Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
సినిమా వార్తలు

మా ఎన్నికలు పోటాపోటీగా ప్రకాష్ రాజ్ , మంచు విష్ణు ప్రచారం !

మా ఎన్నికలు పోటాపోటీగా ప్రకాష్ రాజ్ , మంచు విష్ణు ప్రచారం !
-బాలయ్య తో విష్ణు సెల్ఫీ పై ప్రకాష్ రాజ్ స్పందన
-మంచు విష్ణుకు మద్దతిస్తున్నామని వాళ్లేమైనా చెప్పారా?
-ఓ మీడియా చానల్ తో మాట్లాడిన ప్రకాశ్ రాజ్
-ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన వైనం
-పెద్దవాళ్ల పేర్లు మేం వాడుకోబోమని మంచు విష్ణుకు చురకలు
-తమది సెల్ఫీలు తీసుకునే ప్యానెల్ కాదని స్పష్టీకరణ
-సీనియర్ నటులను కలుస్తున్న మంచు విష్ణు
-వరుస సమావేశాలు నిర్వహిస్తున్న ప్రకాశ్

ఈనెల 10 మా ఎన్నికలు ….ప్రకాష్ రాజ్ ,విష్ణు ప్యానల్స్ హోరా హోరీగా తలపడుతున్నాయి. బాలయ్య తో సెల్ఫీ ఫోటో ను విష్ణు షేర్ చేయగా , ప్రకాష్ రాజ్ స్పందించారు. విష్ణు సీనియర్ నటులను కలుస్తుండగా , ప్రకాష్ రాజ్ వరుస సమావేశాలతో వాతావరణాన్ని వేడి ఎక్కిస్తున్నారు.

నేడు ‘మా’ సభ్యులతో సమావేశం నిర్వహించిన అనంతరం ప్రకాశ్ రాజ్ ఓ టీవీ చానల్ తో మాట్లాడుతూ తన అభిప్రాయాలు వెల్లడించారు. మంచు విష్ణు ప్రచారం ముమ్మరం చేశాడని, కృష్ణ, బాలకృష్ణ తదితరులను కలిశాడని, ఇండస్ట్రీలో చాలామంది తమపక్షానే ఉన్నారని మంచు విష్ణు చెబుతున్నారని యాంకర్ పేర్కొనగా, ఎవరు ఎవర్నైనా కలవొచ్చని ప్రకాశ్ రాజ్ బదులిచ్చారు. అయితే, మంచు విష్ణుకే తాము మద్దతు ఇస్తున్నామని వాళ్లేమైనా ప్రకటన చేశారా? అని ప్రశ్నించారు.

“మాది వాళ్లను వీళ్లను కలిసి సెల్ఫీలు తీసుకునే ప్యానెల్ కాదు. పెద్ద పెద్ద వాళ్ల పేర్లను వాడుకునే ప్యానెల్ కాదు. ఎవర్నైనా కలిసి నేను కూడా సెల్ఫీలు తీయగలను. బాలకృష్ణను కలిసి బొటనవేళ్లు పైకెత్తి చూపించడం అవసరమా? అసలు బాలకృష్ణ ఏంచెప్పారో? ఒకవేళ బాలకృష్ణ మమ్మల్నిందరినీ కాదన్నారని భావించాలా? నా మీదేమైనా ఆయనకి ద్వేషం ఉందా? అది మంచు విష్ణు తీసుకున్న సెల్ఫీ మాత్రమే… బాలకృష్ణ తీసుకున్న సెల్ఫీ కాదు. సెల్ఫీలతో ఎన్నికల్లో గెలవగలమా?.. ఛీ ఛీ!” అంటూ స్పందించారు.

ఫిలింనగర్ కల్చరల్ క్లబ్ లో ‘మా’ సభ్యులతో ప్రకాశ్ రాజ్ విందు సమావేశం

మరో వారం రోజుల్లో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు జరగనుండగా, ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు తమ ప్రచారం తీవ్రతరం చేశారు. మంచు విష్ణు సీనియర్ నటులను కలుస్తూ మద్దతు కోరుతుండగా, ప్రకాశ్ రాజ్ కీలక సమావేశాలు నిర్వహిస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నారు.

తాజాగా, ప్రకాశ్ రాజ్ నటీనటులతో ‘మా’ ఎన్నికలపై ప్రత్యేక భేటీ నిర్వహించారు. హైదరాబాదు ఫిలింనగర్ కల్చరల్ క్లబ్ వేదికగా ఈ విందు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి హాజరైన ‘మా’ సభ్యులకు ప్రకాశ్ రాజ్ తన మేనిఫెస్టోను, భవిష్యత్ ప్రణాళికలను వివరించారు. వారి నుంచి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.

అక్టోబరు 10న ‘మా’ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఎవరికివారే తమ విజయంపై ధీమాతో ఉన్నారు. ‘మా’ ఎన్నికల బరి నుంచి నటుడు సీవీఎల్ నరసింహారావు తన ప్యానెల్ ను ఉపసంహరించడంతో బరిలో ప్రకాశ్ రాజ్ ప్యానెల్, మంచు విష్ణు ప్యానెల్ మధ్య ప్రధాన పోటీ నెలకొంది.

 

 

 

 

బాలయ్య, మంచు విష్ణు ఖుషీ ఖుషీగా!

Manchu Vishnu met Nandamuri Balakrishna

‘మా’ ఎన్నికల్లో గెలుపే పరమావధిగా ముమ్మర ప్రచారం సాగిస్తున్న నటుడు మంచు విష్ణు వరుసగా సీనియర్ హీరోలను కలుస్తూ మద్దతు కూడగడుతున్నారు. తాజాగా మంచు విష్ణు అగ్రహీరో నందమూరి బాలకృష్ణను కలిశారు. ఇవాళ ఉదయం ‘అఖండ’ చిత్రం సెట్స్ పై బాలయ్యతో భేటీ అయ్యారు. ‘మా’ ఎన్నికల్లో తన ప్యానెల్ కు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరారు. తన ప్యానెల్ గెలిస్తే ఏమేం చేస్తామో బాలయ్యకు వివరించారు. అనంతరం మంచు విష్ణు ట్విట్టర్ వేదికగా వివరాలు తెలిపారు. బాలకృష్ణ మద్దతు తమకేనని ప్రకటించారు.

“థాంక్యూ ఫర్ వన్ అండ్ ఓన్లీ నటసింహం. బాలా అన్నా… ‘మా’ ఎన్నికల వేళ మీ మద్దతుకు, మీ ఆశీర్వాదాలకు కృతజ్ఞతలు. మీ వంటి వారు మా వెన్నంటి ఉండడం గౌరవంగా భావిస్తున్నాను” అంటూ మంచు విష్ణు స్పందించారు. దీనికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

Related posts

డ్రగ్స్ విక్రయిస్తూ పోలీసులకు పట్టుబడిన ‘సింగం’ సినిమా విలన్ మెల్విన్!

Drukpadam

ఏపీలో ముదురుతున్న సినిమా టికెట్ల వ్యవహారం… 50 థియేటర్ల మూసివేత!

Drukpadam

చూద్దాం ఏం జరుగుతుందో.. అన్నింటికీ సిద్ధమయ్యే సినిమా విడుదల చేశాం: బాలకృష్ణ‌

Drukpadam

Leave a Comment