Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

అప్పుల ఊబి లో జగన్ సర్కార్ …క్షిణించిన ఆర్ధిక పరిస్థితి :ఉండవల్లి!

అప్పుల ఊబి లో జగన్ సర్కార్ …క్షిణించిన ఆర్ధిక పరిస్థితి :ఉండవల్లి!
-ఏపీ సర్కారు దివాలా అంచుల్లో ఉంది… రూ.6 లక్షల కోట్ల అప్పు చేశారు
-రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్షీణించిందంటూ వ్యాఖ్యలు
-అమరావతిని కూడా తాకట్టు పెడుతున్నారని వెల్లడి
-సలహాదారులు ఏంచేస్తున్నారన్న ఉండవల్లి
-ఏపీ ఆర్థిక పరిస్థితిపై ప్రెస్ మీట్

తరచూ ఎదో ఒక విషయంలో తన అభిప్రాయాలను వెల్లడించే మాజీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఈసారి జగన్ సర్కార్ ఆర్ధిక పరిస్థిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఏపీ లోని జగన్ సర్కార్ అప్పులో ఊబిలో చిక్కుకొని కొట్టుమిట్టాడుతుందన్న ఉండవల్లి జగన్ సర్కార్ విధానాలను తూర్పార బట్టారు . ఇదెలా కొనసాగితే రాష్ట్రాన్ని దేవుడు కూడా రక్షించలేదని సంచలన విషయాలు వెల్లడించారు. ప్రభుత్వంలో ఉన్న సలహాదారులు ఏమి చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. దివాళా అంచుల్లో ఉన్న రాష్ట్రాన్ని కాపాడుకోవడంలో వైసీపీ సర్కార్ చేస్తున్న చర్యలు సూన్యమని ఆరోపణలు గుప్పించారు. చివరకు పోలవరం ప్రాజక్టు నిర్మాణం కూడా ముందుకు సాగటంలేదని చంద్రబాబు హయాంలో ఎలా ఉందో ఇప్పుడు కూడా అలానే ఉందని ఆరోపించారు.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్షీణించిందని, ప్రభుత్వ అప్పులు రూ.6 లక్షల కోట్లకు చేరాయని వెల్లడించారు. ఇదే పరిస్థితి ఇక ముందు కూడా కొనసాగితే రాష్ట్రం కోలుకోవడం కష్టమని, దివాలా తీయడం తథ్యమని అభిప్రాయపడ్డారు. అమరావతిని సైతం తాకట్టు పెట్టి అప్పులు తెచ్చే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. జగన్ సర్కారు ఎంతోమందిని సలహాదారులుగా నియమించుకుందని, రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోతుంటే వారంతా ఉండి ఏం ప్రయోజనం? అని ఉండవల్లి ప్రశ్నించారు.

రాష్ట్రంలో ప్రాజెక్టులు పూర్తి కాకపోయినప్పటికీ మంత్రులు హడావిడి చేస్తున్నారని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు హయాంలో ఎలా ఉందో, ఇప్పుడు కూడా అలాగే ఉందని వెల్లడించారు. నిర్వాసితుల సమస్యలు తొలగిపోనేలేదని అన్నారు.

ఏపీ లో ఆర్ధిక పరిస్థితులు , పోలవరం నిర్మాణం , సలహాదారుల పాత్ర పై ఉండవల్లి చేసిన విమర్శలపై జగన్ సర్కార్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.

Related posts

టీఆర్ యస్ లో పొంగులేటి ,మాజీమంత్రి తుమ్మలకు డోర్స్ క్లోజెనా ?

Drukpadam

జగన్ తనకు పదవిని ఇవ్వడంపై అలీ స్పందన!

Drukpadam

కేసీఆర్ కు ఇక అధికారం కలే …కొత్తగూడెం సభలో పొంగులేటి , జూపల్లి …!

Drukpadam

Leave a Comment