Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

ముంబై తీరంలో షిప్‌లో రేవ్‌పార్టీ.. పోలీసుల అదుపులో బాలీవుడ్ సూపర్ స్టార్ తనయుడు!

ముంబై తీరంలో షిప్‌లో రేవ్‌పార్టీ.. పోలీసుల అదుపులో బాలీవుడ్ సూపర్ స్టార్ తనయుడు!
రేవ్ పార్టీలో డ్రగ్స్ విక్రయంపై సమాచారం
గత రాత్రి అకస్మాత్తుగా దాడిచేసిన ఎన్‌సీబీ అధికారులు
పెద్దమొత్తంలో కొకైన్, ఎండీ స్వాధీనం
పది మంది వరకు యువతీ యువకుల అరెస్ట్
మరికాసేపట్లో ముంబైకి నిందితులు

ముంబయ్ సంద్రంలో రేవ్ పార్టీ …సినీ ప్రముఖులు వారి పిల్లలు ఈ పార్టీ లో పాల్గొన్నారని తెలుస్తుంది. రేవ్ పార్టీ బయట అయితే నిఘా ఉంది పట్టుబడతామనుకున్నారో ఏమో గాని పెద్దపెద్ద వాళ్ళు పిల్లలు కొంతమంది యువతులతో ఒక క్రూయిజ్ ను బుక్ చేసుకొని రేవ్ పార్టీకి సముద్రంలోకి వెళ్లారు .అక్కడికి ఎవరు రారని తాము ఎంజాయ్ చేయవచ్చినని భావించారు. తమ తోపాటు ఆ క్రూయిజ్ లో కావలసిన డ్రగ్స్ తీసుకున్నారు. యువతులను ఎక్కించుకున్నారు. ఇంకేముంది ఎంచక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. అందులో అర్థరాత్రి సముద్రలో చుట్టుపక్కల కు ఎవరు వచ్చి చూసే ఛాన్స్ కూడా లేదు . కొకైన్ ,ఇతర పట్టు ఇచ్చే డ్రగ్స్ , లాంటివి ఆ పార్టీలో ఉన్నాయి.యువకులంతా క్రూయిజ్ లో రేవ్ పార్టీ మత్తులో ఉండగా దాన్ని చుట్టూ ముట్టరు కొందరు .వారు ఎవరో అనుకున్నారు. కానీ వచ్చింది నిఘా విభాగమని తెలుసుకొనే లోపలే వారు రేవ్ పార్టీ లో రెడ్ హ్యాండెడ్ గా పట్టు బడ్డారు. అయితే అందులో ఉన్నవారిలో ప్రముఖ బాలీవుడ్ సూపర్ స్టార్ కుమారుడు ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది.

ముంబై తీరంలోని ఓ ఓడలో జరిగిన రేవ్ పార్టీపై గత అర్ధరాత్రి దాడిచేసిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) అధికారులు పలువురు యువతీ యువకులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో బాలీవుడ్ సూపర్ స్టార్ తనయుడు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. తీరంలోని కార్డిలియా క్రూయజెస్ ఎంప్రెస్ షిప్‌లో ఏర్పాటు చేసిన రేవ్ పార్టీలో డ్రగ్స్ విక్రయిస్తున్నట్టు సమాచారం అందుకున్న ఎన్‌సీబీ అధికారులు అకస్మాత్తుగా దాడిచేసి తనిఖీలు చేశారు.

ఈ సందర్భంగా పెద్దమొత్తంలో కొకైన్, ఎండీని స్వాధీనం చేసుకున్నారు. రేవ్ పార్టీలో చిందులేస్తున్న దాదాపు పదిమందిని అదుపులోకి తీసుకున్నారు. వీరందరినీ కాసేపట్లో ముంబైకి తీసుకురానున్నారు. కాగా, బాలీవుడ్ సహా అన్ని చిత్రపరిశ్రమలను డ్రగ్స్ భూతం వేధిస్తున్న సమయంలో తాజాగా ఓ సూపర్ స్టార్ తనయుడు రేవ్ పార్టీలో దొరకడం మరోమారు చర్చనీయాంశమైంది.

Related posts

చీకోటి ప్ర‌వీణ్ క‌స్ట‌మ‌ర్ల జాబితాలో ఓ మంత్రి, ఓ మాజీ మంత్రి, 16 మంది ఎమ్మెల్యేలు!

Drukpadam

ఖమ్మం జిల్లా తల్లాడ మండలం కుర్నవల్లి లో భారీ దొంగతనం!

Drukpadam

ఆఫ్ఘనిస్థాన్ లో మసీదుపై ఉగ్రదాడి… 100 మంది మృతి!

Drukpadam

Leave a Comment