Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఊపర్ షేర్వాణీ… అందర్ పరేషానీ… కేసీఆర్ కీ కహానీ… అంతా అద్భుతమే!: షర్మిల వ్యంగ్యం

ఊపర్ షేర్వాణీ… అందర్ పరేషానీ… కేసీఆర్ కీ కహానీ… అంతా అద్భుతమే!: షర్మిల వ్యంగ్యం
-నిన్న అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగం
-బంగరు తెలంగాణ అంటూ వెల్లడి
-అన్నీ అద్భుతమేనంటూ ఓ పత్రికలో కథనం
-మహా అద్భుతం అంటూ ఎద్దేవా చేసిన షర్మిల

దాదాపు పదిరోజులపాటు జరిగిన అసెంబ్లీ సమావేశాలు ముగిశాయి.అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ తపనల ప్రాధాన్యతలపై అనేక సందర్భాలలో వివరణ ఇచ్చారు . దళితబందు , డబుల్ బెడ్ రూల్ ఇళ్లు , కేంద్ర విధానాలు , రాష్ట్ర అభివృద్ధి . ఇలా అనేక రకాల విషయాలపై కేసీఆర్ ప్రతిపక్షాలకు చురకలు అంటిస్తూ ఛలోక్తులు విసిరారు .మళ్ళీ మాదే అధికారమన్నారు .రాష్ట్రంలో ప్రాజక్టు విషయమై స్పందిస్తూ రాష్ట్రాల ప్రాజక్టులమీద కేంద్రం పెత్తనమేంటని అన్నారు. పక్క రాష్ట్రమైన ఏపీ సీఎం జగన్ పట్టుదల ఉన్నవాడంటూ కితాబు నిచ్చారు. శ్రీశైలం దగ్గర అదనపు వాటర్ విషయంలో జరుగుతున్నా వివాదానికి ఫులిస్టాప్ పెట్టి ప్రయత్నం చేశారు. సముద్రంలోకి పోతున్న నీళ్లను రెండు రాష్ట్రాలు వాడుకోవాలని అన్నారు. బరబరా గా చెపుతున్న అటు రాయలసీమ ,ఇటు తెలంగాణ , నెల్లూరు ప్రకాశం జిల్లాలోని మెట్టప్రాంతాలకు నీళ్లు కావాలని అందరం కలిసి వృధానీటిని వినియోగంలో తెచ్చి రాష్ట్రాల అభివృధ్ధికోసం పనిచేద్దామని అన్నారు.

అయితే షర్మిల మరోలా స్పందించారు. కేసీఆర్ పాలనపై వ్యంగ్య అస్త్రాలు సంధించారు. ఆయన శాసనసభలో చేసిన ప్రసంగంపై విరుచుకపడ్డారు. బంగారు తెలంగాణ అంటే ఇదేనా అంటూ కేసీఆర్ పాలనలోని పై ధ్వజమెత్తారు .

ఎలాంటి తెలంగాణను కోరుకున్నామో ఆ తెలంగాణ ఆవిష్కృతమైందని, రాష్ట్రంలో అన్నీ అద్భుతమేనంటూ నిన్న సీఎం కేసీఆర్ అసెంబ్లీలో చేసిన ప్రసంగంపై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల వ్యంగ్యం ప్రదర్శించారు. “ఊపర్ షేర్వాణీ… అందర్ పరేషానీ… కేసీఆర్ కీ కహానీ!” అంటూ ఎద్దేవా చేశారు.

“రాష్ట్రంలో కరోనా చావులు లేవు… అంతా అద్భుతమే! మూడెకరాల భూమి అందని దళితులు లేరు, డబుల్ బెడ్ రూం ఇళ్లు దొరకని పేదలు లేరు, రాష్ట్రానికి అప్పులు లేవు, తాగుబోతుల తెలంగాణ కాదు, గల్లీకొక బారు లేదు, వీధికొక వైన్ షాపు లేదు, పసిపిల్లల మీద, మహిళల మీద అత్యాచారాలు లేవు, నిరుద్యోగ చావులు లేవు, రైతుల ఆత్మహత్యలు లేవు… అంతా అద్భుతమే అంటూ ఎత్తిపొడిచారు. ఊసరవెల్లిలా రంగులు మార్చే మీ మాటలు అద్భుతం… మొత్తానికి మీ అబద్ధాల పాలన మహా అద్భుతం!” అంటూ వ్యాఖ్యానించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. కేసీఆర్ ప్రసంగం తాలూకు పత్రికా కథనాన్ని కూడా షర్మిల పంచుకున్నారు.

Related posts

జగన్ బెయిలు రద్దయితే ఏమవుతుందో చెప్పిన సీపీఐ నారాయణ!

Drukpadam

తన పార్టీ మార్పు వార్తలు కేసీఆర్ కుట్రలో భాగమే : ఈటల…

Drukpadam

నాగార్జునసాగర్‌లో బీజేపీకి వరుస షాకులు!

Drukpadam

Leave a Comment