Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

లకింపుర్ ఘటనకు భాద్యత వహిస్తూ కేంద్రమంత్రి అజయ్ మిశ్రా రాజీనామా ?

లకింపుర్ ఘటనకు భాద్యత వహిస్తూ కేంద్రమంత్రి అజయ్ మిశ్రా రాజీనామా ?
-అమిత్ షాతో కేంద్రమంత్రి అజయ్ మిశ్రా భేటీ..
-రాజీనామా చేయబోతున్నారు అనే వార్తలకు ఊతం
-లఖింపూర్‌ ఖేరీ ఘటన తర్వాత రాజీనామాకు ప్రతిపక్షాల డిమాండ్
-షాను కలవడానికి ముందు తన కార్యాలయంలో అరగంట పాటు గడిపిన మిశ్రా
-రాజీనామా వార్తలకు బలం

లకింపుర్ ఖేర్ ఘటనకు భాద్యత వహిస్తూ కేంద్ర మంత్రి పదవికి అజయ్ మిశ్రా రాజీనామా చేయబోతున్నారా ? అంటే అవుననే అంటున్నారు పరిశీలకులు … అజయ్ మిశ్రా ఈ రోజు సాయంత్రం అమిత్ షా ను కలవడంతో ఆయన రాజీనామా చేయబోతున్నారనే వార్తలకు బలం చేకూరింది.

దేశవ్యాప్తంగా సంచలనమైన లఖింపూర్‌ ఖేరీ ఘటన తర్వాత హోంమంత్రి అమిత్ షాతో మరోమంత్రి అజయ్ మిశ్రా భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. లఖింపూర్‌ ఖేరీ రైతుల నిరసనపైకి వాహనం దూసుకెళ్లిన ఘటనలో నలుగురు రైతులు సహా 8 మంది మరణించిన సంగతి తెలిసిందే. రైతులపైకి దూసుకెళ్లిన వాహనంలో మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఉన్నట్టు రైతులు ఆరోపిస్తున్నారు.

ఈ నేపథ్యంలో మిశ్రా రాజీనామా చేయాలంటూ ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. దీంతో అమిత్ షాతో మిశ్రా భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. రాజీనామా విషయాన్ని షాతో చర్చించేందుకే ఆయనతో భేటీ అయ్యారని చెబుతున్నారు. కాగా, షాను కలవడానికి ముందు అజయ్ మిశ్రా నార్త్ బ్లాక్‌లోని తన కార్యాలయంలో అరగంట పాటు గడిపినట్లు తెలుస్తోంది.

రైతులపై కేంద్ర మంత్రి వాహనం దూసుకొని పోయిన ఘటనలో 9 మంది మరణించారు. నిరసన తెలుపుతున్న రైతులపైకి కావాలనే కేంద్రమంత్రి అజయ్ మిశ్రా కుమారుడు వాహనం తో తొక్కించడంతో రైతులతో పాటు మరికొందరు చనిపోయిన విషయం తెలిసిందే . మరికొద్ది నెలల్లో ఎన్నికలు జరగనున్న తరుణంలో కేంద్రమంత్రి పై వచ్చిన ఆరోపణల తో బీజేపీ కి తలనొప్పిగా మారింది. అసలే రైతు ఉద్యమం తో ఇబ్బందులు పడుతున్న బీజేపీ కి యూ పీ లాంటి కీలక రాష్ట్రంలో జరిగిన ఈ సంఘటన మరింత మైనస్ గా మరే అవకాశం ఉండనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

Related posts

రాజకీయపార్టీల డ్రామాలు పక్కన పెట్టి ఆత్మహత్యలను నిరోదించండి …షర్మిల

Drukpadam

కిరణ్ కుమార్ రెడ్డిపై డొక్కా మాణిక్య వరప్రసాద్ సెటైర్లు!

Drukpadam

అవసరమైతే జగన్ ను కలుస్తా…బాలకృష్ణ!

Drukpadam

Leave a Comment