Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

అవును… మేం విడిపోతున్నాం: సమంత, నాగచైతన్య….

వీడిపోతున్న సమంత నాగచైతన్య …ఒకే ప్రకటనను పంచుకున్నఇద్దరు
-అవును… మేం విడిపోతున్నాం: సమంత
-వైవాహిక బంధానికి ముగింపు పలికిన నాగచైతన్య, సమంత
-ఇద్దరూ ఒకే ప్రకటనను పంచుకున్న వైనం
-ఇక ఎవరి దారులు వారివేనంటూ ప్రకటన
-తమ పరిస్థితిని అర్థం చేసుకోవాలన్న సమంత

నిప్పులేనిదే పొగరాదు అనే సామెత నిజం చేస్తూ ఇన్నిరోజులుగా సమంత ,నాగచైతన్య వైవాహిక జీవితం పై రకరకాలుగా పుకార్లు షికార్లు చేశాయి. అవి పుకార్ల నిజాల అనేదానిపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఇవి పుకారులు కావు నిజమే అని సమంత ,నాగచైతన్యలు ప్రకటించారు. ఒకేరోజు ఒకే ప్రకటనను ఇద్దరు పంచుకోవడం విశేషం . తాము వీరిపోతున్నామని తమ పరిస్థితిని అభిమానులు అర్థం చేసుకొని సహకరించాలని కోరారు

టాలీవుడ్ జోడీ సమంతా, నాగచైతన్య తమ వైవాహిక జీవితానికి స్వస్తి పలికారు. ఇప్పటికే ఈ అంశాన్ని నాగచైతన్య సోషల్ మీడియాలో వెల్లడించగా, సమంత కూడా అదే ప్రకటనను పోస్టు చేశారు. తమ నిర్ణయాన్ని అందరూ గౌరవిస్తారని ఆశిస్తున్నామని సమంత పేర్కొన్నారు.

“అవును… మేం విడిపోతున్నాం. మా దారుల్లో మేం పయనించాలని నిర్ణయించుకున్నాం. ఇది ఎంతో ఆలోచించి తీసుకున్న నిర్ణయం. మా దారులు వేరైనా మా మధ్య ఎప్పటికీ ప్రత్యేకమైన బంధం ఉంటుందని నమ్ముతున్నాం. అభిమానులు, సన్నిహితులు, పాత్రికేయులు మా పరిస్థితిని అర్థం చేసుకుంటారని భావిస్తున్నాం. అందరికీ కృతజ్ఞతలు” అంటూ సమంత ఇన్ స్టాగ్రామ్ లో వివరించారు.

సమంతతో వైవాహిక బంధాన్ని ముగిస్తున్నా: నాగచైతన్య అధికారిక ప్రకటన
సమంత, తాను విడిపోతున్నామన్న నాగచైతన్య
భార్యాభర్తలుగా ఇక కొనసాగలేమని వెల్లడి
అభిమానులు మద్దతుగా నిలవాలని విజ్ఞప్తి
సోషల్ మీడియాలో ప్రకటన

టాలీవుడ్ లో అందమైన జోడీగా పేరుపొందిన నాగచైతన్య, సమంతలు విడిపోతున్నారంటూ గత కొన్నాళ్లుగా తీవ్రస్థాయిలో ప్రచారం జరిగింది. ఇప్పుడదే నిజమైంది. సమంతతో తన వైవాహిక బంధాన్ని ముగిస్తున్నానని నాగచైతన్య అధికారికంగా ప్రకటించారు. సామ్ తో విడిపోతున్నానని సోషల్ మీడియాలో ఓ ప్రకటన చేశారు.

చాలా చర్చలు, ఆలోచనల తర్వాత భార్యాభర్తలుగా కొనసాగలేమన్న నిర్ణయానికి వచ్చామని వెల్లడించారు. దశాబ్దకాలానికి పైగా స్నేహబంధాన్ని కలిగివుండడం అదృష్టంగా భావిస్తామని, తమ అనుబంధానికి అదే ప్రాతిపదిక అని నాగచైతన్య వివరించారు. ఈ కష్టకాలంలో అభిమానులు, శ్రేయోభిలాషులు, మీడియా మిత్రులు తమకు మద్దతుగా నిలవాలని, తమ ఏకాంతాన్ని గౌరవించాలని విజ్ఞప్తి చేశారు. మీ తోడ్పాటుకు ధన్యవాదాలు అంటూ తన ప్రకటనలో పేర్కొన్నారు.

‘ఏ మాయ చేసావే’ చిత్రంలో తొలిసారి కలిసి నటించిన నాగచైతన్య, సమంత ప్రేమలో పడ్డారు. 2017లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. గోవాలో క్రిస్టియన్, హిందూ పద్ధతుల్లో వీరు రెండుసార్లు పెళ్లి చేసుకున్నారు. గత కొన్నినెలలుగా చై, సామ్ వేర్వేరుగా ఉంటున్నారని, వీరి కాపురం సజావుగా సాగడంలేదని కథనాలు వచ్చాయి. అనేక సందర్భాల్లో వీరు జంటగా కనిపించకపోవడం కూడా ఆ కథనాలకు బలం చేకూర్చింది. ఇటీవల సోషల్ మీడియాలో తన పేరు చివర అక్కినేని ఇంటిపేరును సమంత తొలగించడం తెలిసిందే.

 

Related posts

సహాయం కోసం కేటీఆర్ కు కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ ట్వీట్

Drukpadam

30 ఏళ్ల క్రితం ఎంబీబీఎస్‌ను వదిలేశాడు.. ఇప్పుడు మళ్లీ చదువుతాడట!

Drukpadam

పరమ శివుడు గరళం మింగినట్టుగా మోదీజీ ఆ బాధను దిగమింగారు.. షా

Drukpadam

Leave a Comment