Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

హుజూరాబాద్‌లో పోటీకి దిగుతున్న టీడీపీ…

హుజూరాబాద్‌లో పోటీకి దిగుతున్న టీడీపీ…
-అక్టోబరు 30న హుజూరాబాద్ ఉప ఎన్నిక
-నవంబరు 2న ఫలితాల వెల్లడి
-టీఆర్ఎస్ నుంచి గెల్లు శ్రీనివాస్, బీజేపీ నుంచి ఈటల పోటీ
-ఒకటి రెండు రోజుల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక

తెలంగాణ లో టీడీపీ దుకాణం బంద్ అని అనుకుంటున్న తరుణంలో అనూహ్యంగా హుజురాబాద్ ఎన్నికల్లో పోటీచేయాలని పార్టీ నిర్ణయించడంతో దానివెనుక ఉన్న వ్యూహం ఏమిటని పరిశీలకులకు సైతం అంతుపట్టడంలేదు. టీడీపీ తెలంగాణాలో నామ మాత్రంగానే ఉంది. ఇటీవల జరిగిన నాగార్జున సాగర్ ఉపఎన్నికల్లో పోటీచేసింది. కనీసం డిపాజిట్ కూడా రాలేదు. ఇక్కడకూడా ఎన్నివందల ఓట్లు వస్తాయనేది చూసుకోవడం తప్ప టీడీపీ కి పెద్దగా ఓట్లు లేవు . పైగా బీజేపీ ,టీఆర్ యస్ హోరాహోరీ పోరాడుతున్న తరుణంలో కాంగ్రెస్ పరిస్థితి ఏమిటనేది ఆశక్తిగా ఉన్న సమయంలో టీడీపీ అభ్యర్థిని పెడతానని ప్రకటించడం కొంత ఆశ్చర్యకరమే. టీడీపీ పోటీచేస్తామని చెప్పిన ఇంకా అభ్యర్థి ఎవరు అనేది ప్రకటించలేదు. అదే విధంగా కాంగ్రెస్ కూడా అభ్యర్థి విషయంలో ఇప్పటివరకు ఒక నిర్ణయానికి రిలేకపోయింది.అయితే నలుగురు పేర్లతో అధిష్టానానికి ఒక లిస్ట్ పంపింది. అందులో ఒకపేరు ప్రకటిస్తారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి .

హుజూరాబాద్‌ ఉపఎన్నికలో లో పోటీ చేసేందుకు తెలుగుదేశం పార్టీ సమాయత్తమవుతోంది. హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీడీపీ బరిలోకి దిగుతుందని ఆ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ అంబటి జోజిరెడ్డి తెలిపారు.

నిన్న హుజూరాబాద్‌లో విలేకరులతో మాట్లాడిన ఆయన ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఇక్కడి నుంచి బరిలోకి దిగే అభ్యర్థిని పార్టీ అధినేత చంద్రబాబునాయుడు త్వరలోనే ప్రకటిస్తారని తెలిపారు. టీఆర్ఎస్, బీజేపీలను ఓడించి టీడీపీకి పట్టం కట్టాలని అభ్యర్థించారు.

కాగా, అక్టోబరు 30న హుజూరాబాద్ ఉప ఎన్నిక జరగనుంది. రేపు నోటిఫికేషన్ విడుదల కానుండగా, నామినేషన్ల దాఖలకు అక్టోబరు 8 చివరి తేదీ. 11న నామినేషన్ల పరిశీలన, 13న ఉపసంహరణ ఉంటుంది. నవంబరు 2న ఫలితం వెల్లడి కానుంది. టీఆర్ఎస్ నుంచి గెల్లు శ్రీనివాస్, బీజేపీ నుంచి ఈటల బరిలో ఉండగా, కాంగ్రెస్ ఒకటి రెండు రోజుల్లో అభ్యర్థిని ప్రకటించనుంది.

Related posts

రాహుల్ గాంధీ ఈడీ విచారణపై దేశవ్యాపితంగా కాంగ్రెస్ నిరసనలు …

Drukpadam

బీజేపీపై ఎంఐఎం నేత ఎంపీ అసదుద్దీన్ ఒవైసి తీవ్ర విమర్శలు …

Drukpadam

మరోసారి టీటీడీ ఛైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డి

Drukpadam

Leave a Comment