Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

రాజయ్య ఇదేందేయ్య … మళ్ళీ వివాదంలో రాజయ్య…

రాజయ్య ఇదేందేయ్య … మళ్ళీ వివాదంలో రాజయ్య…
-మరో వివాదంలో ఎమ్మెల్యే రాజయ్య
-చెప్పులేసుకుని బతుకమ్మ ఆడటంపై విమర్శలు
-హిందువులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్

డాక్టర్ తాటికొండ రాజయ్య …స్టేషన్ ఘనపూర్ కు చెందిన టీఆర్ యస్ ఎమ్మెల్యే …ఉన్నత విద్యావంతుడు ….కానీ తప్పటడుగులు వేయడం ఆ తరువాత నాలుక కరుచుకోవడం ఆయనకు అలవాటుగా మారింది. డిప్యూటీ సీఎం గా ఉన్న కాలంలో కాళోజి యూనివర్సిటీ గురించి ప్రభుత్వ నిర్ణయాన్ని వెల్లడించి చిక్కుల్లో పడి పదవి పోగొట్టుకున్నారు. తరువాత అనేక సందర్భాలలో నోరు జారడం అలవాటుగా మారింది.తాజాగా కేసీఆర్ మహులందరికి భర్తలాంటి వారు అని ఫ్లో లో అన్న సంగతి తెలిసిందే … తరువాత మరో కార్యక్రమం లో మరో వివాదం …తాజాగా బతుకమ్మ వేడుకల్లో చెప్పులు వేసుకున్నాడని హిందూ సంఘాలు మండి పడుతున్నాయి.

స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాడికొండ రాజయ్య మరో వివాదం చిక్కుకున్నారు. చెప్పులు వేసుకుని మహిళలతో కలిసి బతుకమ్మ ఆడటంపై హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

మాజీ ఉపముఖ్యమంత్రి, జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాడికొండ రాజయ్యను వరుస వివాదాలు చుట్టుముడుతున్నాయి. నాలుగు రోజుల క్రితం బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ మహిళందరికీ భర్త లాంటోడని ఆయన చేసిన వివాదాస్పదనమైన సంగతి తెలిసిందే. రాజయ్య వ్యాఖ్యలకు నిరసనగా చీరలు తగులబెట్టిన మహిళలు, క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో దిగొచ్చిన రాజయ్య తాను తప్పుగా మాట్లాడితే క్షమించాలని కోరారు. మరుసటి రోజే ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన వీడియో పడటంతో విపక్షాలు ఆయనపై దుమ్మెత్తిపోశాయి.

ఆ వివాదాలు మరిచిపోకముందే రాజయ్య మళ్లీ చిక్కుల్లో పడ్డారు. తెలంగాణ ఆడపడుచులు భక్తి శ్రద్ధలతో జరుపుకునే బతుకమ్మ పండగ బుధవారం నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. స్టేషన్ ఘన్‌పూర్‌లో జరిగిన సంబురాల్లో పాల్గొన్న రాజయ్య మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. అయితే ఎంతో పవిత్రంగా భావించే బతుకమ్మ వేడుకల్లో రాజయ్య చెప్పులు వేసుకుని పాల్గొనడం ఇప్పుడు వివాదాస్పదమైంది. ఆయనతో పాటు మరో ఇద్దరు నేతలు కూడా కాళ్లకు చెప్పులు వేసుకుని బతుకమ్మ ఆడారు. దీనికి సంబంధించిన వీడియో బయటికి రావడంతో హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. రాజయ్య చెప్పులు వేసుకుని బతుకమ్మ ఆడటం సిగ్గు చేటని, హిందూ సమాజం తలదించుకునేలా వ్యవహరించిన ఆయన బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని జనగామ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు ముక్క స్వామి డిమాండ్ చేశారు.

Related posts

ఆంధ్రకు సాధ్యం కాని ప్రత్యేక హోదా పుదుచ్చేరిలో ఎలా సాధ్యం…?

Drukpadam

ఎస్సీ, ఎస్టీ, బీసీలకు వ్యతిరేకంగా మహానాడు: మంత్రి అంబ‌టి రాంబాబు!

Drukpadam

వారిది పార్టీని చీల్చే య‌త్న‌మే!.. అసంతృప్త నేత‌ల భేటీపై ఖ‌ర్గే!

Drukpadam

Leave a Comment