ్యారేజీకి నష్టం జరుగుతుందని జల వనరుల శాఖ తెలిపింది. అయితే, కావాలనే ఇటువంటి ప్రకటనలు చేస్తున్నారని బ్యారేజీపై రోడ్డు బాగు చేసే కార్యక్రమాన్ని జరిపి తీరుతామని జనసేన పార్టీ స్పష్టం చేసింది.
ఈ రోజు మధ్యాహ్నం జనసేన అధినేత పవన్ కల్యాణ్ తమ నేతలు, కార్యకర్తలతో మరోసారి భేటీ కానున్నారు. అక్టోబరు 2న చేపట్టాల్సిన రోడ్ల శ్రమదానం కార్యక్రమంపై ఆయన చర్చించనున్నారు. అన్ని నియోజక వర్గాల్లోనూ శ్రమదానంలో జనసైనికులు, ప్రజలు పాల్గొనేలా కార్యాచరణ రూపొందించనున్నారు. ఈ సందర్భంగా పవన్ మీడియాతో మాట్లాడతారని జనసేన స్పష్టం చేసింది.