Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో కొండా సురేఖకు దక్కని చోటు!

  కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో కొండా సురేఖకు దక్కని చోటు

-హుజూరాబాద్‌ ఉప ఎన్నికకు కాంగ్రెస్‌ క్యాంపయిన‌ర్ల‌ జాబితా విడుద‌ల‌
-20 మందితో క్యాంపయిన‌ర్ల‌ జాబితా
-జాబితాలో కాంగ్రెస్ నేత‌లు మాణిక్కం ఠాగూర్‌, రేవంత్ రెడ్డి, భ‌ట్టి, ఉత్త‌మ్
-కాంగ్రెస్ అభ్య‌ర్థిగా బల్మూరి వెంకట్

కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో కొండా సురేఖకు చోటు దక్కకపోవడం గణనార్హంగా రాజకీయపరిశీలకులు చెప్పుకుంటున్నారు.హుజురాబాద్ ఎన్నికల్లో కొండా సురేఖ పేరు బలంగా వినిపించింది. ఆమె పోటీ చేయబోతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే సురేఖ మూడు షరతులు పెట్టారని అందులో ఒకటి వరంగల్ తూర్పు నియోజకవరం తో పాటు పరకాల , హుజురాబాద్ టిక్కెట్లను తమ కుటుంబసభ్యులకే కేటాయించమన్నారని వార్తలు వచ్చాయి. అయితే ఆవార్తలను అటు సురేఖ గాని ,టీపీసీసీ గాని ఖండించలేదు. దీంతో ఆ ప్రచారానికి బలం చేకూరింది. ఆమె టికెట్ సంగతి ఎలా ఉన్న ఆమె తెలంగాణ లో బలమైన నాయకురాలు , ఆమెకు రాష్ట్ర వ్యాప్తితంగా మంచి సంబంధాలు ఉన్నాయి. ఫైర్ బ్రాండ్ అనే పేరుంది. పైగా పక్కనే ఉన్న ఆమెను హుజురాబాద్ నియోజకర్గంలో ప్రచారానికి ఉపయోగించుకుకపోవడం విడ్డురంగా ఉండనే అభిప్రాయాలూ ఉన్నాయి.

కొండా సురేఖతో పాటు మరో నలుగురు పేర్లు పరిశీలనలో ఉన్నాయని వాటిలో ఒకపేరు ప్రకటించే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. అయితే అనూహ్యంగా ఎన్ ఎస్ యూ ఐ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బలమూరి వెంకట్ ను కాంగ్రెస్ తన అభ్యర్థిగా ప్రకటించింది. ..

తెలంగాణ‌లోని హుజూరాబాద్ ఉప ఎన్నిక ఈ నెల 30న జ‌ర‌గ‌నున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో త‌మ‌ క్యాంపయిన‌ర్ల‌ జాబితాను కాంగ్రెస్ అధిష్ఠానం విడుద‌ల చేసింది. 20 మందితో క్యాంపయిన‌ర్ల‌ జాబితా విడుద‌ల చేసినట్లు కాంగ్రెస్ తెలిపింది.

ఈ జాబితాలో కాంగ్రెస్ నేత‌లు మాణిక్కం ఠాగూర్‌, రేవంత్ రెడ్డి, భ‌ట్టి విక్ర‌మార్క‌, ఉత్త‌మ్ కుమార్ రెడ్డి, జీవ‌న్ రెడ్డి, శ్రీధ‌ర్ బాబు, దామోద‌ర రాజ‌న‌ర్సింహా కూడా ఉన్నారు. కాంగ్రెస్ అభ్య‌ర్థిగా ఈ ఉప ఎన్నిక‌లో బల్మూరి వెంకట్ బ‌రిలోకి దిగుతున్న విష‌యం తెలిసిందే.     

 

 

Related posts

ఒక రోజు ముందుగానే ముగిసిన పార్లమెంటు శీతాకాల సమావేశాలు!

Drukpadam

టీఆర్ యస్ ఇకనుంచి బీఆర్ యస్ …భారత రాజకీయ చిత్రపటంపై మరోపార్టీ!

Drukpadam

కుట్రదారుల నుంచి రాజ్యాంగాన్ని కాపాడుకుందామని సీఎల్పీ నేత భట్టి !

Drukpadam

Leave a Comment