Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

మంత్రులను కాదని సీఎం జోక్యం చేసుకోవడమేంటో!: సీతక్క

మంత్రులను కాదని ముఖ్యమంత్రి జోక్యం చేసుకోవడం ఏమిటో : కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క!
-ప్రతిపక్షాల గొంతు నొక్కడమే స్పీకర్ పనా
-గ్రామపంచాయతీలకు ఇచ్చే నిధుల్లో కేంద్రం ,రాష్ట్రాల వాటాలు ఎంతెంత ?
-గోదావరి నది పరివాహక ప్రాంతంలో ఇసుక ద్వారా వచ్చే ఆదాయం ఎంత ?
-ఉపాధి హామీ నిధులు పక్కదార్లు పడుతున్నాయా లేదా ?
-ఉపాధి హామీ నిధుల గురించి అడిగితె సబెక్టు కాదంటారా ?
-ప్రశ్నించే వాళ్లకు మైక్ కట్ … డబ్బా కొట్టే వాళ్లకు గంటల కొద్దీ అవకాశం

ఈ రోజు శాసనసభలో కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క కు స్పీకర్ కు మధ్య వాగ్వివాదం జరిగింది. సీతక్క గ్రామపంచాతిలకు ఇచ్చే నిధుల్లో కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాల వాటాల్లో ఎవరిదీ ఎంత ? తేల్చాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ నిధుల గురించే ఆమె ప్రశ్నిస్తే అది సబ్జెక్టు కాదంటూ మైక్ కట్ చేయడంపై ఆమె మండి పడ్డారు. దీనిపై స్పెకర్ తో ఆమె వాగ్వివాదానికి దిగారు . చివరికి సీఎం జ్యోక్యం చేసుకోవాల్సి వచ్చింది . సీఎం జ్యోక్యం పై కూడా సీతక్క అభ్యంతరం వ్యక్తం చేశారు. సీతక్క మాటలపై సీఎం జ్యోక్యం చేసుకోవడాన్ని ఆమె మైక్ కట్ చేయడాన్ని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తప్పవు పట్టారు .

రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా చెప్పుకునే గ్రామ స్వరాజ్యం నిధుల్లో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల నిధుల వాటా ఎంతని ప్రశ్నిస్తే మైక్ కట్ చేశారని ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాల గొంతు నొక్కడం వల్ల అధికార పార్టీ సభ్యులకు ఏం ఆనందం కలుగుతుందో అర్థం కావడం లేదన్నారు. ‘‘గ్రామ పంచాయతీలకు నిధులు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని చెబుతోంది. మరో వైపు మేమే ఇస్తున్నామని కేంద్రం అంటోంది. రాష్ట్రం, కేంద్రం నిధులు ఎంతో ప్రభుత్వం స్పష్టం చేయాలి. గోదావరి నదీ పరీవాహక ప్రాంతంలో ఇసుక ద్వారా వచ్చే ఆదాయం ఎంత? కేంద్రం నుంచి వచ్చే ఉపాధి హామీ నిధులను పక్కదారి పట్టిస్తున్నారని ప్రశ్నిస్తే సబ్జెక్ట్‌ కాదంటున్నారు. మంత్రులను కాదని ముఖ్యమంత్రి జోక్యం చేసుకోవడం ఏంటో అర్థం కావడం లేదు. ప్రజా సమస్యలపై మాట్లాడితే మైక్ కట్ చేస్తున్నారు. డబ్బా కొడుతుంటే మాత్రం స్పీకర్ గంటల కొద్దీ సమయం ఇస్తున్నారు. సభ్యుల హక్కులు, సభా సంప్రదాయాలను సీఎం గౌరవించాలి. ప్రతిపక్షాల ఆరోపణలను నివృత్తి చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంటుంది. అసెంబ్లీలో ముఖ్యమంత్రి మాట్లాడిన అంశాలను సర్పంచ్‌లు విశ్లేషించుకోవాలి’’ అని సీతక్క అన్నారు.

Related posts

రేపే ఢిల్లీలో దీదీ నేతృత్వంలో కీలక సమావేశం… సీపీఎం దూరం..

Drukpadam

తనకు 69 ఏళ్లు వచ్చాయి.. ముసలోడిని అవుతున్నా: కేసీఆర్

Drukpadam

పశ్చిమ బెంగాల్ బీజేపీలో లుకలుకలు..

Drukpadam

Leave a Comment