Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

చింతకాని మండలం రాఘవాపురం లో కుల బహిష్కరణ…ఖమ్మం జిల్లాలో ఘటన …

చింతకాని మండలం రాఘవాపురం లో కుల బహిష్కరణ…ఖమ్మం జిల్లాలో ఘటన …
-కారణమైన సర్పంచ్ పై తగు చర్యలు తీసుకుని మాకు న్యాయం చేయాలి .
-పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టినందుకు కులం పేరుతొ దూషిస్తున్నారని ఆరోపణ
-చంపుతామని బెదిరిస్తున్నారని ఆందోళన
-సీపీ కి ఫిర్యాదు చేశామని వెల్లడి

నగరంలో స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఖమ్మం జిల్లా చింతకాని మండలం రాఘవాపురం గ్రామం (ఎస్టీ) ఎరుకుల కులానికి చెందిన బాధితుడు నాగరాజు తండ్రి పుట్టబంతి అచ్చయ్య మాట్లాడుతూ …. అగ్ర కులానికి చెందిన చింతకాని మండలం రాఘవాపురం గ్రామం సర్పంచి దగ్గర ఉండి నా కొడుకుని కుల బహిష్కరణ చేయించాడని ఆరోపించారు . తన కూతురు గీతాంజలి టూవీలర్ యాక్సిడెంట్ విషయంలో నా కొడుకు గ్రామ సర్పంచి మాట కాదని పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేస్తున్న నేపధ్యంలో మా మీద కక్ష కట్టి తన మాటను ధిక్కరించిననే కారణంతో కుల బహిష్కరణ చేయించి అనేక రకాలుగా నా కొడుకుని ఇబ్బందులకు గురిచేస్తున్నారని , నిన్ను చంపినా ఎవరు అడ్డురారని బెదిరించి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు . ఇదేమీ అన్యాయమని అడిగితే 22 సంవత్సరాల క్రితం ఇందిరమ్మ కోటా కింద వచ్చిన ఇల్లును లాక్కోవడానికి ప్రయత్నిస్తూ ఎరుకల నా కోడక అని కులం పేరుతో దూషిస్తున్నారని గత డెబ్బై సంవత్సరల నుండి ఇదే గ్రామంలో నివాసముంటున్నట్టు పేర్కొన్నారు . సర్పంచ్ బారి నుండి మాకు రక్షణ కల్పించాలని కోరారు . అలాగే టెక్నాలజీ పెరుగుతున్న సమయంలో దేశాల , గ్రామాలు , మండలాలు అనేక రకాలుగా టెక్నికల్ పరంగా మరియు విద్యారంగంలో అభివృద్ధి చెందుతున్న తరుణంలో కుల బహిష్కరణ లాంటివి జరగడం ఎంత వరకు న్యాయం అని ప్రశ్నించారు . తక్షణమే సర్పంచ్ పై తగు చర్యలు తీసుకుని కఠినంగా శిక్షించాలని వేడుకున్నారు . అట్టి విషయాన్ని దృష్టికి తీసుకెళ్లామని అలాగే పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేశామని ఈ సందర్భంగా తెలియజేశారు . ఈ కార్యక్రమంలో బాధితుడు కుటుంబసభ్యులు సుజాత , మనీషా , చిన్నకమా , గోవిందమ్మ , నాగబాబు పాల్గొన్నారు .

Related posts

చిన్నారిని దత్తత పేరుతొ వ్యభిచారంలోకి దించిన మహిళ

Drukpadam

పాకిస్థాన్ లో పోలీస్ స్టేషన్ పై దాడి.. పరుగులు తీసిన పోలీసులు!

Drukpadam

కారులో తిప్పుతూ మోడల్‌పై సామూహిక అత్యాచారం!

Drukpadam

Leave a Comment