Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

హస్తానికి ట్రబుల్ షూటర్ల కొరత …కాంగ్రెస్ లో సంక్షోభం…

హస్తానికి ట్రబుల్ షూటర్ల కొరత …కాంగ్రెస్ లో సంక్షోభం…
కాంగ్రెస్ లో కల్లోలం పంజాబ్ లో సెల్ఫ్ గోల్ …ఛత్తీస్ ఘడ్ లో రాజుకుంటున్న కుంపటి
అటు పంజాబ్ కాంగ్రెస్ రాజ‌కీయాల్లో వేడి..
ఇటు ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లోనూ మ‌ళ్లీ మొద‌టికొచ్చిన ఆ పార్టీ నేత‌ల తీరు
కాంగ్రెస్ అధిష్ఠానానికి మ‌ళ్లీ త‌ల‌నొప్పి
15 మంది ఛ‌త్తీస్‌గ‌ఢ్ ఎమ్మెల్యేలు ఢిల్లీకి
ముఖ్య‌మంత్రి మార్పుకోస‌మేన‌ని ప్ర‌చారం

ఒకపక్క చతికల పడ్డ కాంగ్రెస్ ను పైకి లేపేందుకు రాహుల్ ,ప్రియాంకలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని ప్రచారం జరుగుతున్న వేళ,కాంగ్రెస్ లో యువకులు చేరుతున్న సందర్బాల్లో పంజాబ్ కాంగ్రెస్ లో సంక్షోభం ఏర్పడింది. కాంగ్రెస్ చేసుకున్న సెల్ఫ్ గోల్ కకావికలం అవుతుంది. కాంగ్రెస్ కు రాహుల్ ,ప్రియాంకలు చేస్తున్న చికిత్స బెడిసికొడుతుంది. దీన్ని బీజేపీ తనకు అనుకూలంగా ఉపయోగించుకుంటుంది.

ఛ‌త్తీస్‌గ‌ఢ్ రాజ‌కీయాలు నెల రోజుల క్రితం ఊహించ‌ని మ‌లుపులు తిరిగిన‌ విష‌యం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ నేత‌ల్లో త‌లెత్తిన విభేదాల వ‌ల్ల ముఖ్య‌మంత్రి మార్పు జ‌రుగుతుంద‌ని నెల రోజుల క్రితం బాగా ప్ర‌చారం జ‌రిగింది. దీంతో పార్టీ అధిష్ఠానం అక్క‌డి ప‌రిస్థితుల‌ను చక్క‌దిద్దింది.

అయితే, ఈ పార్టీలో ఇప్ప‌టికీ స్థిర‌త్వం రాలేదని తెలుస్తోంది. ఆ పార్టీకి చెందిన 15 మంది ఎమ్మెల్యేలు ఢిల్లీకి చేరుకున్నారు. తాము రాహుల్ గాంధీని క‌ల‌వడానికే ఢిల్లీకి వ‌చ్చిన‌ట్లు వారు చెప్పారు. వారు ముఖ్య‌మంత్రి మార్పు గురించి ఢిల్లీకి వెళ్లిన‌ట్లు స‌మాచారం. దీంతో ఆ రాష్ట్రంలోనూ పార్టీ నేత‌ల్లో ఉన్న విభేదాలు మ‌ళ్లీ బ‌య‌ట‌ప‌డుతున్నాయి.

ప్రస్తుత ఛత్తీస్‌గఢ్‌ సీఎం భూపేశ్‌ బఘేల్‌ స్థానంలో సింగ్‌దేవ్‌ను ముఖ్యమంత్రిగా నియమించాలని కొంద‌రు ఎమ్మెల్యేలు చాలా రోజులుగా డిమాండ్ చేస్తున్నారు. మ‌రోవైపు, పంజాబ్ మాజీ ముఖ్య‌మంత్రి అమ‌రీంద‌ర్ సింగ్‌, కాంగ్రెస్ సీనియ‌ర్ నేత న‌వ‌జోత్ సిద్ధూ ఇత‌ర పార్టీల్లో చేర‌తార‌న్న ప్ర‌చారం జ‌రుగుతోంది.

పంజాబ్ లో ఇలా ఎన్నిక‌ల ముందు చోటు చేసుకుంటోన్న ఈ ప‌రిణామాలు ఆస‌క్తి రేపుతున్నాయి. ఆ రాష్ట్రంలో పార్టీని చ‌క్క‌దిద్దేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం చేస్తోన్న ప్ర‌య‌త్నాల‌న్నీ విఫ‌ల‌మ‌వుతున్నాయి. ఇప్పుడు పంజాబ్‌తో పాటు ఒకేసారి ఛ‌త్తీస్‌గ‌ఢ్ అంశం కూడా మ‌ళ్లీ మొద‌టికి రావ‌డం కాంగ్రెస్ అధిష్ఠానానికి త‌ల‌నొప్పిగా మారింది.

Related posts

దుగ్గిరాలలో వైసీపీకి లక్కీఛాన్స్ …బీసీ మహిళ కు రిజర్వ్ అయిన ఎంపీపీ!

Drukpadam

కేసీఆర్ బీఆర్ యస్ పెట్టడంలో కుట్రకోణం దాగిఉంది…పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి

Drukpadam

బీజేపీని ఓడించలేమని తేల్చేసింది: కాంగ్రెస్‌కు థ్యాంక్స్ చెప్పిన స్మృతి ఇరానీ..!

Drukpadam

Leave a Comment