Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

షారుఖ్ కుమారుడు రెగ్యులర్‌గా డ్రగ్స్ ఆర్డర్లు ఇచ్చేవాడా?

షారుఖ్ కుమారుడు రెగ్యులర్‌గా డ్రగ్స్ ఆర్డర్లు ఇచ్చేవాడా?

  • -వాట్సాప్‌ చాట్‌లో షాకింగ్ విషయాలు వెల్లడి
  • -వైద్య పరీక్షల అనంతరం అరెస్టు చేసిన ముగ్గురిలో ఆర్యన్ ఖాన్
  • -ముంబై తీరంలో క్రూయిజ్ షిప్‌లో జరిగిన రేవ్‌ పార్టీ
Aryan Khan WhatsApp chat

బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్‌ను నార్కొటిక్స్ బ్యూరో అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ముంబై తీరంలో ఒక క్రూయిజ్ షిప్‌లో జరుగుతున్న రేవ్‌ పార్టీపై రెయిడ్ చేసిన అధికారులు ఆర్యన్‌ సహా మొత్తం 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ పార్టీ గురించి 15 రోజుల క్రితమే అధికారులకు ఉప్పందినట్లు తెలుస్తోంది. అయితే దీనిలో ఇలా సెలెబ్రిటీల పిల్లలు ఉంటారని వారు ఊహించలేదని సమాచారం. ఈ క్రమంలో షారుఖ్ తనయుడు సహా పలువురు ప్రముఖుల పిల్లలు ఈ పార్టీలో దొరికిపోయారు.

విచారణ సందర్భంగా ఎన్సీబీ అధికారులు ఆర్యన్ వాట్సాప్ చాట్‌ను చెక్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. వీటి ప్రకారం, ఆర్యన్ తరచూ డ్రగ్స్ ఆర్డర్ ఇచ్చేవాడని తెలుస్తోంది. ముంబైలోని జేజే ఆసుపత్రిలో నిందితులందరికీ వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ముగ్గురిని అరెస్టు చేశారు. వారిలో ఆర్యన్ కూడా ఉన్నట్లు సమాచారం. కాగా, కుమారుడు అరెస్టవడంపై షారుఖ్ నుంచి ఎటువంటి స్పందనా రాలేదు.

Related posts

ఖమ్మం లో వరస దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరిపై పీడీ యాక్ట్ : పోలీస్ కమిషనర్

Drukpadam

భార్య పేరుపై రూ. 1.90 కోట్ల బీమా.. కారుతో తొక్కి చంపించిన భర్త!

Drukpadam

బెంగళూరులో హిజ్భుల్ ముజాహిదీన్ ఉగ్రవాది అరెస్ట్!

Drukpadam

Leave a Comment