Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

గడీల పాలన అంతం బీజేపీ పంతం ….బండి సంజయ్…

గడీల పాలన అంతం బీజేపీ పంతం ….బండి సంజయ్…
-బీజేపీ అధికారం లోకి వస్తే విద్య ,వైద్యం ఉచితమే
-హుజూరాబాద్లో ఈటల గెలుపును ఎవరు ఆపలేరు
-సర్వే లన్ని ఈటలకు అనుకూలమే
-హుజూరాబాద్ నివేదికలతో కేసీఆర్ దిమ్మదిరుగుతోంది..
-ఎన్ని స్కీములు తెచ్చిన , డబ్బులు పంచిన ఈటల ప్రజల హృదయాల్లో ఉన్నాడు

 

గడీల పాలనను భారతీయ జనతా పార్టీ అంతం చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామయాత్ర మొదటి విడత హుస్నాబాద్‌లో శనివారం సాయంత్రం ముగిసింది. ఈ సంద‌ర్భంగా భారీ స‌భ‌ను ఏర్పాటు చేశారు. ఈ స‌భ‌కు కేంద్ర‌మంత్రి స్మృతి ఇరానీ హాజ‌ర‌య్యారు. ఈ స‌భ‌లో తెలంగాణ బీజేపీ అధ్య‌క్షుడు బండి సంజయ్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

ఈటల గెలుపును ఆపలేరు.. ధర్మం కోసం పోరాటమేనంటూ బండి

ప్రజా సంగ్రామ యాత్ర ఇకపై కూడా కొనసాగుతుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో అమలయ్యే ప్రతి పథకానికి కేంద్రం నుంచి నిధులు వస్తున్నాయన్నారు. కానీ, ఈ ప్రభుత్వం అన్ని కుల వృత్తులను దెబ్బతీసింది. హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్ విజయాన్ని టీఆర్ఎస్ అడ్డుకోలేదని స్పష్టం చేశారు. తాను హిందుత్వం గురించి మాట్లాడితే తప్పా? అని ప్రశ్నించారు బండి సంజయ్. రాష్ట్రంలో హిందువుల పరిస్తితి ఏమిటో అందరికీ తెలిసిందేనన్నారు. 80 శాతం ఉన్న హిందువుల గురించి మాట్లాడవద్దా? అని ప్రశ్నించారు. బీజేపీ, బండి సంజయ్ హిందూ ధర్మం కోసమే పోరాడుతుందన్నారు. రామరాజ్యం కావాలో.. తాలిబన్ల రాజ్యం కావాలో తేల్చుకోవాలని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.

బీజేపీ అధికారంలోకి వస్తే ఉచిత విద్య, వైద్యం: బండి సంజయ్

ఇది బీజేపీ స్వాగ‌త స‌భ అని, బీజేపీ అధికారంలోకి వ‌స్తే ఉచిత వైద్యం, విద్య విష‌యంలో మొద‌టి సంత‌కం చేస్తామ‌ని అన్నారు బండి సంజయ్. 2023లో బీజేపీ అధికారంలోకి వ‌స్తుంద‌ని, అంద‌రికీ ఉచితంగా వైద్యం అందిస్తామ‌ని, స్కూళ్ల‌ను అభివృద్ధి చేస్తామ‌ని బండి సంజ‌య్ తెలిపారు. 36 రోజులపాటు, 348 కిమీ మేర పాద‌యాత్ర చేసిన‌ట్టు ఆయ‌న పేర్కొన్నారు. ల‌క్ష‌ల కోట్లతో ప్రాజెక్టులు ఎవ‌రికోసం క‌డుతున్నార‌ని, పాద‌యాత్రలో ఎవ‌ర్ని అడిగినా ఒక్క చుక్క‌నీరు కూడా రాలేద‌ని చెబుతున్నార‌ని మండిపడ్డారు. వ‌రి వేస్తే ఉరి ఎందుకు అని బండి సంజ‌య్ ప్ర‌శ్నించారు.

హుజూరాబాద్ నివేదికలతో కేసీఆర్ దిమ్మదిరుగుతోంది..

బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ నిర్వహించిన మొదటి దశ ‘ప్రజా సంగ్రామ యాత్ర’ ముగింపు సభలో బీజేపీ నేత ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. హుజురాబాద్‌లో అంబేద్కర్ రాజ్యాంగం అమలు కావడం లేదని.. కేసీఆర్ రాజ్యాంగం మాత్రమే అమలవుతోందని అన్నారు. ఐదు నెలలుగా హుజురాబాద్‌లో మద్యం ఏరులై పారుతోందని ఆయన అన్నారు. ఆగస్ట్ 28న భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం నుంచి మొదలైన ‘ప్రజా సంగ్రామ యాత్ర’ 36 రోజులపాటు కొనసాగి.. ఈ రోజు హుస్నాబాద్‌లో విజయవంతంగా ముగిసింది. పాదయాత్ర చేసిన కార్యకర్తలందరికీ నా అభినందనలు. హుజురాబాద్‌లో నన్ను ఓడించేందుకు కోట్లు ఖర్చు చేస్తున్నారు. ప్రగతి భవన్‌లో కూర్చుని కేసీఆర్ ఆదేశాలు ఇస్తుంటే… కొంతమంది అమలు చేస్తున్నారు. అక్టోబర్ 30న జరిగే కురుక్షేత్ర యుద్ధంలో ధర్మమే గెలుస్తుంది. హుజురాబాద్‌లో కేసీఆర్ అహంకారానికి, తెలంగాణ ఆత్మగౌరవానికి మధ్య పోరాటం జరుగుతోంది. హుజురాబాద్ ప్రజానీకం అంతా నన్ను గెలిపించాలని కోరుకుంటున్నారు. హుజురాబాద్‌లో 75% బీజేపీకి, టీఆర్ఎస్‌కి 25% మాత్రమే గెలుపు అవకాశాలు ఉన్నాయని నివేదికలు చెప్తుంటే… కేసీఆర్‌కి దిమ్మ తిరుగుతోంది. ఎన్ని దొంగ లెటర్స్ సృష్టించినా… అది వాళ్ళకే తిప్పి కొడుతుంది. నాలాంటి బక్క పలుచని ఉద్యమకారుడిని కొట్టాలని చూస్తే… అయ్యే పనేనా?. హుజురాబాద్ కురుక్షేత్రంలో గెలిచాక… ఆ తర్వాత 33 జిల్లాల్లో కురుక్షేత్రమే. ‘దళిత బంధు’ను 33 జిల్లాలకు అమలు చేయాలని కేసీఆర్‌ను డిమాండ్ చేస్తున్నా. అన్ని కులాల్లోని పేదలకు ఈ పథకాన్ని అమలు చేయాలి. బీజేపీని గెలిపించేందుకు 33 జిల్లాల ప్రజలు ఎదురు చూస్తున్నారు అని ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు.

 

Related posts

పవర్ గేమ్ ….ప్రధాని పర్యటనకు దూరంగా కేసీఆర్…

Drukpadam

ఎన్నికలంటే అందాల పోటీ కాదు: జైరాం రమేశ్!

Drukpadam

పోలవరం పై జగన్ రెడ్డి చేతులెత్తేశాడు …చంద్రబాబు

Ram Narayana

Leave a Comment