Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

హుజూరాబాద్ ఉపఎన్నిక.. టీఆర్ఎస్ స్టార్ క్యాంపెయినర్లు వీరే!

హుజూరాబాద్ ఉపఎన్నిక.. టీఆర్ఎస్ స్టార్ క్యాంపెయినర్లు వీరే!
20 మందితో టీఆర్ఎస్ స్టార్ క్యాంపెయినర్ల జాబితా
ఎన్నికల సంఘానికి జాబితాను అందించిన టీఆర్ఎస్
జాబితాలో కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు

.టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ స్థిర, చరాస్తుల వివరాలు !
రూ. 20 లక్షల స్థిరాస్తులు ఉన్నట్టు అఫిడవిట్ లో వెల్లడి
సొంత వాహనం లేదు
చేతిలో రూ. 10 వేల నగదు మాత్రమే ఉంది

 

హుజూరాబాద్ ఉపఎన్నికకు సంబంధించి నామినేషన్ల పర్వం కూడా మొదలైంది. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ నిన్న నామినేషన్ దాఖలు చేశారు. మరోవైపు అన్ని పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఈ క్రమంలో 20 మంది స్టార్ క్యాంపెయినర్ల జాబితాను టీఆర్ఎస్ సిద్ధం చేసింది. ఈ జాబితాను ఎన్నికల సంఘానికి అందించింది.

టీఆర్ఎస్ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీశ్ రావు, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, బాల్క సుమన్, గువ్వల బాలరాజు, సుంకె రవి శంకర్, చల్లా ధర్మారెడ్డి, సతీశ్ కుమార్, ఆరూరి రమేశ్, నన్నపనేని నరేందర్, సండ్ర వెంకట వీరయ్య, దాసరి మనోహర్ రెడ్డి, ఇనుగుల పెద్దిరెడ్డి, కరీంనగర్ జడ్పీ ఛైర్మన్ విజయ, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, నారదాసు లక్ష్మణరావు ఉన్నారు.

టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ స్థిర, చరాస్తుల వివరాలు !

 

హుజూరాబాద్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న గెల్లు శ్రీనివాస్ యాదవ్ నిన్న నావినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ల స్వీకరణ తొలిరోజే ఆయన నామినేషన్ వేశారు. ఎన్నికల అఫిడవిట్ లో ఆయన తన స్థిర, చరాస్తుల వివరాలను పేర్కొన్నారు.

ఆయన ఇచ్చిన వివరాల ప్రకారం ఆయనకు సొంత వాహనం లేదు. వీణవంకలో సొంతిల్లు, 10.25 గుంటల స్థలం ఉంది. వీటి విలువను రూ. 20 లక్షలుగా చూపించారు. బ్యాంకుల్లో రూ. 2,82,402 డిపాజిట్లు ఉన్నాయి. తన భార్య పేరిట రూ. 11,94,491 బ్యాంకు డిపాజిట్లు ఉన్నాయి. భార్యకు 25 తులాల బంగారం ఉంది. తన వద్ద రూ. 10 వేలు, తన భార్య వద్ద రూ. 5 వేల నగదు మాత్రమే ఉందని తెలిపారు. ఆయన వద్ద గ్రాము బంగారం కూడా లేదు.

Related posts

తెలుగు దేశం ఎంపీలు ఎందుకు సైలెంట్ అయ్యారు ?

Drukpadam

అమెరికా అధ్యక్షుడు బైడెన్-కమలా హారిస్ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయా?

Drukpadam

భట్టి పాదయాత్రపై రాహుల్ గాంధీ ఆరా …!

Drukpadam

Leave a Comment