Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

నీటి ప్రాజక్టు ల విషయంలో తెలంగాణ అబద్ధాలు చెబుతోందన్న ఏపీ!

నీటి ప్రాజక్టు ల విషయంలో తెలంగాణ అబద్ధాలు చెబుతోందన్న ఏపీ!
-డీపీఆర్‌లను ఆమోదించొద్దు: గోదావరి బోర్డు, కేంద్రానికి లేఖ
-తెలంగాణ సమర్పించిన డీపీఆర్‌లో అవాస్తవాలు ఉన్నాయని ఆరోపణ
-కొత్త ట్రైబ్యునల్ అవార్డు ఇచ్చే వరకు వాటిని పక్కనపెట్టండి
-పునర్విభజన చట్టానికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రాజెక్టులు

తెలంగాణ ప్రభుత్వం సమర్పించిన డీపీఆర్‌లో అన్నీ అబద్ధాలే ఉన్నాయని, వాటిని ఆమోదించవద్దంటూ గోదావరి బోర్డు, కేంద్ర జల్‌శక్తి శాఖకు ఏపీ ప్రభుత్వం లేఖ రాసింది. గోదావరి నీటిపై కేటాయింపులకు సంబంధించి తెలంగాణ చెబుతున్నది వాస్తవం కాదని పేర్కొన్న ఏపీ.. నీటి లభ్యతపై అంచనా వేసి, రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపిణీపై ఒప్పందం చేసుకోవాలని, లేదంటే కొత్త ట్రైబ్యునల్ అవార్డు ఇచ్చే వరకు తెలంగాణ డీపీఆర్‌లను పక్కనపెట్టాలని ఆ లేఖలో కోరింది.

సీతారామ, తుపాకులగూడెం సహా అయిదు ప్రాజెక్టుల డీపీఆర్‌ల ఆమోదం కోసం గోదావరి బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం డీపీఆర్‌లు సమర్పించిన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఈ లేఖ రాయడం ప్రాధాన్యం సంతరించుకుంది. గోదావరి జల వివాద ట్రైబ్యునల్, ఏపీ పునర్విభజన చట్టానికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టి నీటిని మళ్లిస్తోందని ఆరోపించింది.

ఈ ప్రాజెక్టుల వల్ల దిగువన ఉన్న పోలవరం ప్రాజెక్టులోకి ప్రవాహం తగ్గిపోతోందని ఆందోళన వ్యక్తం చేస్తూ ఏపీ జలవనరుల శాఖ కార్యదర్శి శ్యామలరావు నిన్న గోదావరి బోర్డు చైర్మన్‌కు, కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శికి లేఖలు రాశారు.

తెలంగాణ ,ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోవడం కేంద్రం దగ్గరకు వెళ్లడం , అమిత్ షా గజేంద్ర సింగ్ షాకవత్ ను కలవడం పుష్ప గుచ్చం ఇచ్చి శాలువాలు కప్పి ఫిర్యాదు లు చేసుకొని రావడం మాములుగా మారింది. కేంద్రం కూడా ఇరు రాష్ట్రాల చర్యలను చూస్తుంది. నీళ్ల విషయం నిరంతరాయం కొనసాగేది . దీన్ని సాగదీస్తే జాతి సంపదకు నష్టం అనేది కూడా చూడటం లేదు . పరిష్కరిస్తాం , చూస్తాం చేస్తాం అనే ధోరణిపై రెండు రాష్ట్ర ప్రభుత్వాలు అసహనంగా ఉన్నాయి.

Related posts

ప్రభుత్వ ఎస్సీ వ్యతిరేక చర్యలకు డాక్టర్ సుధాకర్ బలయ్యారు: చంద్రబాబు…

Drukpadam

పొంగులేటి దూకుడు …ఆయన కదలికలపై రాజకీయ పక్షాల ఆరా …!

Drukpadam

కేంద్రం వడ్లు కొనాల్సిందే …ఖమ్మం వీధుల్లో ఎడ్లబండ్లపై మంత్రి పువ్వాడ ప్రదర్శన!

Drukpadam

Leave a Comment