Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

పరిమితికి మించి ఎన్నికల్లో ఖర్చు చేశాడని దేశాధ్యక్షుడికి శిక్ష !

ఫ్రాన్స్ లో పరిమితికి మించి ఎన్నికల వ్యయం కేసు.. మాజీ అధ్యక్షుడు సర్కోజీకి జైలు శిక్ష
–2012 ఎన్నికల్లో ప్రచారం కోసం పరిమితికి మించి ఖర్చు చేసిన సర్కోజీ
–ఏడాది పాటు ఇంటి వద్దే శిక్ష అనుభవించేందుకు కోర్టు సమ్మతి
–కదలికలు తెలిపే ఎలక్ట్రానిక్ మానిటరింగ్ పరికరాన్ని ధరించాలని ఆదేశం

ఎన్నికల్లో పరిమితికి మించి వ్యయం చేస్తున్న సందర్భాలు అనేకం మనం చూస్తున్నాం … ఎన్నికల సంఘం విధించిన పరిమితి చిన్న చిన్న పార్టీ లు తప్ప ఎవరు పాటించడంలేదు అనేది అందరికి తెలిసిన విషయమే … అసెంబ్లీ కి 28 లక్షలు , లోకసభకు 70 లక్షల కు మించి ఖర్చు చేయరాదనేది కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనలు విధించింది. ఒకవేళ అంతకు మించి ఖర్చు చేస్తే శిక్షార్హులు అవుతారు. కాని అన్ని ప్రధాన రాజకీయపార్టీలు కోట్లల్లో నిధులు ఖర్చు చేస్తున్నాయి. అయిన పట్టించుకున్న దాఖలాలు లేవు అనే విమర్శలు ఉన్నాయి. మనదగ్గర నిబంధనలు నిబంధనలే ఖర్చు ఖర్చే .. కాని ఫ్రాన్స్ దేశంలో దేశ అధ్యక్షుడుగా ఉన్న సర్కోజీ 2012 లో జరిగిన ఎన్నికల్లో పరిమితికి మించి ఖర్చు చేశారనే అభియోగాలు ఉన్నాయి. అందుకు గాను ఆయన ఏడాది పాటు గృహనిర్బంధంలో ఉండాలని కోర్ట్ తీర్పునించింది. ఆయన కదలికల కోసం ఒక ఎలక్ట్రానిక్ డివైస్ ని అమర్చుతారు . అయితే ఆయన కింది కోర్ట్ తీర్పు పై ,పై కోర్ట్ కు వెళ్లే అవకాశం ఇచ్చారు. .

ఎన్నికల్లో పరిమితికి మించి ఖర్చు చేసిన కేసులో ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు నికోలస్ సర్కోజీ (66)కి న్యాయస్థానం ఏడాదిపాటు జైలు శిక్ష విధించింది. 2007 నుంచి 2012 వరకు సర్కోజీ ఫ్రాన్స్ అధ్యక్షుడిగా ఉన్నారు. 2012లో జరిగిన ఎన్నికల్లో ప్రచారం కోసం పరిమితికి మించి ఖర్చు చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ ఖర్చంతా ఆయన కనుసన్నల్లోనే జరిగినట్టు ప్రాసిక్యూషన్ నిరూపించింది.

ఇక ఈ కేసులో ఆయనను దోషిగా తేల్చిన న్యాయస్థానం ఏడాదిపాటు శిక్ష విధించింది. అయితే, ఇంటి వద్దే ఉండి శిక్షను అనుభవించేందుకు అనుమతించిన కోర్టు, శిక్షాకాలంలో ఆయన కదలికలను తెలిపే ఎలక్ట్రానిక్ మానిటరింగ్ పరికరాన్ని ధరించాలని తీర్పులో పేర్కొంది. అయితే, ఈ శిక్షపై పైకోర్టుకు వెళ్లేందుకు న్యాయస్థానం సర్కోజీకి అవకాశం ఇచ్చింది. కాగా, అవినీతికి సంబంధించిన మరో కేసులో దోషిగా తేలిన సర్కోజీకి మార్చిలో ఏడాదిపాటు జైలు శిక్ష విధించినప్పటికీ, రెండేళ్లపాటు అమలు కాకుండా నిలిపివేసింది.

Related posts

Drukpadam

ఖమ్మం లో మంకీ ఫాక్స్ కలకలం…?

Drukpadam

హర్యానాలో అమానుషం.. యువతిపై 25 మంది అత్యాచారం

Drukpadam

Leave a Comment