Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

నాగపూర్ లో ఘోరం …తల్లి జబ్బుకు మందుల కోసం బాలిక వ్యభిచార గృహానికి !

-క్యాన్సర్ తో బాధపడుతున్న తల్లి కోసం కన్యత్వాన్ని అమ్ముకునేందుకు సిద్ధమైన బాలిక
-నాగపూర్ లో ఘటన

-11 ఏళ్ల బాలికతో వ్యభిచారం చేయించే ప్రయత్నం
-రూ.5 వేలకు కన్యత్వాన్ని ఖరీదుకట్టిన వైనం
-బాలికను పునరావాస కేంద్రానికి తరలించిన పోలీసులు

తల్లి జబ్బుకు డబ్బులకోసం తన కన్యత్వాన్ని అమ్ముకునేందుకు సిద్దమైన 11 బాలిక సంఘటన నాగపూర్ లో వెలుగు చూసింది. ఇంతకీ ఘొరమైన నిర్ణయం తీసుకోవడం వెనక వారి కుటుంబ ఆర్థిక పరిస్థితులే కారణంగా ఉన్నాయి. తల్లి కాన్సర్ జబ్బుకు మందులు కొనే పరిస్థితిలేని ఆ కుటుంబంలో తన తల్లి పని చేసే దగ్గరే పనికి వెళ్లిన బాలికకు ఆమెకు తెలియకుండానే వ్యభిచార కూపంలోకి దించేందుకు ప్రయత్నం చేసిన ముగ్గురిని నాగపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ బాలికను పునరావాస కేంద్రానికి పంపించారు.

మహారాష్ట్రలో ఓ మైనర్ బాలిక క్యాన్సర్ తో బాధపడుతున్న తల్లి కోసం తీవ్ర నిర్ణయం తీసుకుంది. నాగ్ పూర్ లో నివసించే 11 ఏళ్ల బాలిక తల్లి క్యాన్సర్ బారినపడింది. తల్లికి చికిత్సకు డబ్బు లేకపోవడంతో ఆ బాలిక తన కన్యత్వాన్ని రూ.5 వేలకు అమ్ముకునేందుకు సిద్ధమైంది. అయితే ఓ అపార్ట్ మెంట్ లో ఆ బాలికతో వ్యభిచారం చేయిస్తున్నట్టు ఓ స్వచ్ఛంద సేవా సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులు వెంటనే స్పందించి రంగంలోకి దిగి ఆ బాలికను రక్షించారు.

ఈ ఘటనలో పోలీసులు అర్చన వైశంపాయన, రంజనా మిశ్రా, కవితా నిఖారే అనే ముగ్గురు మహిళలను అరెస్ట్ చేశారు. ఆ ముగ్గురు మహిళలు బాలికతో వ్యభిచారం అంటూ ఓ విటుడితో రూ.40 వేలకు బేరం కుదుర్చుకున్నట్టు గుర్తించారు. అరెస్టయిన వారిలో ఒకరైన అర్చనా వైశంపాయన, మైనర్ బాలిక తల్లి పరిచయస్తులని, అర్చన రెండేళ్ల కొడుకును ఆడించేందుకు బాలికను ఆమె తల్లే అర్చన ఇంటికి పంపేదని పోలీసులు తెలిపారు. అయితే, ఆ బాలిక అవసరాన్ని ఆసరాగా చేసుకుని డబ్బు కోసం ఆమె కన్యత్వాన్ని అర్చన తదితరులు అమ్మకానికి పెట్టారని పోలీసులు వెల్లడించారు.

తన కుమారుడి పుట్టినరోజు వేడుకలు జరుగుతున్నాయని చెప్పి ఆ బాలికను అర్చన వైశంపాయన వ్యభిచారం నిమిత్తం ఓ అపార్ట్ మెంట్ కు తీసుకెళ్లిందని, అయితే వారు మాట్లాడుకున్న విటుడే ఇన్ఫార్మర్ గా మారి సమాచారం అందించినట్టు పోలీసులు వివరించారు. కాగా, ఆ బాలికను పోలీసులు ప్రభుత్వ పునరావాస కేంద్రానికి తరలించారు.

Related posts

సెన్సేషన్ కోసమే కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి చేశాడు: సిద్దిపేట సీపీ శ్వేత

Ram Narayana

పదిహేనేళ్ల పాటు అంధురాలిగా నటించిన ఇటలీ మహిళ.. ఎందుకంటే!

Drukpadam

ఖమ్మం లో చర్చ్ కంపౌండ్ బ్రిడ్జి పై మొండం నుంచి వేరైనా తల కలకలం…

Drukpadam

Leave a Comment