Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రి వైద్య సేవలకు జాతీయ స్థాయి గుర్తింపు

ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రి వైద్య సేవలకు జాతీయ స్థాయి గుర్తింపు
-ఉత్తమ పనితీరులో దేశంలోనే రెండవ స్తానం
-నీతి ఆయోగ్ నివేదికలో ప్రసంశలు
-జిల్లా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హర్షం

ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి జాతీయాస్టయిలో ఉత్తమ సేవలు అందిస్తూ మంచి గుర్తింపు పొందింది . ఈ ఆసుపత్రికి ఉత్తమ సేవలు అందించినందుకు గాను వరసగా అవార్డు లు వస్తూనే ఉన్నాయి. ఈసారి గతంలో కన్నా ఎక్కువగా నీతిఆయోగ్ నివేదికలో దేశంలోనే అత్యధిక పాయింట్లు పొంది రెండవ ఉత్త సేవలు అందించే ఆసుపత్రిగా నిలిచింది. ఇక్కడ సేవలు చాల బాగున్నాయని , డయాగ్నసిస్ కూడా అన్ని ఆసుపత్రులకన్నా బాగాఉందనే నివేదికలో పొందుపరిచారు. దీంతో ఖమ్మం ఆసుపత్రి జాతీయస్థాయిలో గుర్తింపు పొందినందుకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.

ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి వైద్య సేవలకు జాతీయ స్థాయి గుర్తింపు రావడం పట్ల రాష్ట్ర రవాణాశాఖ మంత్రి శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆస్పత్రి వైద్యులను, సిబ్బందిని మంత్రి పువ్వాడ అభినందించారు.

దేశంలోని జిల్లా ఆస్పత్రుల పురోగతిపై కేంద్ర ఆరోగ్య శాఖ, ప్రపంచ ఆరోగ్య సంస్థ భాగస్వామ్యంతో నీతి ఆయోగ్‌ రూపొందించిన నివేదికను నీతి ఆయోగ్‌ సీఈవో అమితాబ్‌ కాంత్‌ విడుదల చేశారు. ఈ నివేదికలో ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో అందుతున్న వైద్య సేవలకు ర్యాంకింగ్ ఇచ్చారు. మధ్యస్థాయి ఆస్పత్రుల విభాగంలో 65.42 శాతంతో ఖమ్మం జిల్లా ఆస్పతి దేశంలోనే మూడో స్థానంలో నిలిచింది. అదేవిధంగా డయాగ్నస్టిక్‌ సేవల్లో రాష్ట్రంలో ఒక్కో ఆస్పత్రిలో సగటున 14 రకాల కోర్‌ హెల్త్‌కేర్‌ సేవలు, డయాగ్నస్టిక్‌ సేవలు ఉన్నాయి. డయాగ్నస్టిక్‌ సేవల్లో చిన్న ఆస్పత్రుల విభాగంలో దేశంలోనే ఉత్తమ పనితీరు కనబరుస్తూ ఖమ్మం జిల్లా ఆస్పత్రి రెండో స్థానంలో ఉంది. ఈ ఆస్పత్రిలో డయాగ్నసి్‌సకు అవసరమైన అన్ని సేవలు ఉన్నాయని నీతి ఆయోగ్‌ స్పష్టం చేసింది.

Related posts

ఏపీలో అక్రమాలపై గళమెత్తినందుకు నా కుటుంబాన్ని హింసిస్తున్నారు.. రాష్ట్రపతి, ప్రధాని, హైకోర్టు సీజేలకు ప్రవాసాంధ్రుడి లేఖ…

Drukpadam

ఆర్థిక అసమానతలు ఎక్కువగా వున్న దేశాల్లో భారత్ .. ఒక్క శాతం జనం చేతిలో 22 శాతం జాతీయ ఆదాయం!

Drukpadam

548 కిలోల బరువు ఎత్తిన స్ట్రాంగెస్ట్‌ మ్యాన్‌.. 

Drukpadam

Leave a Comment