Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలురాజకీయ వార్తలు

పంజాబ్ కాంగ్రెస్ పరిణామాలపై కపిల్ సిబాల్ వ్యాఖ్యలు …ఆయన ఇంటిపై యువజన కాంగ్రెస్ కార్యకర్తల టమాటాలు దాడి…

పంజాబ్ కాంగ్రెస్ పరిణామాలపై కపిల్ సిబాల్ వ్యాఖ్యలు …ఆయన ఇంటిపై యువజన కాంగ్రెస్ కార్యకర్తల టమాటాలు దాడి…
-పార్టీ పరువు పోతుందని ఆనంద్ శర్మ మండిపాటు

-కపిల్ సిబల్ ఇంటి ముందు గూండాగిరి.. 
-పంజాబ్ లో పరిణామాలపై సిబల్ విమర్శలు-అధ్యక్షులే లేరంటూ కామెంట్లు
-సిబల్ ఇంటిపై టమాటాలు విసిరిన పార్టీ కార్యకర్తలు
-భావస్వేచ్ఛను కాపాడడంలో కాంగ్రెస్ ది ఘన చరిత్ర అన్న ఆనంద్ శర్మ
-బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సోనియాకు విజ్ఞప్తి

కాంగ్రెస్ లో అసమ్మతి వదులుగా ముద్రపడిన గ్రూప్ ఆఫ్ 23 సభ్యులలో కొందరు ఇప్పటికే పార్టీ చర్యలను సమర్థిస్తుండగా ,మరికొందరు ఇంకా పార్టీని దుమ్మెత్తి పోస్తూనే ఉన్నారు.ఏ చిన్న విషయం దొరికిన దాన్ని గోరంతలు కొండంతలు చేసి పార్టీ పై బురద జల్లుతున్నారని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ప్రధానంగా కపిల్ సిబాల్ అనేక సందర్భాలలో కాంగ్రెస్ పార్టీ విధానాలపై విరుచుకుపడుతున్నారు. పంజాబ్ విషయంలో కూడా సిబాల్ వ్యాఖ్యలు పార్టీని ఇబ్బంది పెట్టె విధంగా ఉన్నాయి. దీంతో రెచ్చిపోయిన యువజన కాంగ్రెస్ కార్యకర్తలు సిబాల్ ఇంటిపై టమాటాలతో దాడి చేశారు. దీనిపై పార్టీ సీనీర్ నేత గ్రూప్ 23 లో సభ్యుడు ఆనందశర్మ మండిపడ్డారు . కాంగ్రెస్ పరువు పోతుందని ధ్వజమెత్తారు .

కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ ఇంటి ముందు యువజన కాంగ్రెస్ కార్యకర్తల దాడిపై ఆ పార్టీ మరో సీనియర్ నేత ఆనంద్ శర్మ మండిపడ్డారు. పంజాబ్ కాంగ్రెస్ లో పరిణామాలపై కపిల్ సిబల్ తీవ్ర అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ అధిష్ఠానంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పార్టీకి ప్రెసిడెంట్ లేరని, అసలు నిర్ణయాలు ఎవరు తీసుకుంటున్నారో తెలిసే పరిస్థితీ లేదని ఆయన విమర్శించారు.

దీనిపై యువజన కాంగ్రెస్ కార్యకర్తలు ఢిల్లీలోని చాందినీ చౌక్ లో ఉన్న సిబల్ ఇంటిపై దాడి చేశారు. సిబల్ ఇంటి మీదకు టమాటాలు విసిరారు. అంతేగాకుండా సిబల్ త్వరగా కోలుకోవాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ ఘటనపై తాజాగా ఆనంద్ శర్మ ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు.

కపిల్ సిబల్ ఇంటి ముందు దాడి, గూండాగిరి షాక్ కు గురి చేసిందని ఆయన విమర్శించారు. ఇలాంటి దిగజారుడు చర్యల వల్ల పార్టీ పరువు పోతుందని, వీటిని ఖండించాల్సిన అవసరముందని అన్నారు. భావస్వేచ్ఛ హక్కును కాపాడడంలో కాంగ్రెస్ కు ఘనమైన చరిత్ర ఉందని, విభిన్న అభిప్రాయాలు ప్రజాస్వామ్యంలో అంతర్గత భాగమని చెప్పుకొచ్చారు. అసహనం, హింస కాంగ్రెస్ విలువలు, సంస్కృతికి చీడ అని అన్నారు. దాడికి కారకులైనవారిపై కఠినంగా చర్యలు తీసుకోవాల్సిందిగా సోనియా గాంధీకి విజ్ఞప్తి చేశారు.

Related posts

పీసీసీ చీఫ్ రేవంత్ పై టీఆర్ యస్ నేతల భగ్గుభగ్గు…

Drukpadam

వరంగల్ కేఎంసీలో ర్యాగింగ్ కలకలం.. మోదీ, షా, కేటీఆర్, డీజీపీకి విద్యార్థి ఫిర్యాదు!

Drukpadam

మహారాష్ట్రలో నిట్టనిలువునా చీలిన ఎన్సీపీ … బీజేపీ వ్యూహం సక్సెస్..!

Drukpadam

Leave a Comment