Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

పంజాబ్ రాజకీయాల్లో సరికొత్త ట్విస్ట్.. కొత్త పార్టీని ఏర్పాటు చేస్తున్న అమరీందర్ సింగ్!

పంజాబ్ రాజకీయాల్లో సరికొత్త ట్విస్ట్.. కొత్త పార్టీని ఏర్పాటు చేస్తున్న అమరీందర్ సింగ్!
-బీజేపీలో చేరను, కాంగ్రెస్ లో ఉండనని నిన్ననే ప్రకటించిన అమరీందర్ సింగ్
-15 రోజుల్లో కొత్త పార్టీని ప్రకటిస్తారన్న సన్నిహితులు
-పలువురు ఎమ్మెల్యేలు అమరీందర్ పార్టీలో చేరే అవకాశం

పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి క్యాప్టిన్ అమరిందర్ సింగ్ కొత్త పార్టీ పెట్టబోతున్నారు . ఇప్పటికే ఆయన దీనిపై కసరత్తు పూర్తీ చేసినట్లు తెలుస్తుంది. 52 సంవత్సరాలు కాంగ్రెస్ రాజకీయాల్లో ఉన్న అమరిందర్ పంజాబ్ లో కాంగ్రెస్ పార్టీని నిలబెట్టడంలో అధికారంలోకి తీసుకోని రావడంలో కీలక భూమిక పోషించారు. కాంగ్రెస్ నేత పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్దు ,క్యాప్టియన్ అమరిందర్ సింగ్ మధ్య నెలకొన్న విభేదాలే కాంగ్రెస్ లోని కల్లోలానికి కారణమైయ్యాయి. చివరకు అమరిందర్ అవమాన కరంగా సీఎం గా రాజీనామా చేయడంతో పంజాబ్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి.

నిన్ననే బీజేపీ అగ్రనేత కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ను కలిసిన అనంతరం బీజేపీలో చేరను, కాంగ్రెస్ పార్టీలో ఉండబోనంటూ పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ సింగ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన తదుపరి కార్యాచరణ ఏమిటనే విషయంపై పెద్ద చర్చ జరుగుతోంది. మరోవైపు ఆయన సొంతంగా కొత్త పార్టీని ఏర్పాటు చేయబోతున్నారని ఆయన సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది. మరో 15 రోజుల్లో కొత్త పార్టీని అమరీందర్ ప్రకటిస్తారని తెలుస్తోంది.

పార్టీ ఏర్పాటుపై ఇప్పటికే ఆయన పలువురు ఎమ్మెల్యేలు, రైతు నేతలతో చర్చలు జరిపారు. పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నేతలు అమరీందర్ తో టచ్ లో ఉన్నారని… ఆయన పార్టీని నెలకొల్పిన వెంటనే వారంతా ఆ పార్టీలో చేరుతారని చెపుతున్నారు. వచ్చే ఏడాది పంజాబ్ అసెంబ్లీకి జరగబోయే ఎన్నికల్లో పోటీ చేయాలని అమరీందర్ భావిస్తున్నారు.

మరోపక్క, ఇప్పటికే పంజాబ్ ఎన్నికలకు సంబంధించి రాజకీయ పార్టీల మధ్య పోటీ ఎక్కువగా ఉంది. కాంగ్రెస్, బీజేపీలకు దీటుగా ఆప్ కూడా సమరనాదం చేస్తోంది. ఈ క్రమంలో అమరీందర్ పార్టీని నెలకొల్పితే పంజాబ్ రాజకీయం మరింత రసవత్తరంగా మారుతుందని విశ్లేషకులు చెపుతున్నారు.

Related posts

ప్రతి నిమిషం విలువైనదే… ఉక్రెయిన్ నుంచి విద్యార్థుల తరలింపునకు నిర్దిష్ట ప్రణాళిక ఉండాలి: రాహుల్ గాంధీ!

Drukpadam

మాది ప్రజాబలం…లక్షమందితో కొత్తగూడెం సభ …ఖమ్మం మీడియా సమావేశంలో కూనంనేని …

Drukpadam

మోడీ విషసర్పం అన్న ఖర్గే …? భగ్గుమన్న బీజేపీ

Drukpadam

Leave a Comment