Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఎంపీ కాకముందు నేనేంటో అందరికి బాగా తెలుసు … రైతు ఉద్యమం జస్ట్ ..రెండు నిముషాలు చాలు …కేంద్ర హోమ్ శాఖ సహాయమంత్రి అజయ్ కుమార్ మిశ్రా ….

ఎంపీ కావడానికి ముందు నేనేంటో అందరికీ బాగా తెలుసు.. జస్ట్ రెండు నిమిషాలు చాలు: రైతులపై కేంద్రమంత్రి తీవ్ర వ్యాఖ్యలు
గత నెల 25న మంత్రి పర్యటనకు నిరసనగా నల్లజెండాలతో రైతుల నిరసన
తాను తలచుకుంటే రైతులు రెండు నిమిషాల్లో పారిపోతారని హెచ్చరిక
ఒక్కసారి సవాలును స్వీకరిస్తే వెనకడుగు వేసే ప్రసక్తే లేదన్న మంత్రి

మంత్రిని, ఎంపీని కాకముందు తానేంటో ప్రజలకు తెలుసని, తాను తలచుకుంటే రైతులను దారిలో పెట్టేందుకు రెండు నిమిషాలు చాలంటూ హెచ్చరిస్తూ మాట్లాడిన కేంద్రమంత్రి అజయ్‌కుమార్ మిశ్రా వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్‌ఖేరిలో ఆదివారం ఆయన పర్యటన సందర్భంగా జరిగిన రైతుల ఆందోళన, అనంతరం చెలరేగిన హింసకు 9 రోజుల ముందు ఆయనీ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది.

గత నెల 25న మంత్రి తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఖేరి నియోజకవర్గంలో పర్యటించారు. విషయం తెలిసిన రైతులు నల్ల జెండాలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆగ్రహంతో ఊగిపోయిన మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. తాను తలచుకుంటే రైతులను దారిలో పెట్టేందుకు రెండు నిమిషాలకు మించి పట్టదని హెచ్చరించారు. తాను కనుక ఒక్కసారి సవాలును స్వీకరిస్తే వెనకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు. ‘‘నేను రంగంలోకి దిగితే మీరు (రైతులు) పాలియా నుంచే కాదు, లిఖింపూర్‌ను కూడా వదిలిపారిపోతారు’’ అంటూ మంత్రి హెచ్చరించారు.

Related posts

సభ నిర్వాణం తీరుపై సీఎం ,స్పీకర్ , శాశనసభ వ్యవహారాల మంత్రి లేఖ రాస్తా …భట్టి

Drukpadam

బెంగాల్ అసెంబ్లీ లో విచిత్ర సంఘటన … ప్రసంగం మద్యలోనే ఆపేసి వెళ్లిన గవర్నర్ …

Drukpadam

పాలేరు ఎమ్మెల్యే కందాల, పోలీసుల తీరుపై సీఎల్పీ నేత భట్టి ఫైర్ …

Drukpadam

Leave a Comment